ప్రాజెక్ట్ లలోని వరద నీటిని భవిష్యత్ అవసరాలకు వినియోగించంది - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రాజెక్ట్ లలోని వరద నీటిని భవిష్యత్ అవసరాలకు వినియోగించంది - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదారాబాద్ సెప్టెంబర్ 01:
భారీ వర్షాలతో ప్రాజెక్టుల్లోకి వచ్చిన వరద నీటిని వృథా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు కుంటల్లో నీటిని నిల్వ చేయాలని సూచించారు.
నిండిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు లిఫ్ట్ చేయాలని, రోజుకు ఒక టీఎంసీ తగ్గకుండా డ్రా చేయాలని ఆదేశించారు. అలాగే, నంది, గాయత్రి పంప్ హౌస్‌ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని ముఖ్యమంత్రి సూచించారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్‌తో పాటు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలని ఆదేశించారు.
కడెం ప్రాజెక్టు, మిడ్‌మానేరు ప్రాజెక్టు, లోయర్ మానేరు డ్యామ్, అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా రంగనాయక సాగర్‌కు తరలిస్తున్నారు. రంగనాయక సాగర్ నుంచి నీటిని పంప్ చేసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపాలని.. అక్కడి నుంచి సింగూర్ ప్రాజెక్ట్, నిజాంసాగర్ ప్రాజెక్ట్ వరకు నీటిని తరలించాలని ఆదేశించారు.
కేంద్ర జల సంఘం మార్గదర్శకాల ప్రకారం మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో అన్ని ముందు జాగ్రత్తలు పాటిస్తూ సాధ్యమైనంత వరకు నీటిని నిల్వ చేయాలని అధికారులను ఆదేశించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)
కన్నులపండువగా మహాకాళి అమ్మవారి ఘటము ఊరేగింపు

పాశమైలారం ప్రమాద ఘటనపై ఎన్హెచ్ఆర్సీ లో పిటీషన్

ఆపదలో ఉన్న వారిని కాపాడే గొప్ప వృత్తి - గాంధీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్..

పవర్ గ్రిడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా దోమన్ యాదవ్

చుట్టాల బస్తీ యూపీహెచ్సీలో ఘనంగా డాక్టర్స్ డే సెలబ్రేషన్స్

శ్రీకృష్ణ భగవానుని ఆశీస్సులు అందరిపై ఉండాలి మాజీ జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత

ఈ ఏడాది ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం హపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ

తల్లిదండ్రులు జన్మనిస్తే... వైద్యులు పునర్జన్మ నిస్తారు...!

ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి, శాంతి, సమన్వయ భావాలను పెంపొందిస్తాయి - ఎమ్మెల్యే డా.సంజయ్ కుమా
