ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్ బాలిక
ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్ బాలిక స్టూడెంట్ * స్నాప్ చాట్ లో బాలికకు వలవేసిన డిగ్రీ స్టూడెంట్ * ఇంట్లో నుంచి 16 తులాల బంగారం, లక్షా 50 వేల చోరి
ఆశ్రయం ఇచ్చిన ఇంటికే కన్నం వేసిన మైనర్ బాలిక స్టూడెంట్
* స్నాప్ చాట్ లో బాలికకు వలవేసిన డిగ్రీ స్టూడెంట్
* ఇంట్లో నుంచి 16 తులాల బంగారం, లక్షా 50 వేల చోరి
సికింద్రాబాద్, ఏప్రిల్ 16 ( ప్రజామంటలు ):
చదువుకోవడానికి చెల్లెలు కూతురుకు తమ ఇంట్లో ఆశ్రయం ఇచ్చిన పెద్దమ్మ ఇంటికే ఓ విద్యార్థిని కన్నం వేసిన ఘటన చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈస్ట్ జోన్ డీసీపీ ఆర్. గిరిధర్ మంగళవారం చిలకలగూడ పీఎస్ ఆవరణలో మీడియా సమావేశంలో ఈ కేసుకు సంబందించిన వివరాలు తెలిపారు. ఆయన కథనం ప్రకారం...చిలకలగూడ లోని ప్రభుత్వ ఉద్యోగి పెద్దమ్మ ఇంట్లో ఉండి ఓ బాలిక (13) 2020 సంవత్సరం నుంచి (8 వ తరగతి) చదువుకుంటుంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నెలలో బాలిక పెద్దనాన్న శ్రీనివాసరావు ( ప్రభుత్వ ఎంప్లాయి ) షర్ట్ లోని రూ 3వేలు నగదు మాయమైంది. అనుమానం వచ్చి ఇంట్లో సదరు బాలికను ప్రశ్నించగా, తనకు తెలియదని బుకాయించింది. తర్వాత కొంతకాలానికి ఇంట్లో లాకర్లు తెరచి చూడగా, విలువైన బంగారు ఆర్నమెంట్స్, నగదు కనబడకుండా పోవడంతో ఆందోళన చెందిన ఫ్యామిలీ మెంబర్స్ బాలికను ప్రశ్నించారు. బాలిక మొబైల్ చూడగా, అందులో స్నాప్‌చాట్, వాట్సాప్ లో విజయ్ కుమార్ అబ్బాయితో చనువుగా చాటింగ్ చేసినట్లు గుర్తించారు. వారు బాలికను గట్టిగా ప్రశ్నించడంతో జరిగిన తతంగాన్ని పూర్తిగా వివరించింది. ఇన్స్టాగ్రామ్ లో కడప నివాసి, ప్రస్తుతం బెంగళూర్ లో డిగ్రీ చదువుతున్న చెప్పలి విజయ్ కుమార్ (19) తో పరిచయం ఉందని పేర్కొంది. తన పేరేంట్స్ ఆరోగ్యం బాగాలేదని చెబితే బాధితుల ఇంట్లో నుంచి 16 తులాల బంగారం నగలను, ఒక లక్షా 50 వేల నగదును దొంగలించి, విజయ్ కి ఇచ్చినట్లు బాలిక ఒప్పుకుంది. బంగారం నగలను పలు చోట్ల తాకట్టు పెట్టగా, నగదును లిక్కర్, సిగరేట్స్ తాగడానికి, ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ కు వాడుకున్నట్లు గుర్తించారు. ఆ తర్వాత బాధితులు చిలకలగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. ప్రేమ పేరుతో మైనర్ బాలికను లోబర్చుకొని, హైదరాబాద్ లోనే ఉంటున్న విజయ్ కుమార్ సినిమాలు, షికార్లకు తీసుకెళ్ళి, లైంగికంగా కూడ దాడిచేసినట్లు గుర్తించారు. ఈనెల 15న నిందితుడు విజయ్ కుమార్ ను అరెస్టు చేసిన పోలీసులు బాలికను భరోసా కేంద్రానికి తరలించారు. విజయ్ కుమార్ పై ఫోక్సో, డైవర్టింగ్ అటెన్షన్, తదితర నేరాలకు సంబందించిన కేసులు నమోదు చేసినట్లు డీసీపీ వివరించారు. సకాలంలో నిందితుడిని గుర్తించి, 16 తులాల బంగారం ఆర్నమెంట్స్ ను రికవరీ చేసిన పోలీస్ సిబ్బందిని అభినందించి, సీపీ ప్రకటించిన రివార్డులను చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డి, ఎస్‌హెచ్‌వో అనుదీప్, లాలాగూడ ఎస్‌హెచ్‌వో రమేశ్ గౌడ్, ఆంజనేయులు, కరుణాకర్ రెడ్డి, జగదీశ్, నవీన్, గణేశ్, విజయ్ , కానిస్టేబుళ్ళకు అందచేశారు. ఈరోజుల్లో అంతటా సీసీ కెమెరాలు ఉన్నాయని, మొబైల్ సాయంతో కూడ నిందితులను గుర్తించడం సులభంగా మారిందని, నేరస్థులు తప్పించుకోవడం జరగదని డీసీపీ గిరిధర్ పేర్కొన్నారు. ఎవరూ కూడ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా, జాగ్రత్తగా ఉండాలని డీసీపీ విజ్ఞప్తి చేశారు.
––––––––––––
–ఫొటోలు:
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మాతా శిశు ఆసుపత్రి పరిశీలన
జగిత్యాల (రూరల్) నవంబర్ 03 (ప్రజా మంటలు):
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆసుపత్రి మరియు ఆక్సిజన్ ప్లాంట్‌ను సందర్శించారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్ సరఫరా, మందుల నిల్వలు, స్టాఫ్ హాజరు రిజిస్టర్ తదితర అంశాలను పరిశీలించి, వైద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.... మీర్జగూడ బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కవిత
హైదరాబాద్ నవంబర్ 03 (ప్రజా మంటలు):
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ స్టేజీ వద్ద ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొని జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై తెలంగాణ జాగృతి అధినేత్రి కవిత, ట్విట్టర్ ద్వారా తన తీవ్ర ద్రిగ్బాంతి వ్యక్తం చేసారు.
ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆర్ధికంగా ఆదుకోవడంతో పాటు గాయపడిన... జయపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – డంపర్ 17 వాహనాలను డీ కొట్టడంతో, 11 మంది మృతి, 10 మందికి పైగా గాయాలు
జయపూర్ (రాజస్తాన్), నవంబర్ 03
జయపూర్‌లో భయంకర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న భారీ డంపర్ నియంత్రణ కోల్పోయి వరుసగా 17 వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, 10 మందికి పైగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని SMS ట్రామా సెంటర్‌కు... చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం – 17 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద బస్సు, లారీ ఢీ. ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్, నవంబర్ 03:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మీర్జాగూడ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సును కాంకర్ లారీ... ప్రపంచ మహిళా క్రికెట్ కప్ విజేత భారత్ — చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ సేన
మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ఫైనల్లో భారత్ ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ చేసిన భారత్ బౌలర్ల అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఓడించింది.
భారత్ విజయం: 47 పరుగుల తేడాతోమ్యాచ్ బెస్ట్ ప్లేయర్: స్మృతి మంధానాసిరీస్ బెస్ట్ ప్లేయర్: హర్మన్‌ప్రీత్ కౌర్
నవి ముంబై నవంబర్ 02:
మహిళల... నవీన్ యాదవ్‌కు మద్దతుగా పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ ప్రచారం
సికింద్రాబాద్ , నవంబర్ 02 (ప్రజా మంటలు):
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి వి. నవీన్ యాదవ్‌కు మద్దతుగా సోమాజిగూడ డివిజన్ లోని ఎల్లారెడ్డి గూడలో పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా దుర్గాదేవి ఆలయంలో నవీన్ యాదవ్ గెలవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.... కెన్యాలో కార్తీక మాస వనభోజనాలు..పూజలు
సికింద్రాబాద్, నవంబర్ 02 (ప్రజామంటలు) :
కెన్యా దేశంలోని మోంబాసా లో స్థిరపడ్డ తెలుగు రాష్ర్టాల ప్రజలు ఆదివారం కార్తీక మాస పూజలు, వనభోజనాలు కార్యక్రమాలను సంప్రదాయబద్దంగా నిర్వహించారు. మోంబాసా లోని విశాలమైన హిందూ యూనియన్ పార్కు ప్రాంతంలో మహిళలు రావి చెట్టు కింద ఉసిరి కొమ్మలు,ఉసిరి కాయలు, తులసి ఆకులు పెట్టి శివుడికి పూజలు... బీహార్‌ను మేడ్ ఇన్ ఇండియా హబ్‌గా మార్చడమే లక్ష్యం’: ప్రధాని మోదీ
ఆరా (బీహార్) నవంబర్ 02:
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటనలు చేశారు. ఆరాలో జరిగిన ఈ భారీ సభలో ఆయన మాట్లాడుతూ, “బీహార్‌ను మేడ్ ఇన్ ఇండియా హబ్‌గా మార్చడమే నా లక్ష్యం. బీహార్ ప్రజలు ఎన్డీఏతో ఉన్నారు” అని స్పష్టం చేశారు.
“ఢిల్లీ... తెలంగాణ జాగృతిలో భారీగా బీసీ నాయకుల చేరికలు
హైదరాబాద్ నవంబర్ 02 (ప్రజా మంటలు):
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కు బీసీ సమాజం నుంచి మద్దతు లభిస్తోంది. కవిత నాయకత్వం, బీసీ హక్కుల కోసం ఆమె చేస్తున్న కృషి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేకమంది బీసీ నాయకులు జాగృతి లో... తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ప్రకటన
హైదరాబాద్ నవంబర్ 03 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా మోరం వీరభద్రరావు, జాడి శ్రీనివాస్ నియమితులయ్యారు. టీజేటీఎఫ్ నూతన కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం ప్రకటించారు. తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ విద్యారంగ వికాసానికి, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని పేర్కొన్నారు.
తెలంగాణ... 🇮🇳 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ — భారత మహిళలు 298/7 స్కోరుతో ఇన్నింగ్స్ పూర్తి
నవి ముంబై నవంబర్ 02:
నవి ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో జరుగుతున్న 2025 మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా మహిళల కెప్టెన్ లౌరా వోల్వార్ట్ట్ ఫీల్డింగ్ ఎంచుకున్నా, భారత బ్యాటర్లు తమ దూకుడు ఆటతో స్కోర్‌బోర్డ్‌ను రన్‌లతో నింపారు.
ఓపెనర్ స్మృతి... భారత్ vs దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచకప్ ఫైనల్ – శఫాలీ, స్మృతీ అద్భుత ఆరంభం
ముంబయి నవంబర్ 02:
నవి ముంబయిలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్లో భారత్ జట్టు అద్భుత ఆరంభం చేసింది. ఓపెనర్లు శఫాలీ వర్మా, స్మృతీ మందానా సాహసోపేత బ్యాటింగ్‌తో భారత జట్టుకు బలమైన మొదటి పునాది వేశారు. ఇద్దరూ దక్షిణాఫ్రికా బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ స్కోరు వేగంగా పెంచుతున్నారు.
చరిత్ర సృష్టించాలన్న హర్మన్‌ప్రీత్ కౌర్... 