ధర్మపురిలోని గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురిలోని గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్
గొల్లపల్లి సెప్టెంబర్ 02 (ప్రజా మంటలు) : అడిషనల్ కలెక్టర్,డీఎస్పీ మండల అధికారులు, నాయకులతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. ఈ సంధర్బంగా అధికారులతో మాట్లాడి తీసుకుంటున్న సహాయక చర్యలపైన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,కడెం ప్రాజెక్ట్ గేట్ల ఎత్తడం వల్ల గోదావరి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉందని కాబట్టి తీర ప్రాంత ప్రజలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని,అట్టి కేంద్రాల్లో ప్రభుత్వం అన్ని రకాల వసతులు కల్పించిందని,ఎవ్వరు అధైర్య పడాల్సిన అవసరం లేదనీ మీకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించడానికి అధికారులు,మా పార్టీ నాయకత్వం అందుబాటులో ఉందని తెలిపారు.