రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ తో ఉద్యోగుల జే.ఏ.సీ. ప్రతినిధుల భేటీ - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ హామీ
రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ తో ఉద్యోగుల జే.ఏ.సీ. ప్రతినిధుల భేటీ - రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ హామీ
హైదరాబాద్ ఆగస్ట్ 31 :
రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగులకు మేలు చేకూర్చే విధంగా పెన్షన్ విధానాన్ని అమలు చేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చిస్తానని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఏకీకృత పెన్షన్ విధానాన్ని అనుమతించొద్దని, 1980 రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, లక్షలాది మంది ఉద్యోగులకు మేలు చేకూర్చాలని ఉద్యోగుల జే.ఏ.సీ. చైర్మన్ వీ. లచ్చిరెడ్డి, విజ్ఞప్తి మేరకు విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని చిన్నారెడ్డి హామీ ఇచ్చారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ లో ఉద్యోగుల జే ఏ సి చైర్మన్ వీ. లచ్చిరెడ్డీ నేతృత్వంలో ప్రతినిధుల బృందం చిన్నారెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేసింది. ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడాలని లచ్చిరెడ్డి కోరగా అందుకు చిన్నారెడ్డి సానుకూలంగా స్పందించారు.
ఉద్యోగుల పెన్షన్ విషయంలో త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వాస్తవ పరిస్థితులను వివరిస్తానని చిన్నారెడ్డి జే ఏ సి ప్రతినిధి బృందానికి హామీనిచ్చారు. ఉద్యోగుల పెన్షన్ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇప్పటికే స్పష్టత ఉందని, త్వరలోనే తగిన నిర్ణయం జరుగుతుందని చిన్నారెడ్డి తెలిపారు. ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, ఉద్యోగుల సంక్షేమం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారని చిన్నారెడ్డి పేర్కొన్నారు.
పెన్షన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు అండగా నిలుస్తుందని చిన్నారెడ్డి తెలిపారు. కేంద్ర రాష్ట్ర గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలకు ఉద్యోగులు ఇబ్బందులకు గురవుతున్నారని చిన్నారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి అని, ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చిన్నారెడ్డి పేర్కొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
