ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్​ బాలిక

On
ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్​ బాలిక

ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్​ బాలిక స్టూడెంట్​    * స్నాప్​ చాట్​ లో బాలికకు వలవేసిన డిగ్రీ స్టూడెంట్    *  ఇంట్లో నుంచి 16 తులాల బంగారం, లక్షా 50 వేల చోరి

ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్​ బాలిక స్టూడెంట్​
   * స్నాప్​ చాట్​ లో బాలికకు వలవేసిన డిగ్రీ స్టూడెంట్
   *  ఇంట్లో నుంచి 16 తులాల బంగారం, లక్షా 50 వేల చోరి

సికింద్రాబాద్​, ఏప్రిల్​ 16 ( ప్రజామంటలు ):

చదువుకోవడానికి చెల్లెలు  కూతురుకు తమ ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన పెద్దమ్మ ఇంటికే  ఓ విద్యార్థిని కన్నం వేసిన ఘటన చిలకలగూడ పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. ఈస్ట్ జోన్​ డీసీపీ ఆర్​. గిరిధర్​ మంగళవారం చిలకలగూడ పీఎస్​ ఆవరణలో మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబందించిన వివరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం...చిలకలగూడ లోని  ప్రభుత్వ ఉద్యోగి  పెద్దమ్మ ఇంట్లో ఉండి ఓ బాలిక (13) 2020 సంవత్సరం నుంచి  (8 వ తరగతి) చదువుకుంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నెలలో బాలిక పెద్దనాన్న శ్రీనివాసరావు ( ప్రభుత్వ ఎంప్లాయి ) షర్ట్ లోని రూ 3వేలు నగదు మాయమైంది. అనుమానం వచ్చి ఇంట్లో సదరు బాలికను ప్రశ్నించగా, తనకు తెలియదని బుకాయించింది. తర్వాత కొంతకాలానికి ఇంట్లో లాకర్లు తెరచి చూడగా, విలువైన బంగారు ఆర్నమెంట్స్​, నగదు కనబడకుండా పోవడంతో ఆందోళన చెందిన ఫ్యామిలీ మెంబర్స్​ బాలికను ప్రశ్నించారు. బాలిక మొబైల్​ చూడగా, అందులో స్నాప్​చాట్​, వాట్సాప్​ లో విజయ్​ కుమార్​ అబ్బాయితో చనువుగా చాటింగ్​ చేసినట్లు గుర్తించారు. వారు బాలికను గట్టిగా ప్రశ్నించడంతో జరిగిన తతంగాన్ని పూర్తిగా వివరించింది. ఇన్​స్టాగ్రామ్​ లో కడప నివాసి, ప్రస్తుతం బెంగళూర్​ లో డిగ్రీ చదువుతున్న  చెప్పలి విజయ్​ కుమార్​ (19) తో పరిచయం ఉందని పేర్కొంది. తన పేరేంట్స్​ ఆరోగ్యం బాగాలేదని చెబితే  బాధితుల ఇంట్లో నుంచి 16 తులాల బంగారం నగలను, ఒక లక్షా 50 వేల నగదును దొంగలించి,  విజయ్​ కి ఇచ్చినట్లు బాలిక ఒప్పుకుంది. బంగారం నగలను  పలు చోట్ల తాకట్టు పెట్టగా, నగదును లిక్కర్​, సిగరేట్స్​ తాగడానికి, ఆన్​ లైన్​ క్రికెట్​ బెట్టింగ్​ కు వాడుకున్నట్లు గుర్తించారు.  ఆ తర్వాత బాధితులు చిలకలగూడ పోలీస్​ స్టేషన్​ లో  ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ప్రేమ పేరుతో మైనర్​ బాలికను లోబర్చుకొని,  హైదరాబాద్​ లోనే ఉంటున్న విజయ్​ కుమార్​ సినిమాలు, షికార్లకు  తీసుకెళ్ళి, లైంగికంగా కూడ దాడిచేసినట్లు గుర్తించారు. ఈనెల 15న నిందితుడు విజయ్​ కుమార్​ ను అరెస్టు చేసిన పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. విజయ్​ కుమార్​ పై ఫోక్సో, డైవర్టింగ్ అటెన్షన్​,  తదితర నేరాలకు సంబందించిన కేసులు నమోదు చేసినట్లు డీసీపీ వివరించారు. సకాలంలో నిందితుడిని గుర్తించి, 16 తులాల బంగారం ఆర్నమెంట్స్​ ను రికవరీ చేసిన పోలీస్​ సిబ్బందిని అభినందించి, సీపీ ప్రకటించిన రివార్డులను చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి, ఎస్​హెచ్​వో అనుదీప్​, లాలాగూడ ఎస్​హెచ్​వో రమేశ్​ గౌడ్​, ఆంజనేయులు, కరుణాకర్​ రెడ్డి, జగదీశ్​, నవీన్​, గణేశ్​, విజయ్​ , కానిస్టేబుళ్ళకు అందచేశారు. ఈరోజుల్లో అంతటా సీసీ కెమెరాలు ఉన్నాయని, మొబైల్​ సాయంతో కూడ నిందితులను గుర్తించడం సులభంగా మారిందని, నేరస్థులు తప్పించుకోవడం జరగదని డీసీపీ గిరిధర్​ పేర్కొన్నారు.  ఎవరూ కూడ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా, జాగ్రత్తగా ఉండాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు.  
––––––––––––
–ఫొటోలు:

Tags