చట్టాలపై విడతలవారీగా అధికారులకు, సిబ్బందికి శిక్షణ పూర్తి - ఎస్పీ అశోక్ కుమార్
చట్టాలపై విడతలవారీగా అధికారులకు, సిబ్బందికి శిక్షణ పూర్తి
- ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల జూన్ 30 (ప్రజా మంటలు):
జూలై 1 అనగా రేపటి నుంచి భారత ప్రభుత్వ నూతన నేరన్యాయ చట్టాలు-2023 అమలులోకి రానున్నట్లు జిల్లా ఎస్పి పేర్కొన్నారు. ఈ చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయన్నారు. అమల్లోకి రానున్న కొత్త చట్టాలు మనదేశ అంతర్గత భద్రతలో నూతన శకాన్ని ప్రారంభించనున్నాయని పేర్కొన్నారు. ఈ నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతులలో మార్పు వస్తుందని, ప్రజలకి మరింత సమర్థవంతంగా సత్వర సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు.*కొత్తగా రూపొందించిన మూడు చట్టాలు - *భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత మరియు భారతీయ సాక్ష్యా అధినియం.* జిల్లాలోని ఉన్న పోలీసు అదికారులకు , సిబ్బందికి విడతలవారీగా శిక్షణ కార్యక్రమని నిర్వహించడం జరిగిందన్నారు. ఈ మూడు కొత్త క్రిమినల్ చట్టాలలో సమకాలీన కాలం మరియు వాడుకలో ఉన్న సాంకేతికతలకు అనుగుణంగా అనేక కొత్త నిబంధనలు చేర్చడం జరిగిందని, బాధిత వ్యక్తుల హక్కులను పరిరక్షించడం, నేరాల విచారణను సమర్ధవంతంగా నిర్వహించడానికి అనుగుణంగా కొత్త క్రిమినల్ చట్టాలకు చాలా రూపొందించడం జరిగిందని అన్నారు. కొత్త చట్టాల వర్తింపు మరియు నేరాలు మరియు దానికి సంబంధించిన కేసులతో వ్యవహరిస్తున్నప్పుడు వాటిని ఎలా గ్రహించాలనే దానిపై పోలీసు శాఖకు చెందిన డిఎస్పీ నుండి కానిస్టేబుల్ అధికారులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మానవాళికీ ప్రథమ శత్రువు ప్లాస్టిక్ భూతం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఉత్తమ ఉపాధ్యాయుని అభినందించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

తల్లిదండ్రులను విస్మరిస్తే శిక్షార్హులే జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

భువనేశ్వర్–ముంబయి గంజాయి అక్రమ రవాణా రాకెట్ ఆటకట్టు

గాంధీ ఆసుపత్రిలో మెగా పీడియాట్రిక్ క్యాంపు

ఇబ్రహీంపట్నం మండలం లో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్

ముత్తారం మూలమలుపు చెట్ల తొలగింపు - స్పందించిన ముల్కనూర్ పోలీస్

రానున్న గోదావరి పుష్కరాల ప్రణాళికపై, ప్రాథమిక సమీక్ష ఆగమన, వాస్తు శాస్త్రం ప్రకారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం పునః నిర్మాణం ధర్మపురి పట్టణానికి మాస్టర్ ప్లాన్

గోదావరి పుష్కరాలను కుంభమేళా తరహాలో నిర్వహించాలి -రాష్ట్ర సంక్షేమ మంత్రి అడ్లూరి
.jpg)
మిసెస్ చికాగో యూనివర్స్ గా ధర్మపురి చెందిన సౌమ్య బొజ్జా

చాలా రాష్ట్రాలలో సగానికిపైగా ఓటర్లు ఏ కాగితం చూపక్కర లేదు - ఎన్నికల కమీషన్

శిల్పకళ, వాస్తుశిల్పి మూలపురుషుడు విశ్వకర్మ జిల్లా సమీకృత భవనంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు పాల్గొన్న •బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్
