గల్ఫ్ కార్మికులను అదుకొంటాం - కాంగ్రెస్ ఎం పై అభ్యర్థి జీవన్ రెడ్డి

On
గల్ఫ్ కార్మికులను అదుకొంటాం - కాంగ్రెస్ ఎం పై అభ్యర్థి జీవన్ రెడ్డి

గల్ఫ్ కార్మికులను అదుకొంటాం - కాంగ్రెస్ ఎం పై అభ్యర్థి జీవన్ రెడ్డి

మోర్తాడ్ ఏప్రిల్ 26 :

మోర్తాడ్ మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్ లో నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎం పీ అభ్యర్థి తాటి పర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మూడు రోజుల్లో మహిళా లకు ఆర్టీసీ బస్సు ల్లో ఉచిత ప్రయాణం కల్పించినం.ఆరు గ్యారంటీ ల అమలుకు కృషి చేస్తున్నం.రు.500 లకే సిలిందర్ అందజేస్తున్నాం.  వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నం.

బీడీ కార్మికులకు పీ ఎఫ్ ఉన్న ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందిస్తం.రెండు లక్షల రుణ మాఫీ చేయనున్నాం.రైతులకు విద్యుత్ భారం కాకూడదని ఉచిత విద్యుత్ సరఫరా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ది.

బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉచిత బస్సు సౌకర్యం కల్పీస్తున్నారా..సిలిండర్ 500 లకే ఇస్తున్నారా..ఉపాధి హామీ పథకం ప్రవేశ పెట్టీ ఉపాధి కల్పించినం.

పదేళ్ల కాలంలో గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఎవరికైనా పరిహారం అందించారా అని నిలదీశారు.

గల్ఫ్ కార్మికులకు ఆదుకునేందుకు ఒక్క రూపాయి అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డీ గల్ఫ్ లో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రు.5 లక్షలు అందిస్తామన్నారు.

కల్యాణలక్ష్మి తోపాటు తులం బంగారం అందజేస్తాం..కాంగ్రెస్ కు ఓటు వేసి,ఎం పీ గా ఆశీర్వ దించాలని  జీవన్ రెడ్డి కోరారు

Tags