రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు)
*ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు | గత మూడు నెలల ప్రమాదాలపై సమగ్ర విశ్లేషణ | అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా*
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులతో పాటు రాష్ట్ర, ఇతర రహదారులపై ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.
మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు, రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలు, జాతీయ రహదారులపై భద్రతా పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత మూడు నెలలుగా జరిగిన రోడ్డు ప్రమాదాలపై సమగ్ర విశ్లేషణ చేసి, ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి వచ్చే వారం నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసు, ఎన్హెచ్ఏఐ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ శాఖల అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాదానికి గల కారణాలను గుర్తించాలని సూచించారు. అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్, వేగ నియంత్రణ బోర్డులు, హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు భద్రత పనులకు అవసరమైన నిధుల అంచనాలు సిద్ధం చేయాలని తెలిపారు.
జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, రాత్రివేళల్లో వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా రిఫ్లెక్టివ్ సూచిక బోర్డులు, రోడ్ మార్కింగ్‌లు, చెవ్రాన్ మార్కర్లు, రోడ్ స్టడ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బ్లాక్ స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని, రోడ్ల వెంట ఆక్రమణలు తొలగించి అనధికార పార్కింగ్‌ను నియంత్రించాలని తెలిపారు.
జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం కారణంగానే అధిక శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల్లో ఎక్కువగా గాయపడుతున్నారని, హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలై ప్రాణనష్టం సంభవిస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు, అతివేగ నియంత్రణ చర్యలను మరింత విస్తృతం చేస్తున్నామని తెలిపారు.

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి నియంత్రించేందుకు ఏఐ ఆధారిత కెమెరాల ఏర్పాటు అవసరమని, పట్టణ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా ట్రాఫిక్‌ను నిరంతరం పర్యవేక్షిస్తూ నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై ఈ-చలాన్లు జారీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ విధులు నిర్వహించే పోలీసు సిబ్బందికి భద్రతా జాకెట్లు, బారికేడ్లు, హెల్మెట్లు తదితర రక్షణ పరికరాలు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు.
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత ప్రయాణం చేయాలని ఎస్పీ సూచించారు.
అనంతరం జాతీయ రహదారులపై ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు సకాలంలో వైద్య సేవలు అందించేందుకు ఎన్హెచ్ఏఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అంబులెన్స్ సేవలను జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రారంభించారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి విలువైన ప్రాణాలను కాపాడేలా అత్యవసర స్పందన వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. జాతీయ రహదారులపై అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎన్హెచ్ఏఐ టోల్ ఫ్రీ నంబర్ **1033**కు సమాచారం అందించాలని అధికారులు తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎన్. ప్రసునాంభా, ఎన్హెచ్ఏఐ అధికారులు, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పోలీసు, రవాణా, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి – జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు)*ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు | గత మూడు నెలల ప్రమాదాలపై సమగ్ర విశ్లేషణ | అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్‌పై ప్రత్యేక నిఘా*
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని... హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణలో జగిత్యాల జిల్లాకు ఐదు ప్రశంసా అవార్డులు – వైద్య ఆరోగ్య శాఖ అధికారులను అభినందించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల, నవంబర్ 03(ప్రజా మంటలు )
హెచ్ఐవీ/ఎయిడ్స్ నియంత్రణ, బాధితులకు నిరంతర వైద్య సేవలు, ఏ ఆర్ టి చికిత్స అందించడం, వైరల్ లోడ్ నియంత్రణలో జగిత్యాల జిల్లా ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ , తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాకు ఐదు ప్రశంసా అవార్డులు లభించాయి.... "జాతీయవాదుల సంగమం" కు తరలివెళ్లిన జగిత్యాల పూర్వ ఏబీవీపీ నాయకులు.
జగిత్యాల నవంబర్ 3 (ప్రజా మంటలు)
హైదరాబాదులో నిర్వహించనున్న జాతీయవాదుల సంగమం కార్యక్రమానికి జగిత్యాల పట్టణంలోని ఏబీవీపీ పూర్వ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ తరలి వెళ్లారు.
ఏబీవీపీ పూర్వ జాతీయ కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఇటీవల కర్ణాటక రాష్ట్ర కో ఇన్చార్జిగా నియామకం అయిన సందర్భాన్ని పురస్కరించుకొని హైదరాబాదులో ఏర్పాటు చేసిన ఏబివీపీ పూర్వ కార్యకర్తలు,... పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం - 37 ఏళ్ల తర్వాత ఒకచోట చేరిన చిన్ననాటి మిత్రులు
భీమదేవరపల్లి నవంబర్ 01 (ప్రజా మంటలు):
మండలంలోని ముల్కనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1988–89 పదో తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం స్థానిక ఎస్ఆర్కె పాఠశాలలో ఘనంగా జరిగింది. సుమారు 37 ఏళ్ల తర్వాత తాము చదువుకున్న బడి ఆవరణలో కలుసుకున్న చిన్ననాటి మిత్రులు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన స్నేహితులంతా... మంత్రి వాకిటి శ్రీహరికి ముదిరాజ్ మహాసభ జన్మదిన శుభాకాంక్షలు
సికింద్రాబాద్, నవంబర్ 01 (ప్రజా మంటలు):
రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ముదిరాజ్‌కు ముదిరాజ్ మహాసభ కమ్యూనిటీ నేతలు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 53 వసంతాలు పూర్తి చేసుకుని 54వ పడిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా పాలమూరు కొదమసింహం, ముదిరాజ్ ముద్దుబిడ్డ అయిన ఆయన నిండు నూరేళ్లు... ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్
జగిత్యాల, నవంబర్ 01 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహిస్తున్న ఓట్ బచావో – దేశ్ బచావో కార్యక్రమంలో పాల్గొనేందుకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజంగి నందయ్య జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు.
దేశ ప్రజాస్వామ్య... స్తంభంపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో నిలిచిపోయిన షేడ్ నిర్మాణ పనులు..
వెల్గటూర్ నవంబర్ 1 (ప్రజా మంటలు):
వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామం లో స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కీ వచ్చే భక్తులకీ ఉపయోగపడే షేడ్ నిర్మాణ పనులు ప్రారంభ దశలో నిలిచిపోవడం జరిగింది.. ఈ షేడ్ నిర్మాణం పూర్తి అయితే భక్తులకీ చాలా ఉపయోగపడుతుంది.. స్వామి దర్శనం కీ నిద్ర కీ... నాయి బ్రాహ్మణ జనశక్తి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సంజీవ్ నియామకం
గొల్లపల్లి అక్టోబర్ 29 ప్రజా మంటలు
నాయి బ్రాహ్మణ జనశక్తి సేవా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెంగలాపూర్ గ్రామానికి చెందిన రాసమల్ల సంజీవ్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర అధ్యక్షులు పసుపుకుంట్ల వికాస్ నాయీ, కార్యనిర్వాహక అధ్యక్షుడు సికినమెట్ల శివప్రసాద్,ప్రధాన కార్యదర్శి సురేంపల్లి గణేష్ లు సంజీవ్‌కు... భీమ్ రాజు పల్లి లో భూముల రీ-సర్వే ముమ్మరం
గొల్లపల్లి అక్టోబర్ 29 (ప్రజా మంటలు):
మండలంలోని భీమ్రాజు పల్లిలో భూ సమస్యల శాశ్వత పరిష్కారం, కచ్చితమైన హద్దుల గుర్తింపే లక్ష్యంగా చేపట్టిన భూముల రీ-సర్వే ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రెవెన్యూ, సర్వే అధికారులు క్షేత్రస్థాయిలో కొలతలు చేపడుతున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొలగని శ్రీలత గంగచారి, ఉప సర్పంచ్... పత్తిపాక యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు అభినందనీయం:
గొల్లపల్లి అక్టోబర్ 29 ప్రజా మంటలు
పత్తిపాక గ్రామంలోని యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు మరియు ట్రైనింగ్ యూత్ ఆఫీసర్ శిక్షణా పరిశీలనలో భాగంగా వివిధ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్లు (డీయోస్ ) సందర్శించారు.ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ గోలి తిరుపతి... పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదులో పాల్గొన్న మర్రి పురురవరెడ్డి
సికింద్రాబాద్, అక్టోబర్ 28 (ప్రజా మంటలు):
బల్కంపేట 60 ఫీట్ రోడ్డు పరిధిలో బుధవారం ఉదయం నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర యువ నాయకుడు మర్రి పురురవరెడ్డి స్థానిక పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్నారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు... ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అక్టోబర్ 27(ప్రజా మంటలు) వెలమ సంక్షేమ మండలి జగిత్యాల ఆధ్వర్యంలో, సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జగిత్యాల పద్మనాయక ఫంక్షన్ హాల్ లో ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్య పరిరక్షణ... 