మన సంస్కృతిపై దాడి చేస్తే ఊపేక్షించకూడదు -మాజీ గవర్నర్ సాగర్ జీ

On
మన సంస్కృతిపై దాడి చేస్తే ఊపేక్షించకూడదు -మాజీ గవర్నర్ సాగర్ జీ

సమరసతా గళం - మన సంస్కృతిపై దాడి చేస్తే ఊపేక్షించకూడదు
అహిల్యాబాయి హోల్కర్ త్రియంతి ఉత్సవాలలో -మాజీ గవర్నర్ సాగర్ జీ

మెట్ పల్లి సెప్టెంబర్ 01 :

సమతా సిద్ధాంతంతోనే భారతదేశానికి ప్రపంచస్థాయిలో గుర్తింపు వచ్చిందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు అన్నారు. ఆదివారం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో జరిగిన అహిల్య బాయి హోల్కర్ త్రిశతాబ్ది వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కుల వివక్ష గూర్చి మూడు సంవత్సరాల క్రితమే మన దేశంలో బీజం పడిందని, కేవలం రాజ్యాంగం వల్ల దేశం ముందుకు వెళ్ళదని, కాలానుగుణంగా రాజ్యాంగాన్ని మార్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. చరిత్రాత్మకమైన భారత సంస్కృతిపై ఎవరు దాడి చేసినా మనం ఊపేక్షించకూడదని పిలుపునిచ్చారు. ప్రజల్ని నిరంతరం చైతన్యం చేసే ఇలాంటి సమతా కార్యక్రమాల్ని నిరంతరం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సమ్మేళన సమితి కన్వీనర్ బెజ్జారపు మురళి, కో - కన్వీనర్ పోహర్ తుకారాం, రాష్ట్ర మహిళా కన్వీనర్ కరెడ్ల రుక్మిణి, రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్, డా. నరేష్ బాబు, వి. మోహన్ రావు, డా. వెంకట్ రెడ్డి, మర్రి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Tags