గ్రూప్1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష.

On
గ్రూప్1 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి - జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

 

జగిత్యాల మే 30( ప్రజా మంటలు) : 

తెలంగాణ ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ - 1 పరీక్ష ప్రతిష్టాత్మకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.

గురువారం రోజున కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో కోర్ గ్రూప్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..... 

గ్రూప్ 1 పరీక్షను టి జి పి ఎస్ సి నిబంధనల ప్రకారం నిర్వహించాలని అన్నారు.

పరీక్ష నిర్వహకు 22 మంది చీఫ్ సూపర్ ఇంటెండెంట్ లు, 22 మంది పరిశీలకులు, 22 మంది డిపార్టుమెంటల్ అధికారులను, నలుగురు రూట్ అధికారులు, నలుగురు సహాయ రూట్ అధికారులు, నలుగురు ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, 157 మంది ఐడెంటిఫికేషన్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు.

జిల్లాలో 22 పరీక్ష కేంద్రాల్లో జగిత్యాల లో 18 జేఎన్టీయూ లో ఒకటి, కోరుట్లలో 3 కేంద్రాలు ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు.

ఈ గ్రూప్ 1 పరీక్షకు 7692 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు.

ఈ పరీక్షకు నోడల్ అధికారిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర ను నియమించినట్లు తెలిపారు.

జూన్ 9 న జరిగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 9 గంటల నుండి పరీక్ష కేంద్రాలకు నిషిత పరిశీలన చేసి పంపించడం జరుగుతుందని, ఉదయం 9-30 నీ. లకు బయో మెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

అభ్యర్తులేవరు అనుమతి లేని వస్తువులు పరీక్ష హాల్ లోకి తీసుక వెళ్లరాదని తెలిపారు. ప్రతీ పరీక్ష కేంద్రంలో కనీసం మూడు సి.సి. కెమెరాలు అమర్చడం, అవసరమైన పక్షంలో అదనంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను సంబంధిత తహశీల్దార్లు పరిశీలించాలని పేర్కొన్నారు.

పరీక్ష కేంద్రాలకు గ్రామీణ ప్రాంతం నుండి వచ్చే రూట్లలో సమయానికి ముందే ఆర్.టి.సి. బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్.టి.సి. డిపో మేనేజర్ ను ఆదేశించారు.

పరీక్ష నిర్వహించి సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతీ కేంద్రంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ను ఆదేశించారు.

పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు, కాన్ఫిడెన్షియల్ మెటరియల్ ను సురక్షింతంగా ఉంచాలని పోలీసు అధికారులను కోరారు. రూట్ అధికారులు ముందే ఆయా రూట్లలో పర్యటించాలని సూచించారు. అభ్యర్థులను ఎలాంటి ఎలక్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించ బోమని తెలిపారు. పరీక్ష సమయం నకు ముందే అభ్యర్థులు వారి కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరుకోవాలని తెలిపారు. 

జూన్ 3 నుండి 11 వరకు జరిగే పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షను కూడా పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో సుమారు 700 మంది విద్యార్థులు మూడు పరీక్ష కేంద్రాల్లో పరీక్ష రాయనున్నారని తెలిపారు. 

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర, రీజనల్ కో ఆర్డినేటర్ వేణుగోపాల్, ఆర్డీఓ లు పి.మధుసూదన్, ఆనంద్ కుమార్, డీఎస్పీ రవీందర్ జిల్లా వైద్య అధికారి శ్రీధర్, ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత, తదితరులు పాల్గొన్నారు.

Tags