నా బిడ్డకు రాజకీయ భవిష్యత్తునివ్వండి - స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నా బిడ్డకు రాజకీయ భవిష్యత్తునివ్వండి దళిత బందు ద్రోహి - తాటికొండ రాజయ్య... బిజెపి పార్టీ తెలంగాణకు చేసిందేమిలేదు... స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నా బిడ్డకు రాజకీయ భవిష్యత్తునివ్వండి
దళిత బందు ద్రోహి - తాటికొండ రాజయ్య...
బిజెపి పార్టీ తెలంగాణకు చేసిందేమిలేదు...
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
వేలేరు మే 9 (ప్రజా మంటలు) : తన బిడ్డ కడియం కావ్యకు రాజకీయ భవిష్యత్తునివ్వాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి కోరారు.
హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రం లోని పిచరా మద్దెలగూడెం, శాలపల్లి కమ్మరిపేట గుండ్ల సాగర్ గ్రామాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన స్ట్రీట్ కార్నర్ మీటింగులో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిది గా పాల్గొన్నారు.ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండలేక తాను నియోజకవర్గ అభివృద్ధి కొరకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికే కాంగ్రెస్ పార్టీలో చేరానని పేర్కోన్నారు.
అందరం కలిసి కట్టుగా మన గ్రామాలను, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామన్నారు. కాంగ్రెస్ పార్టీల సునామిలో కల్వకుంట్ల కుటుంబం కొట్టుకు పోయిందన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి కేసీఆర్ తన కుటుంబ ఖాజాన నింపుకున్నాడని ఆరోపించారు.పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఆయన కుటుంబ సభ్యులే బాగుపడ్డారని ఆరోపించారు.
వేలేరు మండలం అభివృద్ధి చేశానంటూ అంటున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి సాగు నీరు కోసం తెచ్చిన ప్రాజెక్టు లో 104 కోట్ల రూపాయలలో 6కోట్లు పల్లా రాజేశ్వర్ రెడ్డి కమిషన్ తీసుకున్నది నిజం కదా.అధికారం చేతిలో ఉందని కోట్ల కోట్లకు దండుకున్నారు. కేసీఆర్ కుటుంబమంతా అవినీతికి పాల్పడ్డారని స్వయంగా కేసీఆర్ బిడ్డ కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని తీహార్ జైల్లో ఉందని పేర్కోన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని అంబేడ్కర్ విగ్రహాలను కూల్చి వేస్తారన్నారు. మాజీ ఎమ్మెల్యే పదవులు పనులు అమ్ముకున్నారని దళిత ఎమ్మెల్యే అయ్యి కూడా దళితబందులో కమిషన్ తీసుకున్నారని దుయ్యబట్టారు.
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు తనకు రాజకీయంగా అండగా నిలిచి కడుపులో పెట్టుకొని ఆదరిస్తున్నారన్నారు. ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పారు.నియోజక వర్గానికి 7వేల ఇందిరమ్మ ఇండ్లు రాబోతున్నాయని ఇందిరమ్మ పథకాలు అమలు చేయాలన్న, మంజూరు ఇవ్వాలన్నా ఇందిరమ్మ కమిటీల ద్వారానే జరుగుతుందన్నారు. కేంద్రంలో 10ఏళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసిందని అన్నారు .
మోడీ పాలనలో ముస్లింలకు క్రిస్టియన్లకు,దళితుకకు అన్యాయం జరుగుతుందని పేర్కోన్నారు. తన బిడ్డ కావ్యను మీ బిడ్డగా,చెల్లెగా, అక్కగా, అడపడుచుగా భావించి ఆశీర్వదించాలని ఆమెకు రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని ప్రజలను కోరారు. మే 13న జరిగే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు
---------------------------
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్‌ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
