తెలంగాణ కాషాయ దళపతికి మోదీ పట్టం
సంజయ్ కు మంత్రి పదవి...కష్టపడే కార్యకర్తకు దక్కిన గౌరవమిది - తెలంగాణ బీజేపీ శ్రేణులు
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైద్రాబాద్ జూన్ 9 (ప్రజా మంటలు) :
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి పదవి దక్కడంపట్ల తెలంగాణలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యంగా బండి సంజయ్ ను తెలంగాణ కాషాయ దళపతిగా పిలుచుకునే బీజేపీ కార్యకర్తల ఆనందానికి ఆవధుల్లేకుండాపోయాయి.
సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగా వారు భావిస్తున్నారు. పార్టీలో కార్యకర్తగా చేరింది మొదలు ఏ పదవిలో ఉన్నా... నిరంతరం ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేయడమే లక్ష్యంగా పనిచేసిన బండి సంజయ్ కు అమాత్య పదవి లభించడం, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడం విశేషం.
సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి లభించడంపట్ల కరీంనగర్ పార్లమెంట్ ప్రజల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో పట్టణాలకే పరిమితమైన బీజేపీని మారుమూల పల్లెల్లోకి విస్తరింపజేయడంలో బండి సంజయ్ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
ప్రజాసంగ్రామ యాత్రతో 16 వందల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసి కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచారని, కేసీఆర్ పాలన అంతానికి బండి సంజయ్ పాదయాత్రతోనే అడుగులు పడ్డాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఆనాడు గొంతెత్తి ప్రశ్నించడానికే వీల్లేకుండా నిరసనలపై ఉక్కుపాదం మోపిన కేసీఆర్ సర్కార్ పై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఉద్యమాలు చేసేందుకు వెనుకాడిన సమయంలో..... బీజేపీ రాష్ట్ర రథసారథిగా కార్యకర్తలందరినీ ఏకోన్ముఖులను చేసి రైతుల, నిరుద్యోగుల, ఉద్యోగుల, మహిళల సమస్యలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలు ఎదుర్కొంటున్న కష్టాలపై అడుగడుగున పోరాటాలు చేసి బీజేపీని ఇంటింటికీ పరిచయం చేసిన ఘనత బండి సంజయ్ దే. గత ఐదేళ్లపాటు కుటుంబానికి దూరమై బండి సంజయ్ చేసిన పోరాటాలు అన్నీ ఇన్నీ కావు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కార్యకర్తల కోసం ఎందాకైనా తెగించే మనస్తత్వం బండి సంజయ్ సొంతం. నిరంతరం ప్రజల్లో ఉండటం... నిత్యం కార్యకర్తలతో కలిసి నడవడం బండి సంజయ్ ప్రత్యేకత. ఎంపీగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ లాఠీఛార్జీలు, కేసులు, అరెస్టులకు లెక్క చేయని చరిత్ర సంజయ్ దే.
రైతులకు భరోసా ఇచ్చేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దకు వెళుతుంటే నాటి అధికార పార్టీ మూకలు రాళ్ళ దాడికి తెగబడినా వెనుకంజ వేయకుండా ధీటుగా ఎదుర్కొని రైతులకు అండగా నిలిచిన ధీశాలి సంజయ్ రైతుల పక్షాన అనేక దీక్షలు చేపట్టారు.
నిరుద్యోగ మార్చ్ పేరుతో జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలతో నిరుద్యోగుల పక్షాన పోరాడారు. బండి సంజయ్ పోరాటాలతో బెంబేలెత్తిన నాటి కేసీఅర్ సర్కార్ టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో అర్ధరాత్రి పోలీసులను ఇంటికి పంపి అక్రమంగా అరెస్ట్ చేసినా వెనుకంజ వేయకుండా ఉద్యమించి కాషాయ పార్టీ పోరాట పటిమను చాటి చెప్పారు. 317 జీవోను సవరించాలని ఉద్యోగుల పక్షాన పోరాడి సర్కార్ ను గడగడలాడించిన ఘనత కూడా సంజయ్ దే. సంజయ్ ధాటికి తట్టుకోలేని నాటి బీఆర్ ఎస్ పాలకులు కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో దీక్ష చేస్తుండగా పోలీసులను పంపి గ్యాస్ కట్టర్లతో ఆఫీస్ గేట్లను ధ్వంసం చేయించి బండి సంజయ్ ను అరెస్ట్ చేసి భవిష్యత్తులో దీక్షలు చేయకుండా బీజేపీని కట్టడి చేయాలని చూశారు.
అయినా వెరవని సంజయ్ కేసీఅర్ సర్కార్ పై అలుపెరగని పోరాటాలు చేసి నాటి ప్రభుత్వ పతనంలో అత్యంత చురుకైన పాత్ర పోషించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ ఎంపీగా కొనసాగుతూ ప్రజా సమస్యలపై పోరాడి రెండు సార్లు జైలుకు వెళ్లిన ఘనత కూడా బండి సంజయ్ దే.
ప్రజల కోసం, కార్యకర్తల కోసం కొట్లాడి భారతదేశంలోనే అత్యధిక కేసులు ఎదుర్కొంటున్న ఎంపీ కూడా బండి సంజయ్ మాత్రమే కావడం గమనార్హం. అట్లాంటి వ్యక్తికి మోడీ కేబినెట్ లో చోటు దక్కడంతో కార్యకర్తల భావోద్వేగంతో ఉప్పొంగిపోతున్నారు.
నిజానికి బండి సంజయ్ రాజకీయ జీవిత ప్రస్థానాన్ని పరిశీలిస్తే... ఆయన రాజకీయ జీవితమంతా ఆటుపోట్లమయమే. కరీంనగర్ లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బండి సంజయ్ సామాన్య బీజేపీ కార్యకర్తగా ప్రస్తానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు.
రెండు సార్లు కార్పొరేటర్ గా గెలిచిన బండి సంజయ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కరీంనగర్ పట్టణంలో ముస్లిం ప్రజలు నివసించే ప్రాంతంలో గంప గుత్తగా బండి సంజయ్ కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నప్పటికీ ఆయన ఏనాడూ హిందుత్వ భావజాలాన్ని వీడలేదు. బీజేపీ హిందుత్వ భావజాలాన్ని నరనరాన పుణికిపుచ్చుకున్న బండి సంజయ్ ఓట్ల కోసం, పదవుల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తను నమ్మిన సిద్దాంతాన్ని ఏనాడూ పక్కన పెట్టలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, మరెన్ని అవమానాలు ఎదురైనా అధిగమిస్తూ ముందుకు సాగారు. అందుకే బీజేపీలో కార్యకర్తలందరికీ బండి సంజయ్ ‘హిందుత్వ ఐకాన్’ గా మారారు.
2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 89 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఆ తరువాత బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలపై అలుపెరగని ఉద్యమాలు చేస్తూ బీజేపీపీ రాష్ట్రవాప్తంగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ ను అనూహ్యంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించడం రాష్ట్రంలో పెను సంచలనమైంది. ముఖ్యంగా కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు.
బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారి, బీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అనే స్థాయికి తీసుకెళ్లారు. కానీ బండి సంజయ్ ను అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించిన ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లను సాధించలేకపోయిందని సొంత పార్టీ నేతలే బాహాటంగా వ్యాఖ్యానించారంటే సంజయ్ పని తీరు ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవాలి.
రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించాక జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి ఉన్నత పదవిని బండి సంజయ్ కు కట్టబెట్టినప్పటికీ కార్యకర్తల్లో అసంత్రప్తి తగ్గలేదు. అందుకే బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కగానే బీజేపీలో కష్టపడే కార్యకర్తలంతా తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. సంబురాలు చేసుకుంటున్నారు. నిరంతరం ప్రజల కోసం తపించే బండి సంజయ్ కు కేంద్రంలో ఏ శాఖ అప్పగించినా... ఆ శాఖను సమర్ధవంతంగా నిర్వర్తించడంతోపాటు ఆ శాఖ ద్వారా ప్రజలకు ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ముఖ్యంగా తనను ఈ స్థాయికి తీసుకెళ్లిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల అభివ్రుద్ధిపై ప్రత్యేకంగా ద్రుష్టిసారిస్తారనే నమ్మకం తమకుందనే అభిప్రాయాన్ని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మేంద్ర: హిందీ సినీ ప్రపంచం యొక్క చిరస్మరణీయ అందగాడు
హిందీ సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ధర్మేంద్ర, 1960లో విడుదలైన "దిల్ భీ తేరా హమ్ భీ తేరా"చిత్రంతో మొదటి అడుగు వేశారు. ముఖేశ్ పాడిన “ముఝ్కో ఇస్ రాత్ కీ తన్హాయీ మే ఆవాజ్ నా దో” అనే గీతంతో ఆయన ప్రవేశం మృదువైనదైనా, గుర్తుండిపోయేలా నిలిచింది. ముంబై నగరంలోని... నిరంజన్ రెడ్డి ఎందుకు అగ్రెసివ్ అవుతున్నారు? – జాగృతి ప్రతినిధుల ప్రశ్న
తెలంగాణ జాగృతి చేపట్టిన జాగృతి జనం బాటు కార్యక్రమంలో ప్రజలు నిరంజన్ రెడ్డి అక్రమాల గురించి వెల్లడించారని, కల్వకుంట్ల కవిత వాటినే మీడియా ముందు చెప్పారని జాగృతి ప్రతినిధులు మనోజా గౌడ్, శ్రీకాంత్ గౌడ్ స్పష్టం చేశారు. ఎవరిపై వ్యక్తిగత విమర్శ చేయాలన్న ఉద్దేశం లేదని తెలిపారు.
వనపర్తి–పెబ్బేరు ప్రాంతాలలో ప్రజలు చెరువులు, కుంటల... బీసీలకు దక్కింది 17.087% గ్రామ పంచాయతీలే: గతం కంటే 8% తక్కువ
ప్రభుత్వం ప్రకటించిన బిసి రిజర్వేషన్ల జాబితా బీసి నాయకుల నుండి విమర్శలను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తానన్న 42% రిజర్వేషన్లు ఇవ్వకపోగా, గత ఎన్నికల్లో ఇచ్చిన 25 % కూడా కేటాయించలేకపోవడం విమర్శలకు దారితీస్తుంది. ఈ విషయంలో బిసి నాయకులు కోర్టుకు కూడా వెళ్లనున్నట్లు తెలుస్తుంది.
✔ప్రభుత్వం హామీ (42%)
✘ అమలైన... చైనా–అరుణాచల్ పాస్పోర్ట్ వివాదం: భారత మహిళను 18 గంటలు నిర్బంధించిన ఘటన
న్యూఢిల్లీ/బీజింగ్ నవంబర్ 25 (మా ప్రత్యేక ప్రతినిధి):
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన భారతీయ మహిళను శాంఘై పుడోంగ్ విమానాశ్రయంలో చైనా అధికారులు “మీ పాస్పోర్ట్ చెల్లదు, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ చైనాలో భాగం” అంటూ 18 గంటలపాటు నిర్బంధించిన ఘటన భారత్–చైనా మధ్య మరల ఉద్రిక్తతలకు దారి తీసింది.
లండన్ నుంచి జపాన్కు ట్రాన్సిట్ ప్రయాణం... నల్లగొండ కాంగ్రెస్‌లో డీసీసీ రగడ: కోమటిరెడ్డి ఆగ్రహంతో రాజకీయాల కుదుపు
నల్లగొండ నవంబర్ 25 (ప్రజా మంటలు):
నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో డీసీసీ నియామకం పెద్ద అంతర్గత కలహాలకు దారితీసింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పున్నా కైలాష్ను నియమించడం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తీవ్ర ఆగ్రహాన్ని రేపింది.
తనపై, తన కుటుంబంపై కైలాష్ అసభ్య పదజాలంతో మీడియా ముందు మాట్లాడాడని ఆరోపించిన కోమటిరెడ్డి, అలాంటి... “ఇందిరమ్మ చీరలు – ఎన్నికల కోసమే కాంగ్రెస్ తొందర”: జగిత్యాల BRS నేతల విమర్శలు
జగిత్యాల (రూరల్) నవంబర్ 25 (ప్రజా మంటలు):
జిల్లా BRS పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం హుటాహుటిన ‘ఇందిరమ్మ చీరల పంపిణీ’ ప్రారంభించిందని, ఇది పూర్తిగా రాజకీయ ప్రయోజనాలకే సంబంధించిన కార్యక్రమమని... ఏపీకే ఫైళ్లు ఓపెన్ చేస్తే హ్యాకింగ్ ప్రమాదం
సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు) : తెలియని మూలాల నుంచి వచ్చే APK ఫైళ్లను ఓపెన్ చేయకూడదని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆర్.వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఇలాంటి ఫైళ్లు ఓపెన్ చేస్తే ఫోన్లు హ్యాకింగ్కు గురై వ్యక్తిగత డేటా, బ్యాంకు వివరాలు దొంగిలించే అవకాశం ఉందని తెలిపారు.
RTO Challan.apk, Aadhar.apk, SBI.apk, PM... చాచా నెహ్రూ నగర్లో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు
సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు):
దేశ వ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాల నేపథ్యంలో గాంధీనగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఆర్. వెంకటేశ్వర్లు మంగళవారం చాచా నెహ్రూ నగర్లో అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానికులు, దుకాణదారులకు సైబర్ మోసాల గురించి వివరించి, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1930 వినియోగంపై సూచనలు ఇచ్చారు.
ఈ సందర్భంగా పాంప్లెట్లు కూడా... గొల్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో ఇండ్లపై నుండి వెళ్లిన విద్యుత్తు లైన్లు మరమత్తు కొరకు శంకుస్థాపన
(అంకం భూమయ్య(
గొల్లపల్లి నవంబర్ 25 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలం లోని శ్రీరాములపల్లె లో విద్యుత్ వైర్లు, విద్యుత్ పనులకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తో కలిసి శంకుస్థాపన చేశారు.
ధర్మపురి నియోజకవర్గంలోశ్రీరాములపల్లె,... భక్తి శ్రద్దలతో 350వ శహీద్ దినోత్సవం : నగర్ కీర్తన్ లో భక్తుల రద్దీ
ఆకట్టుకున్న యోధ కళాకారుల కత్తి ప్రదర్శనలు...
సికింద్రాబాద్, నవంబర్ 25 (ప్రజామంటలు) :
సిక్కుల తొమ్మిదవ మత గురువు శ్రీ గురు తేజ్ బహదూర్ సాహెబ్జీ 350వ శహీద్ దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన నగర్ కీర్తన్ ఘనంగా జరిగింది. శబద్ కీర్తనాలు, సాహాస కృత్యాలైన సిక్కు కళ గట్కా యోధ కళ ప్రదర్శనలు... పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ – మూడు విడతల్లో పోలింగ్
ఈ క్షణం నుంచే ఎలెక్షన్ కోడ్ అమల్లోకి
హైదరాబాద్ నవంబర్ 25 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది.రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నట్లు కమిషనర్ ప్రకటించారు.
🗳️పోలింగ్ షెడ్యూల్
1️⃣ తొలి విడత – డిసెంబర్ 11
2️⃣ రెండో విడత –... కాంగ్రెస్‌లో తలపడే రెండు సామ్రాజ్యాలు: ఒక పక్క రెడ్డి… మరో పక్క రావు
డా.సంజయ్ కుమార్, కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి జగిత్యాలలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. జీవన్ రెడ్డి ఆధిపత్యానికి సవాల్ విసిరిన సంజయ్ వర్గంగా నిలుస్తుంది.
జగిత్యాల కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఏ పేరు సరిపోతుంది అంటే…“వర్గాల వేటగాళ్ల లీగ్”లేదా“జగిత్యాల అడవి — రెండు పులులు, ఒక కుర్చీ”
ఎందుకంటే బయటకు కాంగ్రెస్... 