తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ" మార్చి 27...ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా

On
తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ

"తెలంగాణకే తలమానికమైన ధర్మపురి నాటక సంస్థ"
మార్చి 27...ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా 

 రామ కిష్టయ్య సంగనభట్ల...9440595494

 తెలంగాణలోనే మొదటిదిగా, తెలంగాణకే తలమానికంగా, ధర్మపురి పుణ్య క్షేత్రంలోని శ్రీ లక్ష్మనరసింహ నాట్య మండలి గత 85 సంవత్సరాలకు పైగా, కళామత ల్లికి ఎనలేని సేవలందిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. సనాతన ఆర్ష విద్యా సభ్యతా సంస్కృతులకు నిలయమైన ఈ క్షేత్రంలో, 1936 లో ప్రారంభమైన నాటక సంస్థ 3 తరాల నటులతో పలు పౌరాణిక సాంఘిక చారిత్రక నాటకాలు - నాటికలు ప్రదర్శిస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు ప్రజాభిమానాన్ని చూర గొన్నది. గోదావరి తీరస్థ ప్రాచీన తీర్థము, పుణ్య క్షేత్రము అయిన ధర్మపురి పట్టణం, వేల సంవత్సరాల నుండి ఉజ్వల సాంస్కృతిక, వైదిక, నాగరికత, కలిగివున్న క్షేత్రంగా... ఆర్ష విద్యతో పాటు, సంగీతాది లలిత కళలకు నిలయంగా వాసికెక్కింది. తెలంగాణ ప్రాంతంలో సాంస్కృతిక చైతన్యం అంతగా లేక, స్తబ్దంగా ఉన్న రోజుల్లో, స్థానికుల సహకారంతో స్థాపించబడిన నాటక సంస్థ, తెలంగాణ లోనే మొదటిదిగా నిలువ కలిగింది. ఇది ప్రారంభం అయ్యే నాటికి తెలుగు భాషకు విలువ లేని "ఉర్దూ రాజభాష"గా గల నిజాం రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు... భారతీయ సంస్కృతికి వైద్యులకు కళలకు విలువ ఇవ్వని కేంద్ర  ఆంగ్ల ప్రభుత్వం మరోవైపు, అననుకూల వాతావరణం ఉండేది. అయినా స్థానికుల అభిమానం, ధనం, సేవాభావం, ఈ సంస్థకు ఊపిరి పోసాయి. కీర్తిశేషులు కాసర్ల వెంకట రాజయ్య శిక్షణలో, దర్శకత్వంలో, తొలి తరం నటులు "సతీ సావిత్రి" నాటక ప్రదర్శనతో ప్రారంభించి, అనంతర కాలంలో వెను తిరిగి చూడకుండా, సుమారు పాతిక పౌరాణిక నాటకాలు... ద్రౌపతి వస్త్రాపహరణం, భక్త ప్రహ్లాద, శ్రీకృష్ణ తులాభారం, లవకుశ, భక్త రామదాసు, సతీ సక్కుబాయి, సతీ తులసి, శ్రీకృష్ణ రాయబారం, పాండవోద్యోగం వంటి అనేక నాటకాలు ప్రదర్శించారు. ఆరోజుల్లో ఈ నటులు ప్రదర్శించని పౌరాణిక నాటకమే లేదంటే అతిశయోక్తి లేదేమో. కాకెరి లక్ష్మీ కాంత శాస్త్రి, రొట్టె చంద్రశేఖరశాస్త్రి, సంగనభట్ల మాణిక్య శాస్త్రి, తెలంగాణ త్యాగయ్య చాచం కృష్ణయ్య, జగన్నగారి విశ్వనాథశాస్త్రి లాంటి ఉద్దండులు, వారి సరసన దెమ్మ బాలకృష్ణయ్య స్త్రీ పాత్ర ధారిగా తొలి తరం నటులు బహు ప్రశంసా పాత్రులు అయినారు. నాటక సంస్థ రథసారథులలో  ఒకరైన కే. వీ. కేశవులు ( రాష్ట్ర మాజీ మంత్రి), 1946 లో మంచిర్యాలలో ఆంధ్ర సారస్వత పరిషత్తు మహా సభలలో, శ్రీకృష్ణ తులాభారం నాటకాన్ని ప్రదర్షింప చేయగా, సురవరం ప్రతాపరెడ్డి, మాడపాటి హనుమంతరావు, నార్ల వెంకటేశ్వరరావు వంటి ప్రముఖులు నాటకాన్ని కాంచి, బహుథా ప్రశంసించారు. తర్వాత కాలంలో దేవులపల్లి రామానుజరావు, కాళోజీ నారాయణరావు, పివి నరసింహారావు, స్థానం నరసింహారావు లాంటి మేధావుల ప్రశంసా పాత్రమైంది. స్థానిక దైవం లక్ష్మీ నరసింహ బ్రహ్మోత్సవాలలో, ప్రత్యేక ఓపెన్ థియేటర్ లో  ప్రదర్శిత నాటకాలకు జనం టిక్కెట్టు కొని మరీ చూసేవారు. ఆ రోజుల్లోనే సొంత నాటక ప్రదర్శన శాల ఉండేది. రకరకాల సీనరీ పరదాలు,  మేకప్ సామగ్రి, గదలు, కిరీటాలు, ఉయ్యాలలు, నిచ్చెనలు, ఫైర్ వర్క్స్, వగయిరా సకల హంగులతో అట్టహాసంగా ఉండేది. మొదటి తెరపై భారతమాత చిత్రపటం కలిగి ఉన్న ఈ సంస్థ ఆ రోజుల్లో పెద్ద సాహసమే చేసింది. ఎందుకంటే ఇది రాజ ద్రోహం కిందకు వచ్చేది. ఫైర్ వర్క్స్ లో యముని రాక, నారదుని మబ్బుల్లో ప్రయాణం, శిశుపాలుని శిరచ్ఛేదం, ప్రహ్లాదుని అగ్నిగుండంలో వేయడం, ద్రౌపదికి కృష్ణుడు చీరలు అందించడం, వంటి ఎన్నో అద్భుతాలను కశో జ్జల శివరామయ్య పర్యవేక్షణలో చూపారు. రెండవ తరం నటులు దశాబ్దకాలం ప్రదర్శన ఇవ్వగా, నాటి సీనియర్ నాయకులు దాద గారి కిషన్ రావు నిర్వహణలో, సంస్కృతాంధ్ర డిగ్రీ కళాశాలకు ప్రారంభ నిధుల సేకరణ గావించారు. గయోపాఖ్యానం నాటకం తెలంగాణ లోని చాలా ప్రాంతాల్లో రొట్టె విశ్వనాథశాస్త్రి, గుండయ్య శాస్త్రి, పెండ్యాల శంకర్, ఓజ్జల రామచంద్రం, నరసింహా చారి, గుండి హనుమాన్లు, భోగం పురుషోత్తం వంటి మేటి నటులతో ప్రదర్శించారు. మూడవ తరంలో పౌరాణిక నాటకాలతో పాటు వీరపాండ్య కట్ట బొమ్మన, వీర కాపయ, నాగమ నాయకుడు లాంటి చారిత్రక నాటకాలు పెక్కు సాంఘిక నాటకాలు ప్రదర్శనలను కొనసాగిస్తున్నారు. 1984 లో జిల్లా కలెక్టర్ కె ఎస్ శర్మ, 1991 లో కలెక్టర్ బన్వర్ లాల్ ఆహ్వానం మేరకు, వారి సమక్షంలో కరీంనగర్ కళాభారతిలో ప్రదర్శనలిచ్చి బహుమతులు అందుకున్నారు. 1989 లో తెలుగు విశ్వ విద్యాలయం నిర్వహించిన, సాంప్రదాయ పద్య నాటక పోటీలలో సూర్యాపేటలో "కట్టబొమ్మన" ప్రదర్శించారు. 2016లో వరంగల్ లో, వేణుమాధవ్ ఆడిటోరియంలో... అనంతరం హైదరాబాదులోని రవీంద్ర భారతిలో.. ప్రదర్శన ఇవ్వడం జరిగింది. నిధులు ప్రోగు చేసి సొంత సామగ్రిని సమకూర్చు కున్నారు. ప్రస్తుత నటులలో కొందరు వీడియో, చలన చిత్రాలలో అవకాశాలు పొందారు. విద్యావేత్త విశ్రాంత ప్రాచార్యులు డాక్టర్ సంగనభట్ల నరసయ్య, బహుముఖ ప్రజ్ఞాశాలి,  నటులు కొరిడె నరహరిశర్మ, కాకెర్ల దత్తాత్రేయ, ఎస్ రామకృష్ణయ్య, మునిగాల కిషన్ తదితరులు చారిత్రక నటులుగా మిగుల గుర్తింపు పొందారు 1993 లో తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ పేర్వారం జగన్నాథం ద్వారా నిధులు పొంది, స్వర్ణోత్సవాలు జరిపి, గయోపాఖ్యానం నాటకం ప్రదర్శించి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సినీ దర్శకులు దివంగత బి. ఎస్. నారాయణ చేత కళాకారులకు సన్మానాలు చేయించారు. సావనీర్ విడుదల చేశారు. 1955 లో ఈ సంస్థ కళాకారులకు ఆంధ్ర నాటక పరిషత్తు 1983 లో ఆంధ్ర ప్రదేశ్ నాటక అకాడమీ కాకర లక్ష్మీకాంత శాస్త్రికి, పెండ్యాల సీతారాములకు ఘనంగా సత్కారం చేశాయి. స్థానిక డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ డాక్టర్ నర్సయ్య నాటక రంగంలో చేసిన కృషికి గుర్తింపుగా గ్రామీణ కళా జ్యోతి అవార్డు లభించింది. నలుగురు వృద్ధ కళాకారులకు గత  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పథకాలను మంజూరు చేసింది. ఎనిమిదిన్నర దశాబ్దాలకు పైగా కళామతల్లికి సేవ చేస్తూ సాంప్రదాయక పద్య నాటకాలను బ్రతికిస్తున్న అపురూప అరుదైన నాట్యమండలి 2017 ఏప్రిల్ 2,3 తేదీలలో నాటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.వీ. రమణాచారి, నాటి ప్రభుత్వ చీఫ్ విప్, గత రాష్ట్ర సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ బీసీ కమిషన్ చైర్మన్ బీ. ఎస్.రాములు తదితర ప్రముఖులు హాజరు కాగా, 80 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించు కున్నారు. ప్రస్తుతం నరహరి శర్మ ఆధ్వర్యంలో, నర్సయ్య పర్యవేక్షణలో, దత్తాత్రి నిర్వహణలో, రామకిష్టయ్య, చంద్రమౌళి, వెంకట రమణ, కిశోర్, మహేందర్, సురేశ్, బాలకృష్ణ, శేఖర్, నర్సింహమూర్తి, జన్మంచి నరసయ్య, వంశీ కృష్ణ, నరహరి, అమర్, అనిల్, శ్రీనివాస్, రాంకిషన్ లకు తోడు కాకెరి అరుణ, సంగనభట్ల ప్రతిభ తదితరులు స్త్రీ పాత్రలను పోషిస్తూ, పౌరాణిక చారిత్రక నాటకాల ప్రదర్శనలను కొన సాగిస్తున్నారు.

Tags
Join WhatsApp

More News...

Crime  State News 

శిశువుతో మహిళా జర్నలిస్టుకు సీసీఎస్‌లో గంటల తరబడి విచారణ

శిశువుతో మహిళా జర్నలిస్టుకు సీసీఎస్‌లో గంటల తరబడి విచారణ హైదరాబాద్, అక్టోబర్‌ 8 (ప్రజా మంటలు): ఆరు నెలల పసికందును చేతుల్లో ఎత్తుకుని సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌)కు వెళ్లిన మహిళా జర్నలిస్టు జల్లి రేఖను దాదాపు ఏడు గంటలపాటు అక్కడే ఉంచి ప్రశ్నించారనే ఆరోపణలు హైదరాబాద్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె వెంట మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. మహిళా...
Read More...
Local News  Crime 

లక్ష్మీపూర్‌లో కోడి పందాలపై పోలీసుల దాడి

లక్ష్మీపూర్‌లో కోడి పందాలపై పోలీసుల దాడి గొల్లపల్లి అక్టోబర్ 08 (ప్రజా మంటలు): మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పరిధిలో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో గొల్లపల్లి పోలీసులు దాడి నిర్వహించారు. గొల్లపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ కృష్ణసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి పోలీసులు లక్ష్మీపూర్ గ్రామానికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు ఎనిమిది మంది వ్యక్తులు, మరికొందరు కలిసి...
Read More...
Local News 

విద్యుత్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి

విద్యుత్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి ఎల్కతుర్తి, అక్టోబర్ 8 (ప్రజా మంటలు): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి 33/11 కేవీ సబ్‌స్టేషన్లతో పాటు 132/32 కేవీ భీమదేవరపల్లి సబ్‌స్టేషన్‌ను టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న...
Read More...
Local News 

జగిత్యాల మెడికల్ కళాశాల భవనాలు ఎప్పుడు పూర్తి చేస్తారు?

జగిత్యాల మెడికల్ కళాశాల భవనాలు ఎప్పుడు పూర్తి చేస్తారు? జగిత్యాల, అక్టోబర్ 08 (ప్రజా మంటలు): విద్య, వైద్యం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులని, వాటిని అందించడం ప్రభుత్వ బాధ్యత అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని తెలంగాణ భవన్‌లో జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ దావా వసంత సురేష్, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన...
Read More...
Local News 

ఆర్టీసీ డిపో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, డిసిసి అధ్యక్షులు నందయ్య

ఆర్టీసీ డిపో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, డిసిసి అధ్యక్షులు నందయ్య జగిత్యాల అక్టోబర్ 8 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జగిత్యాల డిపో వద్ద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆర్ టి సి యూనియన్ ఎన్నికల్లో  ఐ ఎన్ టి యు సి ,ఎస్ డబ్ల్యూ యూ, టి డబ్ల్యూయూ,  ఎస్ డబ్ల్యూ  ఎఫ్   లకు మద్దతుగా బాణం గుర్తుకే ఓటు...
Read More...
Local News 

ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు :  బీజేపీ నేత ఖమ్మం వేంకటేశం

ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు :  బీజేపీ నేత ఖమ్మం వేంకటేశం కోహెడ, అక్టోబర్ 08 (ప్రజా మంటలు): ఆలయాల అభివృద్ధి కోసం భక్తులు, దాతలు సమకూర్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేసుకోవడం సరికాదని బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం అన్నారు. గురువారం కోహెడ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి...
Read More...
Local News 

రోల్లవాగు ప్రాజెక్టు పూర్తికి కృషి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్

రోల్లవాగు ప్రాజెక్టు పూర్తికి కృషి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీర్పూర్, అక్టోబర్ 8 (ప్రజా మంటలు): గోదావరి పుష్కరాల నేపథ్యంలో బీర్పూర్ మండలంలోని రంగసాగర్, మంగేలా, కమ్మనూరు, చిత్రవేణిగూడెం, రేకులపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పర్యటించి పుష్కర ఘాట్ల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మంగేలా ఆశ్రమ పాఠశాలలో...
Read More...
Crime 

రూ.12 వేల లంచం తీసుకుంటూ అటవీ అధికారి అరెస్ట్

రూ.12 వేల లంచం తీసుకుంటూ అటవీ అధికారి అరెస్ట్ ఖానాపూర్ అక్టోబర్‌ 08 (ప్రజా మంటలు): నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. టింబర్ డిపో పర్మిషన్ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.12 వేల లంచం తీసుకుంటుండగా ఫారెస్ట్ సెక్షన్ అధికారి రవీందర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులు తదుపరి విచారణ చేపట్టారు.
Read More...
Local News 

ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‘బ్లాక్ డే’

ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‘బ్లాక్ డే’ కరీంనగర్ అక్టొబర్ 08(ప్రజా మంటలు): AICC, TPCC పిలుపు మేరకు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ‘బ్లాక్ డే’ నిరసన చేపట్టారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీలపై జరిగిన లాఠీచార్జ్‌ను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో ఆందోళన నిర్వహించారు. కార్పొరేషన్...
Read More...
Local News 

రేకుల షెడ్డులోనే వైద్య తరగతులా?

రేకుల షెడ్డులోనే వైద్య తరగతులా? జగిత్యాల అక్టోబర్‌ 08 (ప్రజా మంటలు): ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు తమకు కనీస వసతులు కల్పించడంలేదని ఆరోపిస్తూ వరుసగా రెండో రోజు ఆందోళనకు దిగారు. కళాశాలలో మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ తరగతులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనలో ప్రధానంగా తరగతి గదులు, మౌలిక వసతుల కొరత...
Read More...
National  Entertainment  

బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత

బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత ముంబాయి అక్టోబర్‌ 08: ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గోవాలోని తన నివాసంలో ఆయన అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మణిపాల్ ఆసుపత్రి వైద్యుల ప్రకారం నానా పటేకర్ ...
Read More...
Local News 

రైతుల సంక్షేమానికి పీఏసీఎస్‌లు సమర్థవంతంగా పనిచేయాలి: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

రైతుల సంక్షేమానికి పీఏసీఎస్‌లు సమర్థవంతంగా పనిచేయాలి: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ రాయికల్, అక్టోబర్ 7 (ప్రజా మంటలు): రైతుల సంక్షేమం కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌) మరింత సమర్థవంతంగా పనిచేయాలని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ సూచించారు. రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామంలో నిర్వహించిన ఇటిక్యాల పీఏసీఎస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పీఏసీఎస్...
Read More...