రాయికల్‌లో లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే సంజయ్

రూ.30 లక్షలతో నాలుగు డీటీఆర్‌ల ఏర్పాటు

On
రాయికల్‌లో లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే సంజయ్

రాయికల్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):

రాయికల్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.30 లక్షల వ్యయంతో నాలుగు డీటీఆర్‌లు ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా అర్హత కలిగిన కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. రాయికల్ మండలంలో ఈ పథకం అమలుకు సుమారు రూ.11.70 కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ల కోసం డీడీ చెల్లించిన వారికి విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. విద్యుత్ డిమాండ్ పెరిగినప్పటికీ వినియోగదారులకు నిరంతర సరఫరా అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. రైతులకు ఉచిత విద్యుత్‌తో పాటు రుణమాఫీ, రైతుభరోసా వంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా వారికి ఆర్థిక ప్రయోజనం కలుగుతోందన్నారు. రాయికల్ పట్టణ, మండల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. మైతాపూర్–రామాజీపేట బ్రిడ్జి పనులు పూర్తయ్యాయని, మిగిలిన అప్రోచ్ రోడ్డు పనులను కూడా పూర్తి చేస్తామని తెలిపారు.

బోర్నపల్లి–రేచపల్లి–తాట్లవాయి ప్రాంతాలకు సంబంధించిన ఫారెస్ట్ క్లియరెన్స్ విషయంలో గత పాలకులపై ఎమ్మెల్యే ప్రశ్నలు సంధించారు. గతంలో మంజూరైన అభివృద్ధి పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

ఎవరు ఎన్ని విమర్శలు చేసినా రాయికల్ పట్టణ, మండల అభివృద్ధి ఆగదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ రాయికల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాజకీయాలు ఎన్నికల వరకే పరిమితమని, అభివృద్ధి నిరంతర ప్రక్రియ అని అన్నారు.

కార్యక్రమంలో కౌన్సిలర్లు, సర్పంచులు, రాయికల్ పట్టణ, మండల నాయకులు, విద్యుత్ శాఖ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా అమన్ జిత్ సింగ్ కరీంనగర్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు): కరీంనగర్ పట్టణంలోని సిక్కు వాడకు చెందిన కాంగ్రెస్ నాయకుడు అమన్ జిత్ సింగ్ను జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. చొప్పదండి ఎమ్మెల్యే, DCC అధ్యక్షుడు డాక్టర్ మేడిపల్లి సత్యం రేకుర్తి క్యాంపు కార్యాలయంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్...
Read More...
State News 

రేపే కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచజన్య శంఖారావం

రేపే  కొడంగల్ గడ్డపై కల్వకుంట్ల కవిత పాంచజన్య శంఖారావం కొడంగల్–కోస్గి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు):: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి కాలేజీ గ్రౌండ్‌లో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. సభకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. 120 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పుతో సభా వేదికను ఏర్పాటు చేయగా, సుమారు...
Read More...
Local News 

మున్సిపల్ లో గణనాథునుకి ఉత్తర పూజలు 

మున్సిపల్ లో గణనాథునుకి ఉత్తర పూజలు  జగిత్యాల, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు): వినాయక నవరాత్రుల సందర్భంగా జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణనాథునికి మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్య ప్రణవ్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్తర పూజలు చేసి అన్నదానం నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర చేపట్టారు....
Read More...
Local News 

సింహాచలం జగన్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు

సింహాచలం జగన్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నేతలు ఎండపెల్లి సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ఎండపెల్లి మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు సింహాచలం జగన్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందారు. ఈ నేపథ్యంలో శనివారం ఆయన కుటుంబ సభ్యులను జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత...
Read More...
Local News 

రాయికల్‌లో లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే సంజయ్

రాయికల్‌లో లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే సంజయ్ రాయికల్, సెప్టెంబర్ 19 (ప్రజా మంటలు): రాయికల్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న లో-వోల్టేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.30 లక్షల వ్యయంతో నాలుగు డీటీఆర్‌లు ఏర్పాటు చేసినట్లు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి పలు కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. గృహజ్యోతి పథకం...
Read More...
State News 

రాయికల్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ

రాయికల్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ రాయికల్, సెప్టెంబర్ 18 (ప్రజా మంటలు): రాయికల్ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వీరనాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని వేముల ప్రభాకర్ బహుకరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా...
Read More...
Local News 

శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు

శ్రీ గౌరీ ప్రియ నగర వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద కొనసాగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు    కీసర సెప్టెంబర్ 17 ( ప్రజా మంటలు)కుందన్ పల్లి లోని శ్రీ గౌరీ ప్రియ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ గణేష్ మండపం వద్ద నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతినిత్యం కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా గణేష్ హోమము మాతలచే సామూహిక కుంకుమార్చనలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు...
Read More...
Local News 

రెడ్ బుల్స్ వినాయక మండపం వద్ద మాజీ చైర్పర్సన్  పూజలు

రెడ్ బుల్స్ వినాయక మండపం వద్ద మాజీ చైర్పర్సన్  పూజలు   జగిత్యాల సెప్టెంబర్ 17(ప్రజా మంటలు) జగిత్యాల బ్రాహ్మణ వీధిలోని రెడ్ బుల్స్ గణేశ మండపం వద్ద గురువారం సాయంత్రం మున్సిపల్ మాజీ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి దంపతులు సందర్శించి వినాయకునికి పూజలు చేశారు. రుద్రాంగి గోపాలకృష్ణ తీర్థప్రసాద్ అందజేసి స్వామి వారి శేష వస్తుందో సత్కరించి ఆశీర్వచనం చేశారు.
Read More...
Local News 

జగిత్యాలలో  అయోమయంలో "గణేశ నిమజ్జనోత్సవ తేదీలు

జగిత్యాలలో  అయోమయంలో     " జగిత్యాల సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు) గణేష్ నవరాత్రి ఉత్సవాల నిమజ్జోత్సవ వేడుకలపై జగిత్యాల జిల్లా కేంద్రంలో అయోమయం నెలకొంది. 9 రాత్రులు ముగిసిన తర్వాత వారంతో సంబంధం లేకుండా నిమజ్జనం చేయడం ఒక ఆచారంగా వస్తుంది. అదేవిధంగా అనంత చతుర్దశి నాడు నిమజ్జనం చేయడం కూడా ఓ ఆచారం కొనసాగుతుంది. విశ్వహిందూ పరిషత్తు...
Read More...
Local News 

రెడ్ బుల్స్ గణేష మంటపం వద్ద  లలితా సహస్రనామ పారాయణం

రెడ్ బుల్స్ గణేష మంటపం వద్ద  లలితా సహస్రనామ పారాయణం జగిత్యాల సెప్టెంబర్ 15 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి లో గల రెడ్ బుల్స్ గణేష్ మండపం వద్ద మంగళవారం రాత్రి హనుమాన్ చాలీసా భక్తబృందం వారిచే లలితా సహస్రనామం పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. కార్యక్రమం అనంతరం తీర్థప్రసాద వితరణ చేశారు.
Read More...
Local News 

భార్యను చున్నీతో బిగించి హత్య చేసిన భర్త

భార్యను చున్నీతో బిగించి హత్య చేసిన భర్త కోరుట్ల, సెప్టెంబర్ 16 (ప్రజా మంటలు): కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త చున్నీతో మెడకు బిగించి హత్య చేసిన ఘటన కోరుట్ల పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని ప్రకాశం రోడ్డులో నివాసముంటున్న అన్నం నరేష్, లక్ష్మి దంపతుల మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. నరేష్...
Read More...
Local News  Entertainment  

కూచిపూడి నాట్యపోటీల్లో నిత్యాశ్రీకి ద్వితీయ బహుమతి

కూచిపూడి నాట్యపోటీల్లో నిత్యాశ్రీకి ద్వితీయ బహుమతి జగిత్యాల, సెప్టెంబర్ 13(ప్రజా మంటలు): శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ, హైదరాబాద్ ఆధ్వర్యంలో కరీంనగర్ కళాభారతిలో నిర్వహించిన జిల్లా స్థాయి కూచిపూడి నాట్యపోటీలలో జగిత్యాల నాట్యగురువు శ్రీమతి గుండి యమునకు చెందిన శ్రీ శారదా సిద్ధిరామ నాట్యాలయం విద్యార్థిని చిన్నారి మహాదేవుని నిత్యాశ్రీ ద్వితీయ బహుమతి సాధించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ...
Read More...