రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదారాబాద్ తరలి వెళ్ళిన ఉద్యమకారులు
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదారాబాద్ తరలి వెళ్ళిన ఉద్యమకారులు
సౌకర్యాలు కల్పించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
ఆనందం వ్యక్తం చేసిన ఉద్యమ నేతలు
జగిత్యాల మే 02:
రాష్ట్ర రాజధాని హైదారాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు
జగిత్యాల జిల్లా నుండి ఉద్యమ కారులు, అమరవీరుల కుటుంబీకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సమయ స్ఫూర్తితో స్పందించి జిల్లాలోని ఉద్యమకారులను, అమర వీరుల కుటుంబీకులను గుర్తించి హైదారాబాద్ లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. వారికి తగిన ఏర్పాట్లు, వసతులు కల్పించారు. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజక వర్గాలకు వేర్వేరుగా బస్సులను, కార్లను, ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖర్చులతోనే రవాణా సౌకర్యం కల్పించారు. అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర, పరిపాలనాధికారి పుప్పాల హన్మంతరావు, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజు లు ఎప్పటి కప్పుడు ఏర్పాట్లను, రవాణా విషయాలను సందాన కర్తల ద్వారా తెలుసుంకుంటూ ఎలాంటి లోటు - పాట్లు జరుగకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రతి బస్సులో సందాన కర్తలను, సహాయకులను, ఆరోగ్య శాఖ సిబ్బందిని నియమించి సేవలు అందించారు. ఉద్యమ కారులకు, అమరవీరుల కుటుంబాలకు అల్పాహారం, భోజన సౌకర్యాలు, త్రాగు నీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు.
జగిత్యాల జిల్లాలోని ప్రముఖ ఉద్యమ కారులు సి.హెచ్.వి.ప్రభాకర్ రావు, చుక్క గంగారెడ్డి, సిరిసిల్ల రాజేందర్ శర్మ, కంతి మోహన్ రెడ్డి, సౌడల కమలాకర్ ల ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాలతో పాటు పట్టణాల, గ్రామాల నుండి సుమారు రెండు వందల మందికి పైగా ఉద్యమకారులను, అమర వీరుల కుటుంబీకులను
రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలించారు. కొందరు ఉద్యమకారులు వారంతట వారే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకొని హైదారాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలి వెళ్లారు. ధర్మపురి లోని తహశీల్దార్ కార్యాలయం నుండి, జగిత్యాల లోని ఆర్డీవో కార్యాలయం నుండి, మెట్ పల్లి ఆర్డీవో కార్యాలయాల నుండి ఆదివారం ఉదయత్ పూర్వం 3-00 గంటలకు వాహనాల్లో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబీకులు హైదారాబాద్ తరలి వెళ్లారు.
ఆనందం వ్యక్తం చేసిన ఉద్యమ నేతలు
ఆరు దశాబ్దాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనంతరం ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాలన తర్వాత నూతన ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం రావడం ఆనందంగా ఉందని ఉద్యమ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ కారులను గుర్తించి వేడుకలకు ఆహ్వానం పలికిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి వర్గానికి, ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా కు, అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర కు, ఇతర అధికారులకు, సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమ కారులకు ఇచ్చిన ఇదే గుర్తింపును ఎప్పటికీ కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉద్యమ ఆకాంక్షలను, అమరవీరుల ఆశయాలను నెరవేర్చాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల నియోజక వర్గాల తో పాటు వివిధ మండలాల నుండి, పట్టణాల నుండి సుమారు 200 మందికి పైగా ఉద్యమ కారులు, అమరవీరుల కుటుంబీకులు హైదారాబాద్ తరలి వెళ్లినట్లు వారు వివరించారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ధర్మపురి అభివృద్ధే లక్ష్యం, మూడుేళ్లలో హామీలు నెరవేర్చకపోతే రాజీనామా చేస్తా - కరీంనగర్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కరీంనగర్ డిసెంబర్ 26, (ప్రజా మంటలు):
కరీంనగర్ ఆర్ అండ్ బి అతిథిగృహంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తన నియోజకవర్గం పూర్తిగా రైతులపై ఆధారపడిన... తక్కలపల్లి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ వార్డు సభ్యులను సత్కరించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. భోగ శ్రావణి
జగిత్యాల డిసెంబర్ 26(ప్రజా మంటలు)రూరల్ మండల్ తక్కళ్లపెళ్లి గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ కచ్చు ముని రాజు , వార్డ్ సభ్యులు నరపాక రాజేష్ ,నాయకులు వడ్లూరి హరీష్, విజయం సాధించిన సందర్భంగా శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా. బోగ శ్రావణిప్రవీణ్ ని స్వగృహంలో మర్యాదపూర్వక కలువగా వారిని శాలువతో... విద్యావేత్త, పారిశ్రామికవేత్త,సామాజికవేత్త కాసుగంటి సుధాకర్ రావు(80) మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 26 (ప్రజా మంటలు)
భారతీయ నాగరిక విద్యా సమితి అధ్యక్షులు కాసుగంటి సుధాకర్ రావు(80) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతూ, గురువారం రాత్రి హైదరాబాదులోని ఆయన మృతి చెందారు.
విద్యావేత్తగా, సామాజిక వేత్తగానే కాకుండా, పారిశ్రామికవేత్తగా జగిత్యాల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పేరొందారు.
జిల్లా కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు... విద్యా–సామాజిక రంగానికి తీరని లోటు: కాసుగంటి సుధాకర్ రావు మృతిపై పలువురి సంతాపం
జగిత్యాల డిసెంబర్ 26 (ప్రజా మంటలు):
విద్యా, పారిశ్రామిక, సామాజిక రంగాలకు విశేష సేవలందించిన ప్రముఖ విద్యావేత్త కాసుగంటి సుధాకర్ రావు మృతి జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన అకాల మరణం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
విద్యావేత్తగా, సామాజిక సేవకుడిగా, పారిశ్రామికవేత్తగా విశేష... ఈరోజు ఉదయం గుజరాత్లో భూకంపం
అహ్మదాబాద్ డిసెంబర్ 26:
గుజరాత్ రాష్ట్రంలో శుక్రవారం ఉదయం సుమారు 6:10 గంటల సమయంలో భూకంపం సంభవించింది. కచ్ జిల్లాకు సమీప ప్రాంతమే భూకంప కేంద్రంగా గుర్తించారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత సుమారు 3.8 నుంచి 4.2గా నమోదైంది.
కొన్ని సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ భూకంపం... విద్యా–పారిశ్రామిక రంగాలకు వెలుగు నింపిన మహనీయుడు కాసుగంటి సుధాకర్‌రావు అస్తమయం
జగిత్యాల, డిసెంబర్ 26 (ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లాకు గర్వకారణంగా నిలిచిన ప్రముఖ విద్యావేత్త, పారిశ్రామిక వేత్త, సామాజిక సేవా ధురీణుడు కాసుగంటి సుధాకర్‌రావు(80) అకాల మరణం జిల్లావ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తన జీవితమంతా సమాజ హితానికే అంకితం చేసిన ఈ మహనీయుడు గురువారం (డిసెంబర్ 25) రాత్రి హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన
మాజీ... నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
నంద్యాల డిసెంబర్ 26:
ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల–బత్తలూరు మధ్య శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి... ధర్మపురి అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ..
.
ధర్మపురి డిసెంబర్ 25(ప్రజా మంటలు)
శివారులోని కమలాపూర్ రోడ్డుకు గల అక్కపెల్లి రాజారాజేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం అర్థరాత్రి సమయంలో దొంగతనం జరిగింది.
దేవస్థానంలో స్వామివారికి అలంకరించిన 2 కిలోల వెండి పాన పట్ట (లింగం చుట్టూ బిగించబడినది) మరియు అమ్మవారికి అలంకరించిన 8 గ్రాముల వెండి ముఖ కవచము కలిపి మొత్తం 2... దేశ సేవకు జీవితాన్ని అంకితం చేసిన జాతీయవాది వాజపేయి -బిజెపి పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్
జగిత్యాల డిసెంబర్ 25 (ప్రజా మంటలు) భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి శతజయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేసిన బిజెపి పట్టణ శాఖ నాయకులు
ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ సుపరిపాలనకు స్ఫూర్తి అటల్ బిహారీ వాజపేయి..భారత దేశంలో నీతికి నిజాయితీకి నైతిక... ఘోర రోడ్డు ప్రమాదం : కొప్పూర్ యువకుడు మృతి
భీమదేవరపల్లి, డిసెంబర్ 25 (ప్రజామంటలు) :
మండలం కొప్పూరు గ్రామానికి చెందిన కొమ్ముల అంజి (20) శుక్రవారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. స్థానికుల కథనం ప్రకారం, ఇందిరానగర్ దాటాక మోడల్ స్కూల్ ఎదుట బైక్‌పై వెళ్తున్న అంజిని ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టింది. అంజి సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. ప్రమాదం జరిగిన... జీహెచ్ఎంసీ డీలిమిటేషన్‌కు బ్రేక్ : చెదిరిన రేవంత్ కల
హైదరాబాద్, డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
వచ్చే ఏడాది జరగనున్న ఎస్ఐఆర్, జనగణనలను దృష్టిలో ఉంచుకొని వేగంగా పూర్తి చేయాలని భావించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) డీలిమిటేషన్ ప్రక్రియకు ప్రభుత్వమే బ్రేక్ వేసినట్లు తెలుస్తోంది. డివిజన్ల పునర్విభజనపై ప్రజల నుంచి వెల్లువెత్తిన అభ్యంతరాలు, రాజకీయ వర్గాల నుంచి వచ్చిన నిరసనల నేపథ్యంలో తుది... స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
సికింద్రాబాద్, డిసెంబర్ 25 (ప్రజా మంటలు):
నగర పరిధిలో రోడ్ల పక్కన జీవనం సాగిస్తున్న సంచార జాతులు, నిరాశ్రయ కుటుంబాల చిన్నారులతో స్కై ఫౌండేషన్ గురువారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చిన్నారులకు బహుమతులు, ఆటవస్తువులు, వివిధ రకాల తినుబండారాలు అందజేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటవస్తువులు, బహుమతులు అందుకోవడంతో చిన్నారులు అపారమైన... 