ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

On
ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ  - బీఆర్ఎస్   వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ

-బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో - వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

జగిత్యాల జిల్లా ప్రతినిధి /బొంగురాల రాజేష్, జులై 01 (ప్రజా మంటలు) :

జగిత్యాలతో బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో  భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నరు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సిగ్గు లేకుండా పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోంది. ఈ ఆయారాం, గయారాం అనే విషబీజానికి శ్రీకారం చుట్టిందే ఇందిరాగాంధీ హయాంలోని కాంగ్రెస్ పార్టీ.2004లో మనతో పొత్తు పెట్టుకొని మన 26 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను కలుపుకునే పని చేసింది.అయినా సరే 2014లో ఇదే కాంగ్రెస్‌తో కొట్లాడి కేసీఆర్ ఆధ్వర్యంలో మనం తెలంగాణ తెచ్చుకున్నాం.2015 లో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేసింది మీరంతా చూశారు.తెలంగాణను నడిపియ్యలేకపోతున్నారని చెప్పేందుకు, ప్రభుత్వం స్థిరంగా లేదని సర్కార్‌ను పడగొట్టే ప్రయత్నం చేశారు.ఆ పరిస్థితుల్లో రాజ్యాంగ బద్దంగా మూడింట రెండు వంతుల మంది ఎమ్మెల్యేలు మన పార్టీలో చేరారు.రాజ్యాంగాన్ని తుంగలో తొక్కే విధంగా మనం వ్యవహరించలేదు.అప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరినప్పడు ఇదే రేవంత్ రెడ్డి వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలన్నాడు.

రేవంత్ రెడ్డి ఇప్పుడు చెప్పాలె? ఎవరిని రాళ్లతో కొట్టాలె? ఎవరు పిచ్చి కుక్క? 

ఇప్పుడు రేవంత్ రెడ్డిని కొట్టాలా? ఇక్కడి ఎమ్మెల్యే సంజయ్‌ను కొట్టాలా?

రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే, నీవు మగాడివైతే నువ్వు తీసుకున్న ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేపియ్,వాళ్లను మళ్లీ గెలిపించుకుంటే నువ్వు దమ్మునోడివి,ఒక్క రేవంత్ రెడ్డి మాత్రమే కాదు.. రాహుల్ గాంధీ ఏమన్నాడో కూడా వినాలె,ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో చేరితే ఆటోమేటిక్‌గా సభ్యత్వం రద్దు అయ్యేలా చేస్తామని హైదరాబాద్‌లోనే చెప్పిండు.పాంచ్ న్యాయ్ పేరుతో ఇదే అంశాన్ని రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో కూడా పెట్టిండు కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చేస్తుందేమెమిటీ ప్రజలు గుర్తించాలె.వాళ్ల పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి కూడా ఇదే అంశంపై సొంత పార్టీ పై విమర్శలు చేశాడు.బీఆర్ఎస్ కార్యకర్తలు భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చింది.. మూడోసారి మూడో వంతు సీట్లలో గెలిచింది.14 సీట్లలో కొద్ది తేడాతో మాత్రమే ఓడిపోయింది.ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు ? మోడీ కావాలా? వద్దా? అన్నట్లుగా ప్రచారం చేశారు.దీంతో ఐతే ఎన్డీయే, ఇండియా కూటమిలో లేని పార్టీలకు ఇబ్బంది జరిగింది.ఒక్క బీఆర్ఎస్‌కు మాత్రమే కాదు.. ఏ కూటమిలో లేని  సీపీఎం, వైఎస్ఆర్ సీపీ, బీజేడీ, అన్నాడీఎంకే, బీఎస్పీ, అకాలీదల్‌లకు కూడా ఎదురుదెబ్బ తగిలింది.రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇప్పుడిప్పుడే ఒక్కో అంశం అర్థమవుతోంది.రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి లక్షా 60 వేల ఉద్యోగాలు ఇచ్చిన బీఆర్ఎస్‌ను బద్నాం చేశాడు.ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాడు.కానీ ఇప్పుడు అసలు విషయం తెలుస్తోంది.. ఓయూ విద్యార్థులు నిరసన మొదలుపెట్టారు.మోతీలాల్ అనే విద్యార్థి దీక్ష చేస్తుంటే పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్సీని తరిమి కొట్టారు.ఈ ఆరు నెలల్లో ఏం అభివృద్ధి జరిగింది.. అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారు.మళ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే బీఆర్ఎస్ గెలుస్తుంది.తెలంగాణ తెచ్చింది.. తెలంగాణను అభివృద్ధి చేసిన కేసీఆర్.. ఇది చరిత్ర.. ఈ చరిత్ర చెరిపేస్తే చెరిగిపోదు.ప్రజలకు ఎన్నో ఆశలు పెట్టే విధంగా హామీలు ఇవ్వటం కారణంగా మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.డిసెంబర్ 9 రుణమాఫీ అన్నారు.. ఏడు నెలలు అయ్యింది.. టైమ్‌పాస్ చేస్తున్నారు.వృద్ధులకు 4 వేలు, రైతులకు రైతు భరోసా రూ. 15,000, మహిళలకు రూ. 2,500 అంటూ నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారు.ఒకటి కాదు రెండు కాదు 420 హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గద్దెనెక్కిండు.వాటికి సంబంధించి ప్రజలు నిలదీస్తే.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనే ముసలం పుడుతుందని రేవంత్ భయపడ్డాడు.అందుకే ఎమ్మెల్యేలను గొర్రెలు, బర్రెల మాదిరిగా డబ్బులు పడేసి కొని తన దొడ్లో కట్టేసుకుంటున్నాడు.ఇచ్చిన హామీలను డైవర్ట్ చేసేందుకు ఎమ్మెల్యేలను ఎత్తుకుపోతుండు.ఒక్కో ఎమ్మెల్యేను చేర్చుకుంటూ బీఆర్ఎస్ ఖతం అయిపోయిందంటూ పుకార్లు పట్టిస్తున్నాడు. ఆయన మీడియాలో ఏదేదో కథనాలు రాయించుకుంటున్నాడు.కానీ బీఆర్ఎస్ మళ్లీ గెలవటం ఖాయం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్‌కే ప్రజలు పట్టం కడతారు.జగిత్యాల కార్యకర్తలను చూస్తే సంతోషంగా ఉంది.జగిత్యాలకు పట్టిన శని పోయిందన్నట్లుగా ధైర్యంగా కనిపిస్తున్నారు.కష్టాలు వచ్చినప్పుడే నాయకుల విలువ తెలుస్తుంది.జగిత్యాలలో కార్యకర్తలందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా అన్నారు.

ఈకార్యక్రంలో మాజీ మంత్రులు గోడిసెల రాజేశం గౌడ్, ఎల్.రమణ, కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, zp ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

డబల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇళ్ల అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

డబల్ బెడ్ రూమ్, ఇందిరమ్మ ఇళ్ల అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు)  పట్టణము లో అర్బన్ హౌసింగ్ కాలని డబల్ బెడ్ రూం,ఇందిరమ్మ ఇండ్ల కాలని నూకపల్లి లో అభివృద్ధి పనులను మున్సిపల్ అధికారులు,జగిత్యాల పట్టణ నాయకులతో కలిసి  పరిశీలించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  అర్బన్ హౌసింగ్ కాలనీ శివారు లో జగిత్యాల డంపింగ్ యార్డు ను పరిశీలించి,డంపింగ్...
Read More...
Local News 

36 వ వార్డులో అభివృద్ధి పనికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

36 వ వార్డులో అభివృద్ధి పనికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ జగిత్యాల అక్టోబర్ 15 (ప్రజా మంటలు)పట్టణ 36వ వార్డులో 36 లక్షలతో సీసీ డ్రైనేజీ స్లాబ్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ లు గిరి నాగభూషణం, అడువల జ్యోతి లక్ష్మణ్ ,కమిషనర్ స్పందన, డి ఈ ఆనంద్, ఏ ఈ...
Read More...
Local News 

ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే నిజమైన విజయం కొత్తగా ఎంపికైన డిఎస్పి లను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ 

ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే నిజమైన విజయం  కొత్తగా ఎంపికైన డిఎస్పి లను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్     జగిత్యాల అక్టోబర్ 15 ( ప్రజా మంటలు)   జిల్లా కు చెందిన అభ్యర్థులు ఇటీవల వెలువడిన  గ్రూప్ -1 ఫలితాల్లో   డిఎస్పి (Deputy Superintendent of Police) హోదాకు ఎంపికైన విష్ణువర్ధన్ రెడ్డి, ప్రతిభ లు బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో  జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.ఈ సందర్భంగా  ఈ...
Read More...
Local News 

ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ప్రారంభించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల అక్టోబర్ 15 ( ప్రజా మంటలు)పట్టణము లో అరవింద్ నగర్ లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణిపేట లో 13.50 లక్షలతో నూతనంగా నిర్మించిన సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్  ఈ కార్యక్రమంలో డి ఈఓ రాము,జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్,మాజీ మున్సిపల్ చైర్మన్...
Read More...
State News 

ప్రజా సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే మా లక్ష్యం - కల్వకుంట్ల కవిత

ప్రజా సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే  మా లక్ష్యం - కల్వకుంట్ల కవిత అక్టోబర్ 25- ఫిబ్రవరి 13 వరకు - నిజామాబాద్ లో ప్రారంభం హైదరాబాద్ లో ముగింపు హైదరాబాద్ అక్టోబర్ 15 (ప్రజా మంటలు): తెలంగాణ ప్రజల కష్టాలను, జిల్లాలోని ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే, " జాగృతి జనం బాట" పేర యాత్ర చేపట్టినట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఈరోజు తమ కార్యాలయంలో...
Read More...
Local News 

సిఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ 

సిఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్సీ ఎల్ రమణ     జగిత్యాల అక్టోబర్ 15 ( ప్రజా మంటలు)జిల్లాకు చెందిన పదిహేను మంది లబ్ధిదారులకు  సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన  2,65,500/- రూపాయలు విలువగల చెక్కులను  జగిత్యాల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ లబ్ధిదారులకు అందజేశారు.    ఈ కార్యక్రమంలో  బి  ఆర్ ఎస్ పట్టణ...
Read More...
Local News  State News 

సెంట్రల్గే లైబ్రరీ గేటు వద్దనే గ్రూప్-1 అభ్యర్థులతో కవిత "మాట ముచ్చట"

సెంట్రల్గే లైబ్రరీ గేటు వద్దనే గ్రూప్-1 అభ్యర్థులతో కవిత విద్యార్థులతో కలిసి చాయ్ తాగిన కవిత, పోలీసుల అదుపులో తెలంగాణ జాగృతి నాయకులు
Read More...
Local News 

గాంధీనగర్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ పై అవేర్నెస్

గాంధీనగర్ పీఎస్ పరిధిలో డ్రగ్స్ పై అవేర్నెస్ సికింద్రాబాద్, అక్టోబర్‌ 14 (ప్రజామంటలు): సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్, సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి  సూచనల మేరకు గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో డ్రగ్స్‌ మరియు అక్రమ రవాణాపై మంగళవారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కవాడిగూడ సత్వా మాల్‌, బన్సీలాల్పేట సీసీ నగర్‌లో డ్రగ్స్ పై అవేర్నెస్ కార్యక్రమాలను నిర్వహించారు. ఇన్‌స్పెక్టర్‌ బోస్‌ కిరణ్‌,...
Read More...
Local News 

థరూర్ క్యాంప్ బడిలో ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన

థరూర్ క్యాంప్ బడిలో ప్రపంచ మానసిక ఆరోగ్య అవగాహన జగిత్యాల అక్టోబర్ 14 (ప్రజా మంటలు): ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా, జెడ్పిహెచ్ఎస్ ధరూర్ క్యాంప్ పాఠశాలలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేశారు.   ఎన్ సీ డీ ప్రాజెక్ట్ ఆఫీసర్ డాక్టర్ అర్చన, సైకియాట్రిస్ట్ డాక్టర్ డింపుల్ హాజరై,విద్యార్థులు అందరూ ఒత్తిడి లేకుండా చదువుకోవాలని, మానసికంగా సంసిద్ధంగా ఈ...
Read More...
Local News  Crime 

మేడిపల్లి మండలంలో గంజాయి పట్టివేత

మేడిపల్లి మండలంలో గంజాయి పట్టివేత మేడిపల్లి అక్టోబర్ 14 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మేడిపల్లి గ్రామ శివారులో మంగళవారం ఎస్సై M. శ్రీధర్ రెడ్డి గంజాయి  తరలిస్తున్నారని గుర్తించి, వారివద్ద una గంజాయిని స్వాధీనం చేసుకొన్నారు. పోలీసులు గ్రామ శివారులో అనుమానాస్పదంగా ఉన్న తాండ్రియాల కు చెందిన బద్దం నాగరాజు (26),  కథలాపూర్ మండలం...
Read More...
Local News 

గాంధీ మెడికల్ కాలేజీలో పీజీలకు సీపీఆర్ పై అవెర్నెస్

గాంధీ మెడికల్ కాలేజీలో పీజీలకు సీపీఆర్ పై అవెర్నెస్ సికింద్రాబాద్, అక్టోబర్ 14 (ప్రజామంటలు) : గాంధీ మెడికల్‌ కాలేజీలో జరుగుతున్న సీపీఆర్‌ ( కార్డియో ఫల్మనరీ రిస్యూసిటేషన్ )  అవగాహన వారంలో భాగంగా మంగళవారం రెండవ రోజు ఏహెచ్ఎస్ వైద్య విద్యార్థుల కోసం ప్రత్యక్ష ప్రదర్శనలతో కూడిన ప్రాక్టికల్‌ సీపీఆర్‌ అవగాహన సెషన్‌ నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన, ప్రాణరక్షణలో సీపీఆర్‌ ప్రాధాన్యం,...
Read More...
Local News 

పట్టణం అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే డా.సంజయ్ సమీక్ష

పట్టణం అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే డా.సంజయ్ సమీక్ష జగిత్యాల అక్టోబర్ 14(ప్రజా    మంటలుఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల పట్టణం లో అభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్  జగిత్యాల పట్టణం వివిధ వార్డులలో TUFIDC , జనరల్ ఫండ్ తో చేపట్టిన రోడ్లు డ్రైనేజీ పనులు వర్షాల వల్ల పనులు నిలిచిపోయాయి అట్టి...
Read More...