మాకే పెద్ద దిక్కు మేము ఇచ్చే హామీ ఏమీలేదు అధిష్టాన వర్గానికి జీవన రెడ్డి అసంతృప్తి తెలుపుతాం -మంత్రి శ్రీధర్ బాబు  

On
మాకే పెద్ద దిక్కు మేము ఇచ్చే హామీ ఏమీలేదు అధిష్టాన వర్గానికి జీవన రెడ్డి అసంతృప్తి తెలుపుతాం -మంత్రి శ్రీధర్ బాబు  

మాకే పెద్ద దిక్కు మేము ఇచ్చే హామీ ఏమీలేదు
అధిష్టాన వర్గానికి జీవన రెడ్డి అసంతృప్తి తెలుపుతాం
-మంత్రి శ్రీధర్ బాబు
 

ఎటు తేల్చుకోలేని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

కాలమే నిర్ణయిస్తుంది- కార్యకర్తల అభిప్రాయమే ముఖ్యం

-జీవన రెడ్డి

జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలలో ఆందోళన రేపిన ఎమ్మెల్యే సంజయ్ చేరిక

జగిత్యాల జూన్ 24 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి) :

నలభై ఏళ్లపాటు కాంగ్రెస్ నాయకునిగా జగిత్యాల ప్రాంత ప్రజలకు సేవలు అందించిన ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన రెడ్డి జీవితంలో ఊహించని విధంగా, ఆయనకే తెలియకుండా, ఆయన నియోజకవర్గ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయనను కాలచి వేసింది. గత పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉంటూ, ఎవరితో పోటీపడి, అధికారంలో లేకున్నా పార్టీని కాపాడుకొన్న తననే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడని బాదపడుతున్న ఎమ్మెల్సీ జీవన రెడ్డి తన భాయిష్యత్ ను ఎటు తేల్చుకో లేకపోతున్నారు.

జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ బి ఆర్ ఎస్ పార్టీ నుండి పోటీ చేసి జీవన రెడ్డిపై గెలిచిన ఆరు నెలలకే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరడం, జీవన రెడ్డికి కనీస సూచన కూడా లేకపోవడంతో మనస్తాపం చెందిన ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని నిర్ణయించుకొన్న సమయంలో మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు ఆడలూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, విజయరామనరావు లు ఇతర కాంగ్రెస్ నాయకులు వచ్చి, సముదాయించి, సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని చెప్పి వెళ్లారు.   

 సాయంత్రం జగిత్యాల వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు దాదాపు రెండు గంటల పాటు ఎమ్మెల్సీ జీవన రెడ్డితో సంప్రదింపులు జరిపి, తొందరపాటులో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని, పార్టీ అధికారంలో ఉందని, ముందు ముందు తగిన ప్రాధాన్యత ఇచ్చేట్లుగా మాట్లాడుదామని, ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పినట్లు తెలుస్తుంది.

జీవన రెడ్డిని కలిసిన తరువాత బయటకు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు విలేఖరులతో మాట్లాడుతూ, జీవన రెడ్డి పార్టీకి పెద్ద దిక్కు. నాలబై ఏళ్లుగా పార్టీని ఈప్రాంతంలో బలంగా ఉంచిన నాయకుడు. ఆయనకు తెలియకుండా జరిగిన విషయంలో అధిష్టాన వర్గానికి, పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి దృష్టికి తీసుకెళ్ళి, సమస్య పరిష్కారం అయ్యేట్లు చేస్తామని చెప్పారు. ఆయనే పెద్ద దిక్కు అయితే ఆయన అడుగుజాడల్లో నడిచే మేము ఆయనకు ఎలాంటి హామీ ఇవ్వలేమని చెప్పారు. సమాచారలోపం వల్ల ఏర్పడ్డ మనస్తాపాన్ని తగ్గించడానికి, ఆయనతో మాట్లాడడానికి వచ్చినట్లు తెలిపారు.

పార్టీ ఆదేశం మేర గతంలో 2006, 2008 లో రెండుసార్లు బి ఆర్ ఎస్ నాయకుడు కాల్వకుంతల చంద్రశేఖర రావుపై కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేయడమే కాకుండా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ స్థానం నుండి పోటీ చేసి పార్టీకి అండగా ఉన్న జీవన రెడ్డి, రాష్ట్రంలోనే పెద్దదిక్కుగా ఉన్నారని, ఆయన అసంతృప్తి తొలగించడానికి కృషి చేస్తామని తెలిపారు.

 మంత్రి శ్రీధర్ బాబు వెళ్ళిన తరువాత, జీవన రెడ్డి మాట్లాడుతూ, మూడుసార్లు పోటీ చేసిన వ్యక్తిని, ఎమ్మెల్యేలు అవసరమని భావించి, ఎలాంటి సమాచారం లేకుండా చేర్చుకోవడంతో నేనే కాదు, జగిత్యాల ప్రాంత కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారని అన్నారు. ఎంత అవసరం అయినా, స్థానికి పార్టీ నాయకులను, కార్యకర్తలను కాదని, వారికి వ్యతిరేకంగా అధిష్టాన వర్గం ఎక్కడ కూడా వ్యవహరించడం సరికాదని అన్నారు.

నాలబై ఏళ్లుగా ఎన్నో కష్టలఉ భరించి, ఇక్కడ పార్టీని బలంగా నిలబెట్టిన నా భవిష్యత్ కార్యకర్తలు, నాయకులు  నిర్ణయిస్తుందని, కాలాన్ని మించినది ఏదిలేదని, అన్నిటినీ కాలమే పరిష్కారం చూపుతుందని, అందరితో కలిసి నడవడమే నా అభిమమతమని జీవన రెడ్డి తెలిపారు. తన రాజకీయ భవిష్యత్ కూడా కాలమే నిర్ణయిస్తుందని నిర్వేదంతో, ఆవేధనతో తెలిపారు.

------

Tags