రోడ్డుపై దొరికిన రూపాయలను ట్రాఫిక్ పోలీసులకు అందజేసి ఔదార్యాన్ని చాటుకున్న ఆటో డ్రైవర్.

On
రోడ్డుపై దొరికిన రూపాయలను ట్రాఫిక్ పోలీసులకు అందజేసి  ఔదార్యాన్ని చాటుకున్న ఆటో డ్రైవర్.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల జూన్ 15 ( ప్రజా మంటలు ) : 

జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో పాత బస్టాండ్ సమీపంలో బైక్ పై వెళ్తున్న లెల్లెల బాలకృష్ణ జేబులోంచి 23 వేల ఒక వంద రూపాయలు పడిపోవడంతో వెనకాలనే వస్తున్న ఆటో డ్రైవర్లు గడ్డం శ్రీనివాస్, ఎం డి రిజ్వాన్ గమనించి ట్రాఫిక్ పోలీస్ పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న హెచ్ సి రాజమౌళి కి రూపాయలు అప్పజెప్పారు. 

వేంటనే బైక్ పై వెళ్లిన వారి వివరాలు తెలుసుకొని వారిని పిలిపించి పోయిన డబ్బులు 23 వేల ఒక వంద రూపాయలను లెల్లెల బాలకృష్ణ అందజేశారు.

ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ల గడ్డం శ్రీనివాస్, ఎం డి. రిజ్వాన్, హెడ్ కానిస్టేబుల్ రాజమౌళిని ట్రాఫిక్ ఎస్ఐ రామచంద్రం అభినందించారు.

Tags