అంగరంగ వైభవంగా గీత భవన్ లో సౌందర్యలహరి ప్రారంభం

On
అంగరంగ వైభవంగా గీత భవన్ లో సౌందర్యలహరి ప్రారంభం

అంగరంగ వైభవంగా గీత భవన్ లో సౌందర్యలహరి ప్రారంభం

జగిత్యాల జులై 07
(ప్రజా మంటలు):

జిల్లా కేంద్రంలోని గీత భవనంలో పురాణ బ్రహ్మ తిగుళ్ల విశు శర్మచే సౌందర్యలహరి పురాణ ప్రవచన కార్యక్రమం ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది.  ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు నంబి వేణుగోపాలాచార్య కౌశిక జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం  ప్రతినిత్యం ఉదయము 9:30నుండి మధ్యాహ్నం 12:30 వరకు ఈ కార్యక్రమం కొనసాగును. ఈనెల 13 వరకు 7 రోజులపాటు కార్యక్రమం కొనసాగును. కాగా ఆదివారం ప్రారంభం రోజున 9 మంది బాలికలచే కుమారి పూజ నిర్వహించారు. ప్రతినిత్యం కార్యక్రమ అనంతరం తీర్థప్రసాద వితరణ జరుగునని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం అనంతరం భజన కార్యక్రమం కొనసాగింది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
Tags