ఇంటర్ విద్యార్థులకు ఈనెల 10న సోమవారం రోజున ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష .

On
ఇంటర్ విద్యార్థులకు ఈనెల 10న సోమవారం రోజున ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష .

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల జూన్ 8( ప్రజా మంటలు) : 

గత ఫిబ్రవరి నెలలో ప్రథమ సంవత్సర విద్యార్థులకు జరిగిన ఇంటర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్షలో హాజరుకాని విద్యార్థు లకు ఈనెల 10వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహించబడును.

సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించనప్పటికీ పరీక్షకు హాజరు కావచ్చు ను కావున ఫిబ్రవరి నెలలో జరిగిన పరీక్షలో ఆబ్సెంట్ అయినవారు సోమవారం రోజున పరీక్షకు హాజరు కావచ్చును

పర్యావరణ విద్య పరీక్ష ఈనెల 11వ తేదీ మంగళవారం రోజు

గత ఫిబ్రవరి నెలలో నిర్వహించిన పర్యావరణ విద్య పరీక్షకు ఆబ్సెంట్ అయిన విద్యార్థులకు ఈనెల 11వ తేదీ మంగళవారం రోజున ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నము 1 గంట మధ్య వీరికి పరీక్ష నిర్వహించబడును .

ఎథిక్స్ , హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ఈనెల 12న బుధవారం 

ఎవరిని విద్యార్థులు ఎథిక్స్ ,హ్యూమన్ వాల్యూస్ లో ఉత్తీర్ణులు కాని వారు పరీక్ష ఫీజు చెల్లించన ప్పటికిని ఈ పరీక్షకు వారి వారి కళాశాలలో విద్యార్థులు హాజరుకావచ్చును .

ఈ మూడు పరీక్షలలో ఉత్తీర్ణులు అయితేనే అయితేనే ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్ విడుదల చేయబడుతుంది కావున విద్యార్థులు పై మూడు పరీక్షలలో పై తేదీలలో హాజరుకావాలని పరీక్షలు కన్వీనర్ ఇంటర్ విద్య నోడల్ అధికారి బి నారాయణ తెలిపారు.

Tags