మా గడ్డపై వచ్చి బెదిరిస్తే ఊరుకొం #నిజాం కు పట్టిన గతే పడుతుంది - రేవంత్ రెడ్డి
మా గడ్డపై వచ్చి బెదిరిస్తే ఊరుకొం
#నిజాం కు పట్టిన గతే పడుతుంది
#భయపెడితే పెడితే భయ పడే వారు లేరిక్కడ
#కేసులకు రేవంత్ రెడ్డి బేదరడు
#మీకు ఈడి, సిబిఐ లు ఉంటే నాకు ప్రజలున్నారు
#కాంగ్రెస్ తోనే అభివృద్ధి
కోరుట్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి
కోరుట్ల మే 1 (బ్రహ్మన్నగారి శంకర్ - ప్రజా మంటలు )
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాడు కోరుట్ల శివార్ లో జరిగిన జన జాతర భహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుగా మేడే సందర్బంగా కార్మికులకు, కర్షకులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమని గడీల పాలన అంతమై ప్రజా పాలన మొదలైందని నా పై అక్రమ కేసులు పెట్టిన కెసిఆర్ నడుం విరిగిపడి ఇంట్లో పడుకున్నాడని అన్నారు. అనంతరం బీజేపీ, మోదీ మరియు అమిత్ షా పై విరుచుకుపడిన సీఎం దేశానికి ప్రధాని,పెద్ద వారు అని మోదీకి గౌరవం ఇస్తే నా ఊరికి వచ్చి నన్నే బెదిరిస్తారా మీరు బెదిరిస్తే బెదిరే వారు లేరిక్కడ మీ దగ్గర
సిబిఐ, ఈడి లు ఉంటే నాకు నాల్గున్నర కోట్ల ప్రజలు అండగా ఉన్నారని భయపెట్టి పెత్తనం చేయాలంటే నిజాం ప్రభుత్వానికి పట్టిన గతే మీకు పడుతుందని హెచ్చరించారు. దేశానికి, రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది ఏమి లేదని ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ అన్ని తామే చేస్తున్నట్టు బీజేపీ వాళ్ళు ప్రవర్తిస్తున్నారని తెలంగాణ కు బీజేపీ ఇచ్చింది గాడిద గుడ్డు తప్ప ఏమి లేదని గాడిద గుడ్డు తో ఉన్న గుర్తు ను ప్రజలకు చూపిస్తూ నినాదాలు చేయించారు. ఈ ఎన్నికలు ఆశామాషి ఎన్నికలు కాదని ఒక ప్రత్యేక పరిస్థితి లో వచ్చిన 18వ పార్లమెంట్ ఎన్నికలని ఈ ప్రత్యేక పరిస్థితుల్లో వచ్చిన ఎన్నికల్లో బీజేపీ అబుకి బారు 400అనే నినాదం తో వచ్చిందని బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్ రద్దు చేయాలని చూస్తుందని దీనివల్ల మైనారిటీ, దళిత, గిరిజనులకు అన్యాయం జరుగుతుందని కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేట్టు చేయాలని ఆ విధంగా చేస్తే అధికారం లోకి వచ్చిన వెంటనే కుల గణన చేపడుతామని పాద యాత్ర లో రాహుల్ గాంధీ హామీ ఇచ్చాడని, తెలంగాణ లో కుల గణన ప్రక్రియ ప్రారంభించామని తెలిపారు. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి చాలా అనుభవం కలవారని గత 40 సంవత్సరాలుగా ప్రజా సేవలో ఉన్నారని ఆయన కు ఇక్కడి ప్రజల సమస్యలు తెలిసినట్టుగా ఇంకా ఎవరికి తెలియవని అన్నారు.మీ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ పోయిన ఎన్నికలలో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ వ్రాసి ఇచ్చాడని కానీ ఐదేండ్లయినా తేలేదని ఇంకా నేను ఈ పార్లమెంట్ నియోజకవర్గంను అభివృద్ధి చేశామని చెప్పుకొని ఓట్లు అడగడం హాస్యాస్పదంగా ఉందని ఏద్దేవా చేశారు.అభివృద్ధి కావాలంటే ఎంపీ అభ్యర్థి ప్రజల మనిషి జీవన్ రెడ్డి ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని ప్రజలను కోరారు. ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ నన్ను గెలిపిస్తే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ను అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ముత్యం పేట చెక్కర కర్మాగారాన్ని తెరిపించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ సభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్ధిల్ల శ్రీధర్ బాబు అడ్లూరి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, జువ్వాడి నర్సింగ రావు, కృష్ణా రావు, కొంరెడ్డి కరం నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.

తెలంగాణ IAS అధికారి రిజ్వీ స్వచ్ఛంద విరమణ – మద్యం టెండర్ వివాదం నేపథ్యంగా
.jpeg)
భోపాల్లో దీపావళి విషాదం: కార్బైడ్ గన్స్ పేలుళ్లతో 60 మందికి పైగా గాయాలు, పిల్లలు చూపు కోల్పోయిన ఘటనలు

ఆస్ట్రేలియా–భారత్ రెండో ODI: రోహిత్ హాఫ్ సెంచరీతో భారత్ 264 పరుగులు
.jpg)
బిహార్ ఎన్నికలు - తేజస్వీ యాదవ్ సీఎం అభ్యర్థి, ముకేష్ సహని డిప్యూటీ సీఎం
.jpg)
కాకినాడ అత్యాచారయత్నం కేసులో నిందితుడి ఆత్మహత్య.. చెరువులోకి దూకి మృతి

తమిళనాడులో ఈ రాత్రి భారీ వర్షాల హెచ్చరిక – 30 జిల్లాల్లో వర్ష సూచన

శ్రేయసి సింగ్ నుంచి శివానీ శుక్లా వరకు… కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న మహిళా నాయకులు

పట్టణ పేదలకు శుభవార్త! ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం
.jpeg)
మాజీ ప్రజా ప్రతినిధులకు క్యాష్ లెస్ వైద్యం అందించాలి - రాజేశం గౌడ్

జగిత్యాల జిల్లాలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ .
