అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలి.
- జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఏప్రిల్ 19 (ప్రజా మంటలు)
అర్హత గల ప్రతీ ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్యం తీసుకురావాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.
శుక్రవారం రోజున కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్ నందు అదనపు కలెక్టర్లతో కలిసి వివిధ శాఖల అధికారులతో స్వీప్ కార్యక్రమాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటింగ్ శాతం ఎక్కడ అయితే తక్కువగా ఉందో ఆయా ప్రాంతాలలో స్వీప్ కార్యక్రమాలు నిర్వహించి ఓటు శాతం పెంచాలని, ఎక్కువగా పోలింగ్ శాతం ఉందో అక్కడ మెయింటైన్ చేయాలని అన్నారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచే దిశగా వివిధ శాఖల ద్వారా స్వీప్ కార్యక్రమాలను ఈ నెల 20 నుండి వచ్చే నెల 11 వరకు రోజువారీ కార్యక్రమాలను ప్రణాళికలతో నిర్వహించాలని అన్నారు.
వేసవి కాలం దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవులు ఉన్నందున యువత తప్పలనిసరిగా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా కార్యక్రమాలను రూపొందించి విస్తృత పరచాలని అన్నారు. మే 13 జరిగే లోకసభ పోలింగ్ కేంద్రాలలో కనీస మాలిక సదుపాయాలు కల్పించాలని అన్నారు.
వేసవి కాలం దృష్ట్యా త్రాగునీటి సౌకర్యం కల్పించాలని అన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు పి.రాంబాబు, దివాకర, ఆర్డీఓ పి.మధుసూదన్, స్వీప్ నోడల్ అధికారి మదన్ మోహన్, ఎస్సీ కార్పొరేషన్ ఈ డీ లక్ష్మీనారాయణ, జిల్లా అధికారులు, స్వీప్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మెడికల్ కళాశాలకు ఎన్ఎంసి నోటీస్ జారీ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు

చిన్న వయసులోనే సామాజిక బాధ్యతతో వ్యవహరించడం అభినందనీయం

రైతుల భూ సమస్యలను మళ్ళీ కలెక్టర్,తహసీల్దార్లకు ఇవ్వడం సరికాదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నిర్వహించిన జిల్లా మహాసభ పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పెద్దమ్మ తల్లి బోనాల ఆహ్వాన పత్రిక అందజేత

నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఎదగాలి. -ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి

దశాబ్దం తర్వాత నెరవేరుతున్న పేదల సొంతింటి కల

బహరేన్ లో తొమ్మిది మంది తెలంగాణ వసూల అరెస్ట్

బీజేపీ జగిత్యాల పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్

బోనాల జాతర నిధులు పక్కదారి పడుతున్నాయి..

ఉద్యోగ సిబ్బంది కృషితోనే సౌత్ సెంట్రల్ రైల్వేకు దేశంలో గుర్తింపు

గల్ఫ్ అడ్వైజరి బొర్డ్ కు చాంద్ పాషా విజ్ఞప్తి
