రైతులకు అందాల్సిన పనిముట్లు ఐకెపి అధికారులకే సొంతమా?

ఎల్కతుర్తి మండల మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబాల స్వామి

On
రైతులకు అందాల్సిన పనిముట్లు ఐకెపి అధికారులకే సొంతమా?

హుస్నాబాద్ సెప్టెంబర్ 6 ప్రజామంటలు (కందుకూరి రాజన్న)

హుస్నాబాద్ నియోజకవర్గం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఐకెపి ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల రైతులకు అందాల్సిన వ్యవసాయక పనిముట్లు ఐకెపి అధికారుల లాబాపేక్షనకే ఉపయోగపడుతున్నాయని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులకు అందాల్సిన వ్యవసాయక పనిముట్లు ఐకెపి ప్రభుత్వ ఉద్యోగి ఇంటి వద్దనే పెట్టుకుంటూ స్వలాభానికి వాడుకుంటున్నారని రైతులకు అందకుండా ప్రభుత్వ ఉద్యోగికి ఎలా ఇస్తారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత రెండు సంవత్సరాల నుండి ఐకెపి ఉద్యోగి ఇంటి వద్దనే ఉంచుకుంటూ రైతులు పొందాల్సిన లబ్ధి ఐకెపి ఒక ప్రభుత్వ ఉద్యోగి లబ్ధి పొందుతున్నాడు అని అంటున్నారు ఎల్కతుర్తి ఏపీఎం రవీందర్ అండదండలతో ఇదంతా నడుస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇకనైనా పై అధికారులు చొరచూపి ఐకెపి సెంటర్ ద్వారా రైతులకు అందాల్సిన ప్రతి ఒక్క పనిముట్లు రైతులకు అందే విధంగా చూడాలని కోరుతూ డిమాండ్ చేస్తున్నారు ఐకెపి సెంటర్కు వచ్చిన పనిముట్లు సెంటర్ వద్దనే ఉంచాలని ప్రభుత్వం ద్వారా వచ్చిన పనిముట్లు రైతులకు లబ్ధి పొందే విధంగా చూడాలని ఎల్కతుర్తి మండల మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంబాల స్వామి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు

Tags