జిల్లాలో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పటిష్ట భద్రత.
పరీక్ష కేంద్రాలను సందర్శించి, భద్రత ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ .
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 9( ప్రజా మంటలు ) :
జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహిస్తున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతగా ఎలాంటి సంఘటనలు జరగకుండ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. గ్రూప్-1 ప్రిలిమినరీ వ్రాత పరీక్షకు 7692 మంది అభ్యర్థులు 22 పరీక్ష కేంద్రాల్లో పరీక్షకు హాజరు కావడం జరుగుతుందిని సుదూర ప్రాంతాల నుండి పరీక్ష వ్రాసేందుకు వచ్చిన అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు సరయిన సమయంలో చేరుకోనేందుకుగాను జిల్లా పోలీసుల అధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు.
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయడం జరుగుతుందని ఇతర శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పరీక్షను ఎలాంటి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ వినోద్ కుమార్ , డిఎస్పీ రఘు చందర్, టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్ ఉన్నారు.