పాత కక్షలు నేపథ్యంలో హత్య.ఇద్ధరు నిందితులకు జీవిత ఖైదు, రూ.5000- జరిమాన
పాత కక్షలు నేపథ్యంలో హత్య.ఇద్ధరు నిందితులకు జీవిత ఖైదు, రూ.5000- జరిమాన
జగిత్యాల జూన్ 25 (ప్రజా మంటలు) :
మెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వేంపేట గ్రామానికి చెందిన ధనరేకుల రాజేందర్ వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన జెల్ల రమేష్ మరియు అతని తమ్ముడు జెల్ల మహేష్ లకు రాజేందర్ కి మద్యలో పాత కక్షలు ఉన్నవి. విటిని మనుసులో పెట్టుకొని రాజేందర్ ను కత్తితో పొడిచి హత్యాయత్నం చేయగా వీరిపై మెట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరిగింది. రమేష్ మరియు మహేష్ లు జైలు నుoడి బెయిల్ పై బయటకు వచ్చిన తర్వాత పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకుని పరిష్కరించుకుందామని ప్రయత్నం చేయగా దీనికి ధనరేకుల రాజేందర్ నిరాకరించడం జరిగింది. కేసు విత్ డ్రా విషయంలో ధనరేకుల రాజేందర్ ఎంతకీ వినకపోవడం సరికి రమేష్ మరియు మహేష్ లు రాజేందర్ ను ఎలాగైనా చంపాలని ఉద్దేశంతో తేది 19-05-2020 రోజునా ఒంటరిగా ఉన్న రాజేందర్ ను గమనించిన రమేష్ మరియు మహేష్ లో తమ వెంట తెచ్చుకున్న కత్తితో రాజేందర్ మెడ పై, రెండు చేతులపై, మోకాళ్లపై విచక్షణారహితంగా పొడవుగా తీవ్ర గాయాలైన రాజేందర్ అక్కడికక్కడే మరణించడం జరిగింది.
మృతుని బార్య దనరేకుల హరిణి ఫిర్యాదు మేరకు మెట్ పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగినది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు నిదితులు అయన జెల్ల రమేష్, మహేష్ లను కోర్టులో హాజరు పరచడం జరిగింది. కేస్ ను విచారించిన న్యాయమూర్తి నీలిమ జిల్లా జడ్జి నిదితులకు జీవిత ఖైదు పాటు ఒక్కొక్కరికి 5000 /- రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు.
ఈ యొక్క కేస్ లో పీపీ గా మల్లికార్జున్ , ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా ఇన్స్పెక్టర్ రవికుమార్ ,ఎస్.ఐ సదాకర్ సి ఎం ఎస్ ఎస్ ఐ జి. రాజునాయక్, కానిస్టేబుల్ కిరణ్ కుమార్ మరియు కోర్టు కానిస్టేబుల్ రంజిత్ నిందితుల కి శిక్ష పడడం లో గౌరవ కోర్టుకు సాక్షాధారాలు అందించడం లో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. పై కేస్ లో నిందితులకు శిక్ష పడటం పడటం లో కృషి చేసిన పోలీసు అధికారుల ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
