గురుకుల పాఠశాలలో గెస్ట్ పోస్టులకై దరఖాస్తు చేసుకోండి.

On
గురుకుల పాఠశాలలో గెస్ట్ పోస్టులకై దరఖాస్తు చేసుకోండి.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల, మే 30( ప్రజా మంటలు ) : 

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న గెస్ట్ టీచర్లు, లెక్షరర్లు పోస్టులకై దరఖాస్తు చేసుకోవాలని ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్ కోరారు.

గురువారం విడుదల చేసిన ప్రకటనలో మల్యాల, పెద్దపూర్ క్యాంప్ లోని తెలంగాణ గురుకుల పాఠశాలల్లో, కళాశాలల్లో

 • సంస్కృతం (2),
 • గణితం(2),
 • భౌతిక శాస్త్రం(2),
 • రసాయన శాస్త్రం(2),
 • వృక్ష శాస్త్రం(2),
 • జంతు శాస్త్రం(2) లను

భోధించుటకు సంబంధిత సబ్జెక్టులలో పి.జి, బియీడి కలిగి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కొరడమైనదని ప్రిన్సిపాల్స్ పేర్కొన్నారు.

అలాగే గురుకుల పాఠశాలలో భోధించుటకు టిజిటి లో

 • సంస్కృతం(1),
 • హిందీ(1),
 • ఆంగ్లం(1),
 • గణితం(2),

పిజిటి లో

 • గణితం (1),
 • బయోసైన్స్(2),
 • సోషల్ (2),
 • పిజిటి సోషల్ (1),
 • పిఈటి (1) పోస్టులు

ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.

ఇంగ్లీషులో బోధించే ప్రావీణ్యత కలిగిన వారు అనుభవం కలిగిన వారిని డెమో ద్వారా ఎంపిక చేయబడతారని పేర్కొన్నారు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 6 లోగా ప్రిన్సిపాల్, తెలంగాణ గురుకుల పాఠశాల, కళాశాల తాటిపెళ్లి, మల్యాల మండలం, జగిత్యాల జిల్లా కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

టిజిటి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కు టెట్ తప్పనిసరిగా ఉండాలని దరఖాస్తులను principal.aprs.thatipally@gmail.com ప్రిన్సిపల్ చెప్పారు.

Tags