తెలంగాణ కాషాయ దళపతికి మోదీ పట్టం

సంజయ్ కు మంత్రి పదవి...కష్టపడే కార్యకర్తకు దక్కిన గౌరవమిది - తెలంగాణ బీజేపీ శ్రేణులు

On
తెలంగాణ కాషాయ దళపతికి మోదీ పట్టం

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

హైద్రాబాద్ జూన్ 9 (ప్రజా మంటలు) : 

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి పదవి దక్కడంపట్ల తెలంగాణలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ముఖ్యంగా బండి సంజయ్ ను తెలంగాణ కాషాయ దళపతిగా పిలుచుకునే బీజేపీ కార్యకర్తల ఆనందానికి ఆవధుల్లేకుండాపోయాయి.

సామాన్య కార్యకర్తకు దక్కిన గౌరవంగా వారు భావిస్తున్నారు. పార్టీలో కార్యకర్తగా చేరింది మొదలు ఏ పదవిలో ఉన్నా... నిరంతరం ప్రజల పక్షాన నిరంతరం పోరాటాలు చేయడమే లక్ష్యంగా పనిచేసిన బండి సంజయ్ కు అమాత్య పదవి లభించడం, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కావడం విశేషం.

సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి లభించడంపట్ల కరీంనగర్ పార్లమెంట్ ప్రజల్లో సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి.  

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో పట్టణాలకే పరిమితమైన బీజేపీని మారుమూల పల్లెల్లోకి విస్తరింపజేయడంలో బండి సంజయ్ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.

ప్రజాసంగ్రామ యాత్రతో 16 వందల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసి కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచారని, కేసీఆర్ పాలన అంతానికి బండి సంజయ్ పాదయాత్రతోనే అడుగులు పడ్డాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

ఆనాడు గొంతెత్తి ప్రశ్నించడానికే వీల్లేకుండా నిరసనలపై ఉక్కుపాదం మోపిన కేసీఆర్ సర్కార్ పై ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఉద్యమాలు చేసేందుకు వెనుకాడిన సమయంలో..... బీజేపీ రాష్ట్ర రథసారథిగా కార్యకర్తలందరినీ ఏకోన్ముఖులను చేసి రైతుల, నిరుద్యోగుల, ఉద్యోగుల, మహిళల సమస్యలతోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణ పేదలు ఎదుర్కొంటున్న కష్టాలపై అడుగడుగున పోరాటాలు చేసి బీజేపీని ఇంటింటికీ పరిచయం చేసిన ఘనత బండి సంజయ్ దే. గత ఐదేళ్లపాటు కుటుంబానికి దూరమై బండి సంజయ్ చేసిన పోరాటాలు అన్నీ ఇన్నీ కావు.  

ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కార్యకర్తల కోసం ఎందాకైనా తెగించే మనస్తత్వం బండి సంజయ్ సొంతం. నిరంతరం ప్రజల్లో ఉండటం... నిత్యం కార్యకర్తలతో కలిసి నడవడం బండి సంజయ్ ప్రత్యేకత. ఎంపీగా ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ లాఠీఛార్జీలు, కేసులు, అరెస్టులకు లెక్క చేయని చరిత్ర సంజయ్ దే. 

రైతులకు భరోసా ఇచ్చేందుకు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వడ్ల కొనుగోలు కేంద్రాల వద్దకు వెళుతుంటే నాటి అధికార పార్టీ మూకలు రాళ్ళ దాడికి తెగబడినా వెనుకంజ వేయకుండా ధీటుగా ఎదుర్కొని రైతులకు అండగా నిలిచిన ధీశాలి సంజయ్ రైతుల పక్షాన అనేక దీక్షలు చేపట్టారు.

నిరుద్యోగ మార్చ్ పేరుతో జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలతో నిరుద్యోగుల పక్షాన పోరాడారు. బండి సంజయ్ పోరాటాలతో బెంబేలెత్తిన నాటి కేసీఅర్ సర్కార్ టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో అర్ధరాత్రి పోలీసులను ఇంటికి పంపి అక్రమంగా అరెస్ట్ చేసినా వెనుకంజ వేయకుండా ఉద్యమించి కాషాయ పార్టీ పోరాట పటిమను చాటి చెప్పారు. 317 జీవోను సవరించాలని ఉద్యోగుల పక్షాన పోరాడి సర్కార్ ను గడగడలాడించిన ఘనత కూడా సంజయ్ దే. సంజయ్ ధాటికి తట్టుకోలేని నాటి బీఆర్ ఎస్ పాలకులు కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో దీక్ష చేస్తుండగా పోలీసులను పంపి గ్యాస్ కట్టర్లతో ఆఫీస్ గేట్లను ధ్వంసం చేయించి బండి సంజయ్ ను అరెస్ట్ చేసి భవిష్యత్తులో దీక్షలు చేయకుండా బీజేపీని కట్టడి చేయాలని చూశారు.

అయినా వెరవని సంజయ్ కేసీఅర్ సర్కార్ పై అలుపెరగని పోరాటాలు చేసి నాటి ప్రభుత్వ పతనంలో అత్యంత చురుకైన పాత్ర పోషించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ ఎంపీగా కొనసాగుతూ ప్రజా సమస్యలపై పోరాడి రెండు సార్లు జైలుకు వెళ్లిన ఘనత కూడా బండి సంజయ్ దే.

ప్రజల కోసం, కార్యకర్తల కోసం కొట్లాడి భారతదేశంలోనే అత్యధిక కేసులు ఎదుర్కొంటున్న ఎంపీ కూడా బండి సంజయ్ మాత్రమే కావడం గమనార్హం. అట్లాంటి వ్యక్తికి మోడీ కేబినెట్ లో చోటు దక్కడంతో కార్యకర్తల భావోద్వేగంతో ఉప్పొంగిపోతున్నారు. 

నిజానికి బండి సంజయ్ రాజకీయ జీవిత ప్రస్థానాన్ని పరిశీలిస్తే... ఆయన రాజకీయ జీవితమంతా ఆటుపోట్లమయమే. కరీంనగర్ లో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన బండి సంజయ్ సామాన్య బీజేపీ కార్యకర్తగా ప్రస్తానాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు.

రెండు సార్లు కార్పొరేటర్ గా గెలిచిన బండి సంజయ్ మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కరీంనగర్ పట్టణంలో ముస్లిం ప్రజలు నివసించే ప్రాంతంలో గంప గుత్తగా బండి సంజయ్ కు వ్యతిరేకంగా ఓట్లు వేస్తున్నప్పటికీ ఆయన ఏనాడూ హిందుత్వ భావజాలాన్ని వీడలేదు. బీజేపీ హిందుత్వ భావజాలాన్ని నరనరాన పుణికిపుచ్చుకున్న బండి సంజయ్ ఓట్ల కోసం, పదవుల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం తను నమ్మిన సిద్దాంతాన్ని ఏనాడూ పక్కన పెట్టలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, మరెన్ని అవమానాలు ఎదురైనా అధిగమిస్తూ ముందుకు సాగారు. అందుకే బీజేపీలో కార్యకర్తలందరికీ బండి సంజయ్ ‘హిందుత్వ ఐకాన్’ గా మారారు.

2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 89 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఎంపీగా గెలిచారు. ఆ తరువాత బీజేపీ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన బండి సంజయ్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజా సమస్యలపై అలుపెరగని ఉద్యమాలు చేస్తూ బీజేపీపీ రాష్ట్రవాప్తంగా బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ ను అనూహ్యంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించడం రాష్ట్రంలో పెను సంచలనమైంది. ముఖ్యంగా కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు.

బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నంత కాలం రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మారి, బీఆర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అనే స్థాయికి తీసుకెళ్లారు. కానీ బండి సంజయ్ ను అధ్యక్ష బాధ్యతల నుండి తప్పించిన ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లను సాధించలేకపోయిందని సొంత పార్టీ నేతలే బాహాటంగా వ్యాఖ్యానించారంటే సంజయ్ పని తీరు ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవాలి.

రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తప్పించాక జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి ఉన్నత పదవిని బండి సంజయ్ కు కట్టబెట్టినప్పటికీ కార్యకర్తల్లో అసంత్రప్తి తగ్గలేదు. అందుకే బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి దక్కగానే బీజేపీలో కష్టపడే కార్యకర్తలంతా తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నారు. సంబురాలు చేసుకుంటున్నారు. నిరంతరం ప్రజల కోసం తపించే బండి సంజయ్ కు కేంద్రంలో ఏ శాఖ అప్పగించినా... ఆ శాఖను సమర్ధవంతంగా నిర్వర్తించడంతోపాటు ఆ శాఖ ద్వారా ప్రజలకు ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా పనిచేస్తారనడంలో ఎలాంటి సందేహం లేదని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ముఖ్యంగా తనను ఈ స్థాయికి తీసుకెళ్లిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల అభివ్రుద్ధిపై ప్రత్యేకంగా ద్రుష్టిసారిస్తారనే నమ్మకం తమకుందనే అభిప్రాయాన్ని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.

Tags
Join WhatsApp

More News...

కోయంబత్తూర్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు — ముగ్గురు నిందితులు అరెస్ట్‌

కోయంబత్తూర్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు — ముగ్గురు నిందితులు అరెస్ట్‌ కోయంబత్తూర్‌, తమిళనాడు నవంబర్‌ 04:  కోయంబత్తూర్‌లో జరిగిన ఘోరమైన గ్యాంగ్‌ రేప్‌ హత్యాయత్నం కేసు రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపుతోంది. 20 ఏళ్ల పీజీ విద్యార్థిని తన బోయ్‌ఫ్రెండ్‌తో కలిసి కారులో వెళ్తుండగా, ముగ్గురు వ్యక్తులు బలవంతంగా అపహరించి, ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగుచూసింది. ఈ సంఘటన విమానాశ్రయం సమీపంలోని బ్రిందావన్‌నగర్‌ వద్ద చోటుచేసుకుంది....
Read More...
National  Sports  International   State News 

ఏషియా కప్ వివాదం: సూర్యకుమార్ యాదవ్‌, హారిస్ రౌఫ్ లపై క్రమశిక్షణ

ఏషియా కప్ వివాదం: సూర్యకుమార్ యాదవ్‌, హారిస్ రౌఫ్ లపై క్రమశిక్షణ   సూర్యకుమార్ యాదవ్‌కు 30% మ్యాచ్ ఫీ జరిమానా – హారిస్ రౌఫ్‌కు రెండు మ్యాచ్‌ల నిషేధం దుబాయ్, నవంబర్ 4 (ప్రజా మంటలు): ఏషియా కప్ సందర్భంగా జరిగిన ఉద్రిక్త ఘటనలపై భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరియు పాకిస్తాన్ వేగవంతమైన బౌలర్ హారిస్ రౌఫ్ పై ఐసీసీ (ICC) క్రమశిక్షణా చర్యలు...
Read More...

దుబాయ్ సైబర్ క్రైమ్ కేసులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు

దుబాయ్ సైబర్ క్రైమ్ కేసులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు కేంద్ర ప్రభుత్వ జోక్యం కోరిన TPCC NRI సెల్ కన్వీనర్ షేక్ చాంద్ పాషా హైదరాబాద్, నవంబర్ 4 (ప్రజా మంటలు): దుబాయ్‌లో సైబర్ క్రైమ్ కేసులో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణకు చెందిన యువకుడు అనిల్ (s/o బాలయ్య, చిర్లవంచ గ్రామం, వేములవాడ మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా) కేసు విషయాన్ని, TPCC...
Read More...

“సామాజిక తెలంగాణ సాధనయే మా లక్ష్యం” :కవిత

“సామాజిక తెలంగాణ సాధనయే మా లక్ష్యం” :కవిత జాగృతి జనం బాట ఆదిలాబాద్‌లో కల్వకుంట్ల కవిత నిరుద్యోగుల సమస్యలపై మండిపాటు – జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలి తలమడుగులో రైతు కుటుంబాన్ని పరామర్శించిన కవిత ఆదిలాబాద్ నవంబర్ 4 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్‌లో “జాగృతి జనం బాట” కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకునే భాగంగా 33...
Read More...

జగిత్యాల జిల్లాలో రవాణా శాఖ అధికారుల తనిఖీలు పెండింగ్ టాక్స్ వసూలు

జగిత్యాల జిల్లాలో రవాణా శాఖ అధికారుల తనిఖీలు పెండింగ్ టాక్స్ వసూలు – పత్రాలు లేని వాహనాలకు హెచ్చరిక జగిత్యాల, నవంబర్ 4 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలో రవాణా శాఖ అధికారులు వాహనాలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలను మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (MVI) షేక్ రియాజ్ స్వయంగా పర్యవేక్షించారు. తనిఖీలలో భాగంగా పలు వాహనాల పత్రాలు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ వివరాలను పరిశీలించారు....
Read More...
Local News  State News 

తలసాని తొందరపడి రాజీనామా చేయొద్దు.. చేస్తే గెలిచే అవకాశం లేదు

తలసాని తొందరపడి రాజీనామా చేయొద్దు.. చేస్తే గెలిచే అవకాశం లేదు     * పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమా విమర్శ సికింద్రాబాద్, నవంబర్ 04 (ప్రజామంటలు): మాజీ మంత్రి, సనత్ నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పై పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమా సంచలన వ్యాఖ్యలు చేశారు.  గడిచిన పదేళ్ల బిఆర్ఎస్...
Read More...
Local News  State News 

పటేల్ లేకుంటే హైదరాబాద్ పాకిస్థాన్ ఆధీనంలో ఉండేది.?

పటేల్ లేకుంటే హైదరాబాద్ పాకిస్థాన్ ఆధీనంలో ఉండేది.?   *వల్లభాయ్ పటేల్ చొరవతో దేశంలోని 565 సంస్థానాలు ఇండియాలో విలీనం    *యువత సమైక్య భారత్‌ నిర్మాణానికి ముందుకు రావాలి    *రాజ్యసభ సభ్యులు డా.కే.లక్ష్మన్    *సర్దార్@150 ఏక్తా మార్చ్ లో పాల్గొనాలని పిలుపు సికింద్రాబాద్, నవంబర్ 04, (ప్రజామంటలు) : సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకోకపోయి ఉన్నట్లయితే హైదరాబాద్ ప్రాంతం ఇస్లాం దేశంగా, లేదా పాకిస్థాన్...
Read More...
Local News 

శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినికి రెండు బంగారు పతకాలు

శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినికి రెండు బంగారు పతకాలు - అభినందించిన కళాశాల యాజమాన్యం...  సికింద్రాబాద్,  నవంబర్ 04 (ప్రజా మంటలు) :  పట్టుదలతో చదివితే విద్యార్థినులు ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల వైస్ చైర్మన్ డాక్టర్ కె. రాధా కిషన్ రావు అన్నారు. వట్టినాగులపల్లిలోని శ్రీదేవి మహిళా ఇంజనీరింగ్ కళాశాల, పి. హేమశ్రీ అసాధారణ విజయాన్ని గర్వంగా జరుపుకుంది. జవహర్‌లాల్...
Read More...

వై.ఎస్.ఆర్ ఆశయాలకు విరుద్ధంగా రేవంత్ పాలన – దావ వసంత సురేష్

వై.ఎస్.ఆర్ ఆశయాలకు విరుద్ధంగా రేవంత్ పాలన – దావ వసంత సురేష్ ఫీజు రియాంబర్స్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ జగిత్యాల, నవంబర్ 4 (ప్రజా మంటలు):రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వై.ఎస్.ఆర్ ఆశయాలకు తూట్లు పొడిచేలా ఉందని జిల్లా పరిషత్ తొలి ఛైర్‌పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ విమర్శించారు. ఫీజు రియాంబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు చేపట్టిన...
Read More...
Local News  State News 

ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారమే ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలి – పిఆర్టియుటిఎస్, జగిత్యాల జిల్లా శాఖ

ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారమే ఉపాధ్యాయుల సర్దుబాటు చేయాలి – పిఆర్టియుటిఎస్, జగిత్యాల జిల్లా శాఖ జగిత్యాల, నవంబర్ 04 (ప్రజా మంటలు): ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నెం. 25 (తేదీ 12.08.2021) ప్రకారం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాట్లు జరగాలని పిఆర్టియుటిఎస్ (PRTUTS) జగిత్యాల జిల్లా శాఖ డిమాండ్ చేసింది. జిల్లా శాఖ అధ్యక్షుడు బోయినపల్లి ఆనందరావు, ప్రధాన కార్యదర్శి యాల్ల అమర్నాథ్ రెడ్డి నేతృత్వంలో జిల్లా విద్యా...
Read More...

బహరేన్‌లో గల్ఫ్ కార్మికుడి మృతదేహం ఐదేళ్ల తర్వాత అంత్యక్రియలకు ఏర్పాట్లు

బహరేన్‌లో గల్ఫ్ కార్మికుడి మృతదేహం ఐదేళ్ల తర్వాత అంత్యక్రియలకు ఏర్పాట్లు మెటుపల్లి, నవంబర్ 04 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా మెటుపల్లి పట్టణానికి చెందిన గల్ఫ్ కార్మికుడు శ్రీపాద నరేష్ ఐదేళ్ల క్రితం బహరేన్‌లో దుర్మరణం చెందగా, ఆయన మృతదేహం ఇప్పటివరకు అక్కడి అతిశీతల శవాగారంలో నిల్వ ఉంది. సాంకేతిక కారణాల వల్ల మృతదేహాన్ని భారత్‌కు తరలించడం సాధ్యం కాదని బహరేన్‌లోని భారత రాయబార కార్యాలయం స్పష్టంచేసింది....
Read More...

వర్షకొండ–ఇబ్రహీంపట్నం రోడ్డుపై శ్రమదానంతో గుంతలు పూడ్చిన గ్రామ నాయకులు 

వర్షకొండ–ఇబ్రహీంపట్నం రోడ్డుపై శ్రమదానంతో  గుంతలు పూడ్చిన గ్రామ నాయకులు  ఇబ్రహీంపట్నం నవంబర్ 4 (ప్రజా మంటలు: దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని వర్షకొండ–ఇబ్రహీంపట్నం ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతలు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ రోడ్డుపై ప్రతిరోజు ప్రయాణించే వాహనదారులు తరచుగా ప్రమాదాలకు గురవుతుండడంతో, స్థానిక నాయకులు ముందడుగు వేసి శ్రమదానానికి దిగారు. అధికారులు పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు లేకపోవడంతో, వర్షకొండ...
Read More...