రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదారాబాద్ తరలి వెళ్ళిన ఉద్యమకారులు

On
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదారాబాద్ తరలి వెళ్ళిన ఉద్యమకారులు

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హైదారాబాద్ తరలి వెళ్ళిన ఉద్యమకారులు
సౌకర్యాలు కల్పించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా
ఆనందం వ్యక్తం చేసిన ఉద్యమ నేతలు

జగిత్యాల మే 02:

రాష్ట్ర రాజధాని హైదారాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో ఆదివారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు 
జగిత్యాల జిల్లా నుండి ఉద్యమ కారులు, అమరవీరుల కుటుంబీకులు అధిక సంఖ్యలో తరలి వెళ్లారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా సమయ స్ఫూర్తితో స్పందించి జిల్లాలోని ఉద్యమకారులను, అమర వీరుల కుటుంబీకులను గుర్తించి హైదారాబాద్ లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. వారికి తగిన ఏర్పాట్లు, వసతులు కల్పించారు. జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల నియోజక వర్గాలకు వేర్వేరుగా బస్సులను, కార్లను, ఏర్పాటు చేసి ప్రభుత్వ ఖర్చులతోనే రవాణా సౌకర్యం కల్పించారు. అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర, పరిపాలనాధికారి పుప్పాల హన్మంతరావు, జిల్లా పంచాయతీ అధికారి దేవరాజు లు ఎప్పటి కప్పుడు ఏర్పాట్లను, రవాణా విషయాలను సందాన కర్తల ద్వారా తెలుసుంకుంటూ ఎలాంటి లోటు - పాట్లు జరుగకుండా తగు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ప్రతి బస్సులో సందాన కర్తలను, సహాయకులను, ఆరోగ్య శాఖ సిబ్బందిని నియమించి సేవలు అందించారు. ఉద్యమ కారులకు, అమరవీరుల కుటుంబాలకు అల్పాహారం, భోజన సౌకర్యాలు, త్రాగు నీటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ ఉద్యమ కారులు సి.హెచ్.వి.ప్రభాకర్ రావు, చుక్క గంగారెడ్డి, సిరిసిల్ల రాజేందర్ శర్మ, కంతి మోహన్ రెడ్డి, సౌడల కమలాకర్ ల ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాలతో పాటు పట్టణాల, గ్రామాల నుండి సుమారు రెండు వందల మందికి పైగా ఉద్యమకారులను, అమర వీరుల కుటుంబీకులను
రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలించారు. కొందరు ఉద్యమకారులు వారంతట వారే ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకొని హైదారాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు తరలి వెళ్లారు. ధర్మపురి లోని తహశీల్దార్ కార్యాలయం నుండి, జగిత్యాల లోని ఆర్డీవో కార్యాలయం నుండి, మెట్ పల్లి ఆర్డీవో కార్యాలయాల నుండి ఆదివారం ఉదయత్ పూర్వం 3-00 గంటలకు వాహనాల్లో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబీకులు హైదారాబాద్ తరలి వెళ్లారు.

ఆనందం వ్యక్తం చేసిన ఉద్యమ నేతలు

ఆరు దశాబ్దాల పాటు జరిగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం అనంతరం ఏర్పడ్డ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేండ్ల పాలన తర్వాత నూతన  ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం రావడం ఆనందంగా ఉందని ఉద్యమ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉద్యమ కారులను గుర్తించి వేడుకలకు ఆహ్వానం పలికిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి వర్గానికి, ఏర్పాట్లు చేసిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా కు, అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర కు, ఇతర అధికారులకు, సిబ్బందికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమ కారులకు ఇచ్చిన ఇదే గుర్తింపును ఎప్పటికీ కొనసాగించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉద్యమ ఆకాంక్షలను, అమరవీరుల ఆశయాలను నెరవేర్చాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.  జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల నియోజక వర్గాల తో పాటు వివిధ మండలాల నుండి, పట్టణాల నుండి సుమారు 200  మందికి పైగా ఉద్యమ కారులు, అమరవీరుల కుటుంబీకులు హైదారాబాద్ తరలి వెళ్లినట్లు వారు వివరించారు.

Tags

More News...

Local News 

ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు

ఇక పగలు కూడ డ్రంకెన్ ఆండ్ డ్రైవ్ టెస్టులు - పద్మారావునగర్ లో 10 కేసుల నమోదు సికింద్రాబాద్, జూలై 16 (ప్రజామంటలు): ఇక నుంచి రాత్రి పూట ఒక్కటే కాకుండా రోజులో ఏసమయంలో నైనా రహదారులపై డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని చిలకలగూడ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం సాయంత్రం  పద్మారావునగర్ చౌరస్తా వద్ద డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించి, 35...
Read More...
Today's Cartoon 

ఈరోజు కార్టూన్

ఈరోజు కార్టూన్
Read More...
Local News  State News 

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస

జగిత్యాల చిత్రకారుడికి కేంద్ర మంత్రి ప్రశంస ఆసిఫాబాద్ జూలై 16:బుధవారం రోజున  కేంద్ర రోడ్లు,రహదారులు మరియు కార్పోరేట్ అఫైర్స్  శాఖ మంత్రి హర్ష్ మల్హోత్రా  ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రచురించిన, స్థానిక పాఠశాల విద్యార్థులచే రాయబడిన చిల్డ్రన్స్ బుక్ "యంగ్ మైండ్స్ టైంలెస్ టేల్స్ " ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పుస్తకంలోని కథలకు బొమ్మలు మరియు పుస్తక ముఖచిత్రం వేసినందుకు...
Read More...
Local News 

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్

సికింద్రాబాద్ ఎలక్ర్టికల్ ట్రేడర్స్ అసోసియేషన్ 32వ ఏజీఎమ్   సికింద్రాబాద్, జూలై 16 (ప్రజామంటలు): సికింద్రాబాద్ ఎలక్ర్టిక్ ట్రేడర్స్ అసోసియేషన్ (ఎస్ఈటీఏ) 32వ యాన్వేల్ జనరల్ మీటింగ్(ఏజీఎం) ఘనంగా జరిగింది. సికింద్రాబాద్ లోని నిమంత్రన్ బొంకెట్ హాల్ లో జరిగిన ఈ సమావేశానికి సికింద్రాబాద్ పరిధిలోని ఎలక్ట్రికల్ ట్రేడర్స్ నిర్వాహకులు హాజరయ్యారు. ఈసందర్బంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. కొత్తగా ఎన్నికైన మెంబర్లు లలిత్ సోలంకి,...
Read More...
Local News 

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు

బీసీల 42శాతం రిజర్వేషన్లలో మైనార్టీ ముస్లిం లను చేర్చోద్దు సికింద్రాబాద్, జూలై 16 (ప్రజామంటలు) : దేశంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్ల అంశం రాజ్యాంగంలో లేనప్పటికీ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మైనారిటీ ముస్లిం రిజర్వేషన్లు అమలు చేయడంతో పేదలైన బీసీ కులాలు తీవ్రంగా నష్టపోతున్నాయని బీజేపీ  రజక సెల్ రాష్ర్ట కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరీ పేర్కొన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..ఈ అంశాన్ని పరిగణలోనికి తీసుకొని...
Read More...
Local News 

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ  నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు

టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ  నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను సన్మానించిన పట్టణ బిజెపి, ముస్లిం సెంట్రల్ నాయకులు    జగిత్యాల జూలై 16 (ప్రజా మంటలు) భారతీయ జనతా పార్టీ జగిత్యాల పట్టణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైనటువంటి జిల్లా జర్నలిస్టు యూనియన్ కార్యవర్గాన్ని  బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో నూతనంగా ఎన్నికైన జర్నలిస్టు కార్యవర్గ సభ్యులను శాలువాతో సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు.   ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ అధ్యక్షులు కొక్కు *ముస్లిం...
Read More...
State News 

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిర్వహణ బాధ్యతలు కొప్పుల ఈశ్వర్ కు అప్పగింత హైదరాబాద్ జూలై 16:  తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ గారితో ముగిసిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతల సమావేశం. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పార్టీకి అనుబంధంగా అనేక కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం. ఈ దిశగా సింగరేణి ప్రాంతంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జీలు, మాజీ మంత్రులతో సమన్వయం...
Read More...
Local News 

గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సంఘ మండల అధ్యక్షునిగా చిట్యాల రాజేందర్, ఉప అధ్యక్షుడుగా పర్రె రమేష్.

గంగపుత్ర మత్స్యపారిశ్రామిక సంఘ మండల అధ్యక్షునిగా చిట్యాల రాజేందర్, ఉప అధ్యక్షుడుగా పర్రె రమేష్. ఇబ్రహీంపట్నం జూలై 16( ప్రజా మంటలు దగ్గుల అశోక్):   ఇబ్రహీంపట్నం మండల కమిటి ని ఫకీర్ కొండపూర్ గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘ భవనంలో  జిల్లా అధ్యక్షులు పల్లికొండ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో మండల  కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడుగా చిట్యాల రాజేందర్(తిమ్మాపూర్), ఉపాధ్యక్షుడు గా పర్రె రమేష్,(వర్షకొండ),కార్యదర్శిగా...
Read More...
State News 

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు

రాష్ట్రంలో ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాల ఖరారు హైదరాబాద్ జూలై 16: తెలంగాణ రాష్ట్రం లో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రం మొత్తంలోకొత్త మండలాలతో కలిపి మొత్తం 566 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా 5,773 ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.కాగా స్థానిక సంస్థల...
Read More...
Local News  State News 

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం - ఎమ్మెల్సీ కవిత 

25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు తెలంగాణ జాగృతి పోరాటం - ఎమ్మెల్సీ కవిత  బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే రాజకీయ అవకాశాలు దక్కని కులాలకు సబ్ కోటా ఇవ్వాలి కేవియట్ వేయకుండా ఆర్డినెన్స్ ఇస్తే ప్రభుత్వంపై ఉద్యమిస్తాం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ జూలై 16:25 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,...
Read More...
Local News  State News 

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం

టీడీఎఫ్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు ఎంపీలకు ఆహ్వానం సికింద్రాబాద్,  జూలై 16 (ప్రజా మంటలు):   కాలిఫోర్నియా లో ఆగస్టు 8,9,10 తేదీల్లో నిర్వహించే యుఎస్ఏ  తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సిల్వర్ జూబ్లీ వేడుకలకు రావాలని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ లను ప్రతినిధులు ఆహ్వానించారు.  తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి, ప్రస్తుతం రాష్ట్ర అభివృద్ధి
Read More...