బద్రీనాథ్ దర్శనానికి వెళ్ళి వస్తూ..అనంతలోకాలకు -పద్మారావునగర్ స్కందగిరిలో విషాదం
బద్రీనాథ్ దర్శనానికి వెళ్ళి వస్తూ..అనంతలోకాలకు
-పద్మారావునగర్ స్కందగిరిలో విషాదం
* వర్షాల ధాటికి విరిగి పడిన కొండచరియలు...
* ఇద్దరు హైదరాబాద్ యాత్రికుల దుర్మరణం
* డెడ్ బాడీలు బాగా డ్యామెజ్ కావడంతో అక్కడే అంత్యక్రియలు
* పద్మారావునగర్ స్కందగిరిలో విషాదం
సికింద్రాబాద్ జూలై 07 (ప్రజామంటలు) :
బద్రీనాథ్ దైవ దర్శనానికి వెళ్ళిన ఇద్దరు హైదరాబాద్ యాత్రికులు మృత్యువాత పడ్డారు. స్థానికులు, ఫ్యామిలీమెంబర్స్ కథనం ప్రకారం..గత వారం క్రితం పద్మారావునగర్ లోని స్కందగిరికి చెందిన దార సత్యనారాయణ (50), నిర్మల్ షాహీ (36) తో పాటు మరో ఇద్దరు మొత్తం నలుగురు నార్త్ ఇండియా యాత్రకు బయలు దేరి వెళ్ళారు.
శనివారం ఉదయం ఉత్తరాఖండ్ లో రెండు బైక్లను అద్దెకు తీసుకున్న వీరు బద్రీనాథ్ ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా, ఉత్తర ఖండ్ లోని చమోలీ జిల్లా కర్ణప్రయోగ, గౌచర్ ల మద్యలో బద్రీనాథ్ నేషనల్ హైవేపై కొండచరియలు అకస్మాత్తుగా విరిగి సత్యనారాయణ, నిర్మల్ షాహీ లు నడుపుతున్న బైక్ పై పడ్డాయి.
పెద్ద, పెద్ద బండరాళ్ళు పడటంతో వీరిద్దరితో పాటు బైక్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. బండరాళ్ళ తాకిడికి ఇద్దరి శరీరాలు చిధ్రమైపోగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, శిథిలాల కింద నుంచి వారి డెడ్ బాడీలను బయటకు తీశారు. ఉత్తరాఖండ్ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా, నదులన్నీ ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయని సమాచారం.
పోలీసులు హైదరాబాద్ లోని వారి ఫ్యామిలీ మెంబర్స్ కు ప్రమాద సమాచారం అందించారు. వెంటనే ఇక్కడి వారి కుటుంబసభ్యులు ఫ్లైట్ లో ఆదివారం తెల్లవారుజామున హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళి, అక్కడి నుంచి ఉత్తరాఖండ్ వెళ్ళారు. అయితే ఇద్దరి శరీరాభాగాలు బాగా డ్యామేజ్ కావడంతో అక్కడి పోలీస్ అధికారుల సూచన మేరకు అక్కడే అంత్యక్రియలను నిర్వహించినట్లు ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ లో తెలిపారు.
ప్రమాదం వార్త తెలియగానే స్కందగిరిలో సత్యనారాయణ నివాసం ఉండే ప్రియా ఆపార్ట్ మెంట్ లో విషాదం నెలకొంది. సత్యనారాయణ ఓ ప్రైవేట్ జాబ్ చేస్తుండగా, అతడి భార్య హేమ చిన్న కిరాణ కొట్టు నడిపిస్తోంది. వీరికి ఒక కుమారుడు నిఖిల్ ఉన్నారు.
–––––––
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్‌ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
