సిరిసిల్ల సభ విజయాన్ని జీర్ణించుకోలేకే బీఆర్ఎస్ నేతల అక్కసు
కేటీఆర్‌కు మూడు హోటళ్లు ఎక్కడివి? సమాధానం చెప్పాలి: కొరివి అరుణ్ కుమార్
కరీంనగర్, అక్టోబర్ 2 (ప్రజా మంటలు):
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిరిసిల్ల పర్యటన, బహిరంగ సభ విజయవంతం కావడాన్ని జీర్ణించుకోలేకే బీఆర్ఎస్ నాయకులు అక్కసుతో మాట్లాడుతున్నారని జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరుణ్ కుమార్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అలువాల కోటి విమర్శించారు.
కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. సిరిసిల్ల సభ అనంతరం బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ హైదరాబాద్‌లో తమ కుటుంబానికి ఇల్లు లేదని గతంలో చెప్పారని, అయితే హైదరాబాద్‌లో మూడు హోటళ్లు ఉన్నాయంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సోనియా గాంధీ ధనిక రాష్ట్రంగా అప్పగించిన తెలంగాణను అప్పులపాలు చేసి, కేసీఆర్ కుటుంబం మాత్రం భారీగా ఆస్తులు కూడబెట్టిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తమ అఫిడవిట్లలోనే వందల ఎకరాల భూములు ఉన్నట్లు వెల్లడించారని, దీనిపై బీఆర్ఎస్ నేతలు ప్రజలకు సమాధానం చెప్పాలని కోరారు.
సిరిసిల్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని సీఎం ప్రకటించడంతో బీఆర్ఎస్ నాయకుల్లో ఆందోళన మొదలైందని అలువాల కోటి అన్నారు. సభకు ప్రజలు రాలేదని, పోలీసుల ద్వారా జనాన్ని తరలించారని చేస్తున్న విమర్శలు అవాస్తవమని, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేశారని పేర్కొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కొరివి అరుణ్ కుమార్ అన్నారు. దళిత స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం దళిత సమాజాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు పసుపు నీళ్లు చల్లుతామంటూ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తప్పుబట్టారు. దళితుల సమస్యలపై గతంలో అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేసిన రసమయి ఇప్పుడు దళితులను అవమానించేలా మాట్లాడటం సరికాదన్నారు.
నేరెళ్ల ఘటనను ప్రస్తావిస్తూ, అప్పటి ప్రభుత్వ హయాంలో దళితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. సీఎం, స్పీకర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ శ్రేణులు, దళిత సమాజం చూస్తూ ఊరుకోబోదని వారు హెచ్చరించారు.
సమావేశంలో ఎస్సీ సెల్ రాష్ట్ర వైస్ చైర్మన్ ముల్కల మల్లేశం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సముద్రాల లక్ష్మణ్, రాష్ట్ర కార్యదర్శులు ఆరేపల్లి రాహుల్, శ్రావణ్, జిల్లా వైస్ చైర్మన్లు దుబ్బాసి కుమార్, గొట్టే బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు మీసాల సాయిలు, అరుణ్, కనకం అశోక్, మహిళా నాయకులు ముల్కల కవిత, హస్తపురం తిరుమల, కొండ్ర స్వరూప, కనకం సంధ్య, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు జెరిపోతుల వాసు, గోనె పవన్ కళ్యాణ్, కవ్వంపల్లి రాజేంద్రప్రసాద్, ముల్కల యోనా తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాల మున్సిపాలిటీలో మొక్కల కొనుగోళ్లు, బయోమైనింగ్‌పై విచారణ జరపాలి - హనుమండ్ల జయశ్రే
జగిత్యాల, అక్టోబర్ 10 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపాలిటీలో వనమహోత్సవం పేరుతో మొక్కల కొనుగోళ్లు, వాటి నిర్వహణ ఖర్చులు, బయోమైనింగ్ పనుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ డిమాండ్ చేశారు. ఈ మేరకు అక్టోబర్ 10న తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు... శిశువుతో మహిళా జర్నలిస్టుకు సీసీఎస్‌లో గంటల తరబడి విచారణ
హైదరాబాద్, అక్టోబర్ 8 (ప్రజా మంటలు):
ఆరు నెలల పసికందును చేతుల్లో ఎత్తుకుని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)కు వెళ్లిన మహిళా జర్నలిస్టు జల్లి రేఖను దాదాపు ఏడు గంటలపాటు అక్కడే ఉంచి ప్రశ్నించారనే ఆరోపణలు హైదరాబాద్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె వెంట మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. మహిళా... లక్ష్మీపూర్‌లో కోడి పందాలపై పోలీసుల దాడి
గొల్లపల్లి అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పరిధిలో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో గొల్లపల్లి పోలీసులు దాడి నిర్వహించారు.
గొల్లపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ కృష్ణసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి పోలీసులు లక్ష్మీపూర్ గ్రామానికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు ఎనిమిది మంది వ్యక్తులు, మరికొందరు కలిసి... విద్యుత్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి
ఎల్కతుర్తి, అక్టోబర్ 8 (ప్రజా మంటలు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి 33/11 కేవీ సబ్‌స్టేషన్లతో పాటు 132/32 కేవీ భీమదేవరపల్లి సబ్‌స్టేషన్‌ను టీజీ ఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న... జగిత్యాల మెడికల్ కళాశాల భవనాలు ఎప్పుడు పూర్తి చేస్తారు?
జగిత్యాల, అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
విద్య, వైద్యం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులని, వాటిని అందించడం ప్రభుత్వ బాధ్యత అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని తెలంగాణ భవన్‌లో జిల్లా పరిషత్ తొలి చైర్‌పర్సన్ దావా వసంత సురేష్, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన... ఆర్టీసీ డిపో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, డిసిసి అధ్యక్షులు నందయ్య
జగిత్యాల అక్టోబర్ 8 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జగిత్యాల డిపో వద్ద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆర్ టి సి యూనియన్ ఎన్నికల్లో ఐ ఎన్ టి యు సి ,ఎస్ డబ్ల్యూ యూ, టి డబ్ల్యూయూ, ఎస్ డబ్ల్యూ ఎఫ్ లకు మద్దతుగా బాణం గుర్తుకే ఓటు... ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు : బీజేపీ నేత ఖమ్మం వేంకటేశం
కోహెడ, అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
ఆలయాల అభివృద్ధి కోసం భక్తులు, దాతలు సమకూర్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేసుకోవడం సరికాదని బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం అన్నారు. గురువారం కోహెడ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి... రోల్లవాగు ప్రాజెక్టు పూర్తికి కృషి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
బీర్పూర్, అక్టోబర్ 8 (ప్రజా మంటలు):
గోదావరి పుష్కరాల నేపథ్యంలో బీర్పూర్ మండలంలోని రంగసాగర్, మంగేలా, కమ్మనూరు, చిత్రవేణిగూడెం, రేకులపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పర్యటించి పుష్కర ఘాట్ల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
మంగేలా ఆశ్రమ పాఠశాలలో... రూ.12 వేల లంచం తీసుకుంటూ అటవీ అధికారి అరెస్ట్
ఖానాపూర్ అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. టింబర్ డిపో పర్మిషన్ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.12 వేల లంచం తీసుకుంటుండగా ఫారెస్ట్ సెక్షన్ అధికారి రవీందర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులు తదుపరి విచారణ చేపట్టారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ‘బ్లాక్ డే’
కరీంనగర్ అక్టొబర్ 08(ప్రజా మంటలు):
AICC, TPCC పిలుపు మేరకు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ‘బ్లాక్ డే’ నిరసన చేపట్టారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీలపై జరిగిన లాఠీచార్జ్‌ను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో ఆందోళన నిర్వహించారు.
కార్పొరేషన్... రేకుల షెడ్డులోనే వైద్య తరగతులా?
జగిత్యాల అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు తమకు కనీస వసతులు కల్పించడంలేదని ఆరోపిస్తూ వరుసగా రెండో రోజు ఆందోళనకు దిగారు. కళాశాలలో మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ తరగతులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఆందోళనలో ప్రధానంగా తరగతి గదులు, మౌలిక వసతుల కొరత... బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కన్నుమూత
ముంబాయి అక్టోబర్ 08:
ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శకుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గురువారం తెల్లవారుజామున గోవాలోని తన నివాసంలో ఆయన అకస్మాత్తుగా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మణిపాల్ ఆసుపత్రి వైద్యుల ప్రకారం నానా పటేకర్ ... 