ప్రతి పిర్యాదు పట్ల స్పందిస్తాం: గంజాయి రవాణా, విక్రయాలపై పూర్తిస్థాయిలో నిఘా జిల్లా ఎస్పి అశోక్ కుమార్
ప్రతి పిర్యాదు పట్ల స్పందిస్తాం:శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు గంజాయి రవాణా, విక్రయాలపై పూర్తిస్థాయిలో నిఘా
జిల్లా ఎస్పి అశోక్ కుమార్
జగిత్యాల జూన్ 21( ప్రజా మంటలు )
జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత ప్రధాన లక్ష్యo అని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్ అన్నారు జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఎస్పి గారు మాట్లాడుతూ... జిల్లా పరిధిలోని సామ్యాసుడిని దృష్టిలో పెట్టికోని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ వుంటుందని, శాంతి భద్రతల విషయంలోను కఠినంగా వుంటామని, ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తప్పావు , విద్వేషాలను రెచ్చగోట్టేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తాము అన్నారు. మహిళలు రక్షణ కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ముఖ్యంగా పోకరిలా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు షీ టీమ్ పనిచేస్తుంది. మహిళల రక్షణకై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. షీ టీం ఫోన్ నెంబర్( 8712670783) తెలిసేలా ఏర్పాటు చేశాం. ఆకతాయిలా వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు మహిళలు విద్యార్థినిలు నిర్భయంగా ముందుకు రావాలని సూచించారు. రౌడీ షీటర్లు, పాత నేరస్తుల కదలికపై పోలీస్ స్టేషన్ల వారీగా నిరంతరగా నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని ఎవరైనా ఒకటి కంటే ఎక్కువ నేరాలకు పాల్పడితే రౌడీషీట్ ఓపెన్ చేస్తాం అన్నారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణాపై పటిష్ట నిఘ ఏర్పాటు చేయడం జరిగిందని, గంజాయి బారిన పడిన యువత తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన పై దృష్టి సారించాలి అన్నారు. సైబర్ నేరస్తులు కొత్త విధానాలు కొత్త మార్గాలను అనుసరిస్తూ ప్రజలను ఆర్థికంగా మోసం చేస్తున్నారు వాటినీ అరికట్టేందుకు ప్రజలకు సైబర్ నేరాల నియంత్రణకు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1930 గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా అన్నారు. జిల్లాలో అనుమతి లేకుండా ఫైనాన్స్ లు నిర్వహించిన ,సామాన్యుల నుంచి అధిక వడ్డీ వసూలు చేసిన చట్టపరమైన చర్యలకు వెళ్తాం. వడ్డీ వ్యాపారులు వేధిస్తే బాధితులు నేరుగా సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.జిల్లా నుంచి గల్ఫ్ వెళ్ళేవారు నకిలీ ఏజెంట్లకు డబ్బులు ఇచ్చి మోసపోవద్దు. ఇమ్మిగ్రేషన్, చట్టబద్ధత ఉన్నవారు నుంచి వీసాలు పొందాలి ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి గల్ఫ్ మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు చేపడతాం. బాధితుల ఫిర్యాదు చేస్తే తక్షణమే కేసులు నమోదు చేస్తామన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
డిఎం అండ్ హెచ్ఓ చొరవతో జీలుగుల ఆరోగ్య ఉప కేంద్రానికి కరెంటు మీటర్ మంజూరు

కొంత్తకొండలో ఘనంగా మంత్రి పొన్నం జన్మదిన వేడుకలు

మంత్రి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన యువజన కాంగ్రెస్ నాయకులు*

గొల్లపల్లి మండల కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల భవనం

పాకిస్తాన్ పై భారత దాడి - బన్సీలాల్ పేట లో బీజేపీ సంబరాలు..

క్రీడా మైదానం కొరకు ప్రభుత్వ భూమిని పరిశీలించిన ఆర్డీవో మధుసూదన్
.jpg)
సింధూరం తో పులకరించిన పెహల్గాం పుడమి

సైలెన్సర్లు మార్పడి చేసి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే చట్టపరమైన చర్యలు: జిల్లా ఎస్పి అశోక్ కుమార్

వాసవి మాత జయంతిని పురస్కరించుకుని మాతలచే సామూహిక కుంకుమార్చన ,పల్లకి సేవ శోభ యాత్ర

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ శిబిరం ప్రారంభం

ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు*🚩🚩🚩🚩

వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ ఉగాండా యువతి
.jpeg)