నవీన్ యాదవ్‌కు మద్దతుగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ ప్రచారం

On
నవీన్ యాదవ్‌కు మద్దతుగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ ప్రచారం

సికింద్రాబాద్ , నవంబర్ 02 (ప్రజా మంటలు): 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్‌కు మద్దతుగా సోమాజిగూడ డివిజన్ లోని ఎల్లారెడ్డి గూడలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా దుర్గాదేవి ఆలయంలో నవీన్ యాదవ్ గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

అనంతరం భారీ వర్షంలోనే ప్రచారంలో ముందుకు కదిలారు. స్థానిక వ్యాపారస్తులు, అపార్ట్ మెంట్ వాసులతో మమేకం అయ్యారు. ఈ క్రమంలో కూరగాయలు అమ్ముతూ చపాతీలు చేస్తూ ముందుకు నడిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.

ఆరు గ్యారంటీల అమలులో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర పథకాల్ని లబ్ధిదారులకు అందిస్తున్నామని చెప్పారు. ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ విస్తరణ, అభివృద్ధి పనుల గురించి వివరించారు. చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను ఆశీర్వ‌దించాల‌ని అభ్య‌ర్థించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తారని ఆశాభావం వ్యక్తం7 చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి నవీన్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని స్థానిక ఓటర్లను కోరారు. గత ప్రభుత్వం పదేళ్లలో రాష్టాన్ని అప్పులకుప్పగా మార్చిందని, అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తం అయ్యాయని తెలిపారు.

ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్న మ్యానిఫెస్టోలోని ఒక్కో పథకం అమలు చేస్తూ.. ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకున్నామని వివరించారు. ఇంకా చేయాల్సింది చాలా ఉందని, ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని కోరారు. ఈ ఉప ఎన్నిక ప్రచారంలో కోట నీలిమ వెంట సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News  State News 

నవీన్ యాదవ్‌కు మద్దతుగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ ప్రచారం

నవీన్ యాదవ్‌కు మద్దతుగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ ప్రచారం సికింద్రాబాద్ , నవంబర్ 02 (ప్రజా మంటలు):  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్‌కు మద్దతుగా సోమాజిగూడ డివిజన్ లోని ఎల్లారెడ్డి గూడలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా దుర్గాదేవి ఆలయంలో నవీన్ యాదవ్ గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు....
Read More...
National  International   State News 

కెన్యాలో కార్తీక మాస వనభోజనాలు..పూజలు

కెన్యాలో కార్తీక మాస వనభోజనాలు..పూజలు సికింద్రాబాద్, నవంబర్ 02 (ప్రజామంటలు) : కెన్యా దేశంలోని మోంబాసా లో స్థిరపడ్డ తెలుగు రాష్ర్టాల ప్రజలు ఆదివారం కార్తీక మాస పూజలు, వనభోజనాలు కార్యక్రమాలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. మోంబాసా లోని విశాలమైన హిందూ యూనియన్ పార్కు ప్రాంతంలో  మహిళలు రావి చెట్టు కింద ఉసిరి కొమ్మలు,ఉసిరి కాయలు, తులసి ఆకులు పెట్టి శివుడికి పూజలు...
Read More...
National  State News 

బీహార్‌ను మేడ్ ఇన్ ఇండియా హబ్‌గా మార్చడమే లక్ష్యం’: ప్రధాని మోదీ

బీహార్‌ను మేడ్ ఇన్ ఇండియా హబ్‌గా మార్చడమే లక్ష్యం’: ప్రధాని మోదీ ఆరా (బీహార్) నవంబర్ 02: బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటనలు చేశారు. ఆరాలో జరిగిన ఈ భారీ సభలో ఆయన మాట్లాడుతూ, “బీహార్‌ను మేడ్ ఇన్ ఇండియా హబ్‌గా మార్చడమే నా లక్ష్యం. బీహార్ ప్రజలు ఎన్డీఏతో ఉన్నారు” అని స్పష్టం చేశారు. “ఢిల్లీ...
Read More...

తెలంగాణ జాగృతిలో భారీగా బీసీ నాయకుల చేరికలు

తెలంగాణ జాగృతిలో భారీగా బీసీ నాయకుల చేరికలు హైదరాబాద్‌ నవంబర్ 02 (ప్రజా మంటలు): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కు బీసీ సమాజం నుంచి మద్దతు లభిస్తోంది. కవిత నాయకత్వం, బీసీ హక్కుల కోసం ఆమె చేస్తున్న కృషి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది బీసీ నాయకులు జాగృతి లో...
Read More...
Local News  State News 

తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రకటన

తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రకటన హైదరాబాద్ నవంబర్ 03 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మోరం వీరభద్రరావు, జాడి శ్రీనివాస్ నియమితులయ్యారు. టీజేటీఎఫ్ నూతన కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రకటించారు. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్  విద్యారంగ వికాసానికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.  తెలంగాణ...
Read More...
National  Sports  State News 

🇮🇳 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ — భారత మహిళలు 298/7 స్కోరుతో ఇన్నింగ్స్ పూర్తి

🇮🇳 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ — భారత మహిళలు 298/7 స్కోరుతో ఇన్నింగ్స్ పూర్తి నవి ముంబై నవంబర్ 02: నవి ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో జరుగుతున్న 2025 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. టాస్‌ నెగ్గిన దక్షిణాఫ్రికా మహిళల కెప్టెన్ లౌరా వోల్వార్ట్ట్ ఫీల్డింగ్ ఎంచుకున్నా, భారత బ్యాటర్లు తమ దూకుడు ఆటతో స్కోర్‌బోర్డ్‌ను రన్‌లతో నింపారు. ఓపెనర్ స్మృతి...
Read More...

భారత్‌ vs దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచకప్ ఫైనల్‌ – శఫాలీ, స్మృతీ అద్భుత ఆరంభం

భారత్‌ vs దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచకప్ ఫైనల్‌ – శఫాలీ, స్మృతీ అద్భుత ఆరంభం   ముంబయి నవంబర్ 02: నవి ముంబయిలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత్ జట్టు అద్భుత ఆరంభం చేసింది. ఓపెనర్లు శఫాలీ వర్మా, స్మృతీ మందానా సాహసోపేత బ్యాటింగ్‌తో భారత జట్టుకు బలమైన మొదటి పునాది వేశారు. ఇద్దరూ దక్షిణాఫ్రికా బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్కోరు వేగంగా పెంచుతున్నారు. చరిత్ర సృష్టించాలన్న హర్మన్‌ప్రీత్ కౌర్...
Read More...

బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన LVM3-M5 రాకెట్ ద్వారా CMS-3 కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగం

బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన LVM3-M5 రాకెట్ ద్వారా CMS-3 కమ్యూనికేషన్ ఉపగ్రహ ప్రయోగం శ్రీహరికోట నవంబర్ 02: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో గర్వకారణమైన ఘనతను సాధించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి బాహుబలి రాకెట్‌గా పేరుగాంచిన LVM3-M5 రాకెట్ ద్వారా CMS-3 కమ్యూనికేషన్ ఉపగ్రహంను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన CMS-3 ఉపగ్రహం బరువు 4,410 కిలోలుగా ఉంది....
Read More...
Local News  State News 

రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమా? — దావ వసంత సురేష్ ప్రభుత్వంపై విమర్శ

రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమా? — దావ వసంత సురేష్ ప్రభుత్వంపై విమర్శ సారంగాపూర్, నవంబర్ 02 (ప్రజా మంటలు): జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ గారు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ఆమె మాట్లాడుతూ, “రైతు ప్రభుత్వం అంటే రైతులను గోస పెట్టడమా? కాలం, ప్రకృతి తో పాటు ప్రభుత్వం కూడా రైతులపై పగబట్టినట్లుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. సారంగాపూర్...
Read More...

క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంచుతాయి — ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంచుతాయి — ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జగిత్యాల (రూరల్), నవంబర్ 02 (ప్రజా మంటలు):జగిత్యాల పట్టణంలోని వివేకానంద మినీ స్టేడియంలో జరిగిన గిరీష్ సింగ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ 2025 కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొని ట్రోఫీ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “క్రీడలు మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయి. యువత క్రీడల్లో చురుకుగా...
Read More...
Local News 

నిరాశ్రయులు, సంచార జాతులకు దుస్తులు పంపిణి

నిరాశ్రయులు, సంచార జాతులకు దుస్తులు పంపిణి సికింద్రాబాద్  నవంబర్ 02 (ప్రజా మంటలు): హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు స్కై ఫౌండేషన్ నిర్వాహకులు దుస్తులు పంపిణి కార్యక్రమం నిర్వహించారు. దుస్తులు అందుకున్న నిరాశ్రయులు, సంచార జాతుల వారు స్కై ఫౌండేషన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ డాక్టర్....
Read More...
Local News 

భౌతికంగా దూరంగా ఉన్నా... వారి జ్ఞాపకాలు శాశ్వతంగా ఉంటాయి :ఎమ్మెల్యే తలసాని .

భౌతికంగా దూరంగా ఉన్నా... వారి జ్ఞాపకాలు శాశ్వతంగా ఉంటాయి :ఎమ్మెల్యే తలసాని . . సికింద్రాబాద్,  నవంబర్ 02 ( ప్రజా మంటలు):  మరణం భౌతికంగా వ్యక్తులను దూరం చేసినప్పటికీ, వారి జ్ఞాపకాలు, వారి పట్ల ఉన్న ప్రేమ మాత్రం శాశ్వతంగా ఉంటుందని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆత్మల దినం (ఆల్ సోల్స్ డే) సందర్భంగా బన్సీలాల్ పేట డివిజన్ లోని...
Read More...