ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ
-బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో - వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
జగిత్యాల జిల్లా ప్రతినిధి /బొంగురాల రాజేష్, జులై 01 (ప్రజా మంటలు) :
జగిత్యాలతో బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నరు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోంది. ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ హయాంలోని కాంగ్రెస్ పార్టీ.2004లో మనతో పొత్తు పెట్టుకొని మన 26 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకునే పని చేసింది.అయినా సరే 2014లో ఇదే కాంగ్రెస్‌తో కొట్లాడి కేసీఆర్ ఆధ్వర్యంలో మనం తెలంగాణ తెచ్చుకున్నాం.2015 లో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది మీరంతా చూశారు.తెలంగాణను నడిపియ్యలేకపోతున్నారని చెప్పేందుకు, ప్రభుత్వం స్థిరంగా లేదని సర్కార్‌ను పడగొట్టే ప్రయత్నం చేశారు.ఆ పరిస్థితుల్లో రాజ్యాంగ బద్దంగా మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు మన పార్టీలో చేరారు.రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా మనం వ్యవహరించలేదు.అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరినప్పడు ఇదే రేవంత్ రెడ్డి వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలన్నాడు.
రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పాలె? ఎవరిని రాళ్లతో కొట్టాలె? ఎవరు పిచ్చి కుక్క?
ఇప్పుడు రేవంత్ రెడ్డిని కొట్టాలా? ఇక్కడి ఎమ్మెల్యే సంజయ్‌ను కొట్టాలా?
రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీవు మగాడివైతే నువ్వు తీసుకున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేపియ్,వాళ్లను మళ్లీ గెలిపించుకుంటే నువ్వు దమ్మునోడివి,ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. రాహుల్ గాంధీ ఏమన్నాడో కూడా వినాలె,ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరితే ఆటోమేటిక్‌గా సభ్యత్వం రద్దు అయ్యేలా చేస్తామని హైదరాబాద్‌లోనే చెప్పిండు.పాంచ్ న్యాయ్ పేరుతో ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో కూడా పెట్టిండు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేస్తుందేమెమిటీ ప్రజలు గుర్తించాలె.వాళ్ల పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి కూడా ఇదే అంశంపై సొంత పార్టీ పై విమర్శలు చేశాడు.బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.. మూడోసారి మూడో వంతు సీట్లలో గెలిచింది.14 సీట్లలో కొద్ది తేడాతో మాత్రమే ఓడిపోయింది.ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు ? మోడీ కావాలా? వద్దా? అన్నట్లుగా ప్రచారం చేశారు.దీంతో ఐతే ఎన్డీయే, ఇండియా కూటమిలో లేని పార్టీలకు ఇబ్బంది జరిగింది.ఒక్క బీఆర్ఎస్‌కు మాత్రమే కాదు.. ఏ కూటమిలో లేని సీపీఎం, వైఎస్ఆర్ సీపీ, బీజేడీ, అన్నాడీఎంకే, బీఎస్పీ, అకాలీదల్‌లకు కూడా ఎదురుదెబ్బ తగిలింది.రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇప్పుడిప్పుడే ఒక్కో అంశం అర్థమవుతోంది.రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చిన బీఆర్ఎస్‌ను బద్నాం చేశాడు.ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు.కానీ ఇప్పుడు అసలు విషయం తెలుస్తోంది.. ఓయూ విద్యార్థులు నిరసన మొదలుపెట్టారు.మోతీలాల్ అనే విద్యార్థి దీక్ష చేస్తుంటే పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీని తరిమి కొట్టారు.ఈ ఆరు నెలల్లో ఏం అభివృద్ధి జరిగింది.. అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు.మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బీఆర్ఎస్ గెలుస్తుంది.తెలంగాణ తెచ్చింది.. తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్.. ఇది చరిత్ర.. ఈ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు.ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టే విధంగా హామీలు ఇవ్వటం కారణంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.డిసెంబర్ 9 రుణమాఫీ అన్నారు.. ఏడు నెలలు అయ్యింది.. టైమ్‌పాస్ చేస్తున్నారు.వృద్ధులకు 4 వేలు, రైతులకు రైతు భరోసా రూ. 15,000, మహిళలకు రూ. 2,500 అంటూ నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారు.ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండు.వాటికి సంబంధించి ప్రజలు నిలదీస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనే ముసలం పుడుతుందని రేవంత్ భయపడ్డాడు.అందుకే ఎమ్మెల్యేలను గొర్రెలు, బర్రెల మాదిరిగా డబ్బులు పడేసి కొని తన దొడ్లో కట్టేసుకుంటున్నాడు.ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసేందుకు ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతుండు.ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకుంటూ బీఆర్ఎస్ ఖతం అయిపోయిందంటూ పుకార్లు పట్టిస్తున్నాడు. ఆయన మీడియాలో ఏదేదో కథనాలు రాయించుకుంటున్నాడు.కానీ బీఆర్ఎస్ మళ్లీ గెలవటం ఖాయం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్‌కే ప్రజలు పట్టం కడతారు.జగిత్యాల కార్యకర్తలను చూస్తే సంతోషంగా ఉంది.జగిత్యాలకు పట్టిన శని పోయిందన్నట్లుగా ధైర్యంగా కనిపిస్తున్నారు.కష్టాలు వచ్చినప్పుడే నాయకుల విలువ తెలుస్తుంది.జగిత్యాలలో కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా అన్నారు.
ఈకార్యక్రంలో మాజీ మంత్రులు గోడిసెల రాజేశం గౌడ్, ఎల్.రమణ, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, zp ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
భారత్ – యూరోపియన్ యూనియన్ వాణిజ్య ఒప్పందంపై సంతకం
న్యూఢిల్లీ, జనవరి 27 (ప్రజా మంటలు):
భారతదేశం – యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) చర్చలు విజయవంతంగా ముగిసి, ఒప్పందంపై అధికారికంగా సంతకం చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు.
ఈ ఒప్పందాన్ని ప్రపంచ వ్యాప్తంగా **“అన్ని ఒప్పందాలకు తల్లి”**గా పిలుస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఇది భారత్–యూరోపియన్ యూనియన్ మధ్య ఆర్థిక... సంచర జాతుల వారికి ఆహారం పంపిణీ
సికింద్రాబాద్, జనవరి 27 ( ప్రజా మంటలు):
77వ గణతంత్ర దినోత్సవాన్ని స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబెడ్కర్‌కు నివాళులు అర్పించారు. నగరంలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న సంచార జాతుల కుటుంబాలను గుర్తించి వారికి ఆహారం అందించారు.
దేశాభివృద్ధికి విద్యే ప్రధాన పునాది... జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం : ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాల, జనవరి 27 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ అభివృద్ధి ధ్యేయంగా బీఆర్ఎస్‌లో గెలిచి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాలకు రూ.62.5 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. గత అధికారుల నిర్లక్ష్యంతో మాస్టర్ ప్లాన్ లేక ఇష్టారీతిన నిర్మాణాలు జరిగాయని విమర్శించారు.
అభివృద్ధికి అడ్డంకులు... తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు):
తెలంగాణలోని 7 నగరపాలక సంస్థలు, 116 మున్సిపాలిటీలకు ఎన్నికల షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదీ ప్రకటించారు. నేటి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ముఖ్య తేదీలు
నామినేషన్లు: జనవరి 28 నుంచి 30 వరకు
పరిశీలన: జనవరి 31
ఉపసంహరణ గడువు: ఫిబ్రవరి 3... బీసీ కులగణన అవసరం - జనగణనపై జాగృతి రౌండ్ టేబుల్
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు)::
ఈ నెల 29న కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే జనగణన నేపథ్యంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు నవీన్ ఆచారి తెలిపారు.
బీసీలకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని, దేశవ్యాప్తంగా పకడ్బందీ కులగణన జరగాలని డిమాండ్ చేశారు.
ఒకే కులానికి భిన్న పేర్లు, వలస కులాల సమస్యలపై... గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారి సంతోష్ రావు : జాగృతి నేత కవిత తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్, జనవరి 27 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారిని ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల నుంచి దూరం చేయడానికి ప్రధాన కారణం సంతోష్ రావేనని జాగృతి నేత తీవ్ర ఆరోపణలు చేశారు. గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారిగా వ్యవహరిస్తూ కేసీఆర్ వ్యక్తిగత విషయాల వరకూ సమాచారాన్ని చేరవేసిన వ్యక్తి సంతోష్ రావేనని విమర్శించారు.
కేసీఆర్ ఫార్మ్... చెన్నైలో గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ :సీఎం ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా ప్రారంభం
చెన్నై, జనవరి 27:
తమిళనాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఉమెన్స్ సమ్మిట్ మంగళవారం, బుధవారం (జనవరి 27, 28) తేదీల్లో చెన్నైలోని నందంబాక్కం ట్రేడ్ సెంటర్ లో జరుగుతోంది. ఈ సదస్సును ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అధికారికంగా ప్రారంభించనున్నారు.
ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో వెల్లడించింది.... ఆస్కార్ అవార్డు లకు 10 సినిమాలు పోటీ
–వర్తమానం సంగమంగా మారిన సినిమా వేడుక
ప్రపంచ సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న 98వ అకాడమీ అవార్డ్స్ (Oscars 2026) ఈసారి కేవలం అవార్డుల వేడుకగా మాత్రమే కాకుండా —👉 సమాజం, రాజకీయాలు, చరిత్ర, మానవ విలువలపై చర్చకు వేదికగా మారింది.
🏆 బెస్ట్ పిక్చర్ విభాగం ఎందుకు ప్రత్యేకం?
ఈ... బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్
హైదరాబాద్ / వరంగల్ జనవరి 26, (ప్రజా మంటలు):మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన త్వరలో బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.
రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకున్న ఆయన, పార్టీ మార్పు వెనుక ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర ప్రయోజనాలే ప్రధాన కారణమని పేర్కొన్నారు. త్వరలో... ఇన్నయ్యకు జాగృతి అండగా ఉంటుంది: జనగాంలో కవిత వ్యాఖ్యలు
జనగాం, జనవరి 26 (ప్రజా మంటలు):
తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఎవరూ మాట్లాడని సమయంలోనే ‘దగాపడ్డ తెలంగాణ’ అనే పుస్తకాన్ని ప్రచురించి, 1997లో అదే పేరుతో సభ నిర్వహించి ఉద్యమానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఇన్నయ్య అని జాగృతి నేతలు పేర్కొన్నారు. తెలంగాణపై జరుగుతున్న అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎంతో మందిని ఉద్యమంలోకి తీసుకువచ్చారని తెలిపారు.... కల్లెడ గ్రామంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
జగిత్యాల, జనవరి 26 (ప్రజా మంటలు):
జగిత్యాల రూరల్ మండలంలోని కల్లెడ గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా జరుపుకునే జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవమని, ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విజ్ఞాన్ పాఠశాల కరస్పాండెంట్ మెనేని రవీందర్ రావు అన్నారు.
గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ చేట్కూరి... 