ఎమ్మెల్యే సంజయ్ పార్టీ విడడం ఆత్మహత్య కన్నా హీనమైన చర్య
ఎమ్మెల్యే సంజయ్ పార్టీ విడడం ఆత్మహత్య కన్నా హీనమైన చర్య
జగిత్యాల జూన్ 24 (ప్రజా మంటలు)
జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి స్థానిక తహసిల్ చౌరస్తా వద్ద ధర్నా చేపట్టి దిష్టి బొమ్మను తగలబెట్టిన అనంతరం వారి ఇంటిని ముట్టడించిన కార్యక్రమంలో జగిత్యాల బిఆర్ఎస్ జిల్లా అద్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ,మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ,జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్,మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ,సీనియర్ నాయకులు ఓరుగంటి రమణారావు గారు రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ చైర్మెన్ లోక బాపు రెడ్డి పాల్గోన్నారు.
బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు మాట్లాడుతూ, ఉద్యమంలో పాల్గొనకున్న కెసిఆర్ పిలిచి మూడు సార్లు టికెట్ ఇచ్చారు.తల్లి పాలు తాగి రొమ్ము మీద గుద్ధినటువంటి సంజయ్ వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అని అన్నారు.
కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ, కష్ట కాలంలో పార్టీని మోసం చేసి స్వార్థంతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే డా.సంజయ్ ని జగిత్యాలలో తిరుగనివ్వమని.అలాంటి వారు బ్రతికున్న చచ్చిన శవంతో సమానమేనని అన్నారు.
జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ, ల్వకుంట్ల కవితక్క చంటి పిల్లాడిలా పట్టుకుని కాలికి బట్ట కట్టకుండా తనే ఎమ్మెల్యే గా తిరిగి మూడు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించి రెండు సార్లు ఎమ్మెల్యే గెలిపిస్తే నమ్మక ద్రోహానికి ఒక ప్రతిరూపం ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అని అన్నారు.
బిఆర్ఎస్ పార్టీ కుటుంబసభ్యులు కార్యకర్తలు సామాన్య ప్రజలు కూడా తమ ఓటు వృథా అయిందని స్వచ్ఛందంగా వచ్చి తీవ్రంగా ఖండించారు..
మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ, నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే బిఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పై గెలిచిన నువ్వు రాజీనామా చేసి మళ్ళీ పోటీకి రావాలని అని అన్నారు..
ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ హరిచారణ్ రావు,జెడ్పీటీసీ నాగం భూమన్న,కెడిసీసీ జిల్లా మెంబర్ రాంచందర్ రావు,ఎంపీపీ సంధ్యారాణి,రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు,వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి,రాయికల్ మండల అధ్యక్షుడు కొల శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు శీలం ప్రియాంక,ఉదయ శ్రీ, నాగేశ్వర్ రావు,పట్టణ ఉపాధ్యక్షుడు వొల్లెం మల్లేశం, ఎంపీటీసీలు,సర్పంచ్లు, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,పట్టణ మరియు మండల విభాగం నాయకులు, మహిళలు, నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
More News...
<%- node_title %>
<%- node_title %>
క్రిప్టో కరెన్సీపేర మోసం కేసులో మాజీ కార్పొరేటర్ కట్ల సతీష్ అరెస్ట్

ప్రజానాయకుల మోసాలతో విసిగిపోయిన నేపాల్ ప్రజలు -ప్రభుచావ్లా
.jpeg)
చార్లీ కిర్క్ ప్రారంభించిన టర్నింగ్ పాయింట్ ఉద్యమం ఆగిపోదు - ఎరికా కిర్క్

4 దశాబ్దాలుగా మానవ సేవే పరమావధిగా రోటరీ క్లబ్ సేవలు....ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్*

బుర్ర భాస్కర్ శర్మచే గీత భవన్ లో ఘనంగా కొనసాగిన కూర్మ పురాణం

నలంద కళాశాలలో ఘనంగా స్వాగతొత్సవ వేడుకలు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసిన బండ కార్తీక చంద్రారెడ్డి

ఏడు దశాబ్దాల వైద్య సేవల గాథ… గాంధీ మెడికల్‌కళాశాలకు జయహో

ఓల్డ్ బోయిన్ పల్లిలో మత్తు మందు తయారీ గుట్టు రట్టు

ఎల్. ఐ.సి. ఎవోఐ డివిజన్ "కో - కన్వీనర్" గా ఆమందు రాజ్ కుమార్

యూరియా గోదాం ను ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్

ఆర్యవైశ్య అభ్యున్నతే లక్ష్యంగా కృషి - రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వ సుజాత
