గిన్నిస్ రికార్డు లక్ష్యంగా వచ్చే ఏడాది బతుకమ్మ వేడుకలు :కల్వకుంట్ల కవిత

రెండున్నర లక్షల మందితో బతుకమ్మ: మాధవి

On
గిన్నిస్ రికార్డు లక్ష్యంగా వచ్చే ఏడాది బతుకమ్మ వేడుకలు :కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, సెప్టెంబర్ 27:

వచ్చే ఏడాది రెండున్నర లక్షల మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ జాగృతి పనిచేస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు.

ఆదివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో తెలంగాణ జాగృతి బతుకమ్మ సంబురాల పోస్టర్‌తో పాటు జాగృతి రూపొందించిన బతుకమ్మ పాటల సీడీని కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం బతుకమ్మ వేడుకలను గిన్నిస్ రికార్డు స్థాయిలో నిర్వహించేందుకు గతంలో ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి సఫలం కాలేదన్నారు.

ఈ ఏడాది తెలంగాణలోని 33 జిల్లాలతో పాటు విదేశాల్లోనూ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించేందుకు గ్రామ గ్రామాన బతుకమ్మ, కోలాటం కమిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. బుర్జ్ ఖలీఫా సహా ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ వైభవాన్ని చాటిన జాగృతి, గిన్నిస్ రికార్డు లక్ష్యాన్ని కూడా విజయవంతం చేస్తుందని కవిత పేర్కొన్నారు.

చప్పట్ల పాటలు, సంప్రదాయ బతుకమ్మ పాటలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా పాటల సీడీని రూపొందించినట్లు తెలిపారు. ఈ ఏడాది జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆమె కోరారు.

రెండున్నర లక్షల మందితో బతుకమ్మ: మాధవి

వచ్చే ఏడాది రెండున్నర లక్షల మందితో బతుకమ్మ వేడుకలు నిర్వహించి గిన్నిస్ రికార్డు సాధించేందుకు కృషి చేస్తామని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు మారిపెల్లి మాధవి తెలిపారు. ఈ ఏడాది అన్ని జిల్లాల్లో జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే చప్పట్ల, సంప్రదాయ బతుకమ్మ పాటలను యూట్యూబ్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆమె తెలిపారు.

సాంస్కృతిక వికాసం, మహిళా సాధికారతే లక్ష్యం

తెలంగాణ ఉద్యమ కాలం నుంచి సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన తెలంగాణ జాగృతిని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కవిత నిర్ణయించారు. సాంస్కృతిక వికాసంతో పాటు మహిళా సాధికారత, సామాజిక అసమానతల నిర్మూలన కోసం సంస్థ పనిచేస్తుందని తెలిపారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీతో పాటు పలు జిల్లాలు, వివిధ దేశాలకు అధ్యక్షులను నియమించారు. మిగిలిన జిల్లాల కమిటీలను త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపారు.

తెలంగాణ జాగృతి రాష్ట్ర కమిటీ:
అధ్యక్షురాలు – మారిపెల్లి మాధవి
ఉపాధ్యక్షులు – జాడి శ్రీనివాస్, పర్శ చంద్రశేఖర్
ప్రధాన కార్యదర్శి – గుంటి సుందర్
కార్యదర్శులు – కన్నం శారద, దొండి స్వర్ణలత, మస్తాన్
మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు – మానుకోట సునీత

జిల్లాల అధ్యక్షులు:
జగిత్యాల – పట్టూరి తిరుపతి; రంగారెడ్డి – ఎండీ మొయినుద్దీన్; వరంగల్ – పాలదర్శి రమేశ్; హన్మకొండ – నెట్టి రజిత; మహబూబ్‌నగర్ – అరుపుల నర్సింలు; సూర్యాపేట – లక్కపాక ప్రవీణ్; భూపాలపల్లి – గుమ్మడి రవీందర్; నిజామాబాద్ – అవంతి కుమార్; పెద్దపల్లి – మేడారపు రాజ్యలక్ష్మీ; కరీంనగర్ – గుండు మంజుల; కామారెడ్డి – రెడ్డిపేట సతీశ్ కుమార్.

మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా వేణుగోపాల్ యాదవ్‌ను నియమించారు.

విదేశీ శాఖల అధ్యక్షులు:
న్యూజిలాండ్ – ముద్దం అరుణ జ్యోతి; ఖతార్ – ప్రవీణ లక్ష్మీ; అమెరికా – రాజ్ గోవిల్కర్; ఒమన్ – గుండు రాజేందర్ నేత; కెనడా – కుందె రాఘవేంద్ర యాదవ్; ఐర్లాండ్ – సంతోష్ పల్లె; స్విట్జర్లాండ్ – కిశోర్ తాటికొండ; ఇటలీ – సౌమ్య పిన్నంరెడ్డి; నార్వే – కిరణ్ తేజ సూధటి; జింబాబ్వే – శ్రావణ్ కుమార్ గౌడ్; కెన్యా – గంట్ల స్వప్నా రెడ్డి. ఖతార్ ప్రధాన కార్యదర్శిగా ఆదర్శ రెడ్డి పోతుల, నార్వే ప్రధాన కార్యదర్శిగా నిఖిత బిల్లకంటిని నియమించారు.

బతుకమ్మ చప్పట్ల పాటలను తెలంగాణ జాగృతి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

Join WhatsApp

More News...

Social  State News 

ప్రపంచ పర్యాటక పటంలో తెలంగాణ పర్యాటక ప్రాంతాలు

ప్రపంచ పర్యాటక పటంలో తెలంగాణ పర్యాటక ప్రాంతాలు హైదరాబాద్, సెప్టెంబర్ 27: ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు, దేశ విదేశాల నుంచి రాష్ట్రాన్ని సందర్శిస్తున్న పర్యాటకులకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని సహజ, సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక సంపదను ప్రపంచ పర్యాటక పటంలో మరింత ఉన్నత స్థానంలో నిలపడం ప్రజా ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు. చారిత్రక కట్టడాలు,...
Read More...
State News 

గిన్నిస్ రికార్డు లక్ష్యంగా వచ్చే ఏడాది బతుకమ్మ వేడుకలు :కల్వకుంట్ల కవిత

గిన్నిస్ రికార్డు లక్ష్యంగా వచ్చే ఏడాది బతుకమ్మ వేడుకలు :కల్వకుంట్ల కవిత హైదరాబాద్, సెప్టెంబర్ 27: వచ్చే ఏడాది రెండున్నర లక్షల మంది మహిళలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడమే లక్ష్యంగా తెలంగాణ జాగృతి పనిచేస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో తెలంగాణ జాగృతి బతుకమ్మ సంబురాల పోస్టర్‌తో...
Read More...
Local News  State News 

రేపటి నుంచి తెలంగాణ రక్షణ సేన జిల్లాల వారిగా విస్తృత స్థాయి సమావేశాలు

రేపటి నుంచి తెలంగాణ రక్షణ సేన జిల్లాల వారిగా విస్తృత స్థాయి సమావేశాలు హైదరాబాద్ సెప్టెంబర్‌26:   తెలంగాణ రక్షణ సేన పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు రేపటి నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు జరగనున్నాయి. రోజుకు రెండు ఉమ్మడి జిల్లాల చొప్పున ఎనిమిది ఉమ్మడి జిల్లాల ముఖ్య నాయకులతో పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమావేశమై దిశానిర్దేశం చేయనున్నారు. ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల నాయకులతో...
Read More...
Local News  Crime 

రూ.63 వేల లంచం తీసుకుంటూ మెట్పల్లి సీడీపీవో అరెస్ట్

రూ.63 వేల లంచం తీసుకుంటూ మెట్పల్లి సీడీపీవో అరెస్ట్ మెటుపల్లి, సెప్టెంబర్ 26 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా మెటుపల్లి సీడీపీవో దరోజు పద్మను కరీంనగర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెటుపల్లి పట్టణ సెక్టార్ పరిధిలోని 21 అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీల్లో ప్రతికూల వ్యాఖ్యలు నమోదు చేయకుండా అనుకూలంగా వ్యవహరించేందుకు ఒక్కో కేంద్రం నుంచి నెలకు రూ.1,000...
Read More...
Local News 

సమిష్టి కృషితో జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన  గణేష్ నిమజ్జనం: జిల్లా ఎస్పి అశోక్ కుమార్ 

సమిష్టి కృషితో జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన  గణేష్ నిమజ్జనం: జిల్లా ఎస్పి అశోక్ కుమార్  జగిత్యాల సెప్టెంబర్ 26 (ప్రజా మంటలు)  క్షేత్ర స్థాయిలో కష్టపడి విధులు నిర్వర్తించిన అదికారులు, సిబ్బందిని అభినందించిన ఎస్పీ    ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు జిల్లాలో ప్రశాంతంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమిష్టి కృషితో నిమజ్జనాన్ని ప్రక్రియ పూర్తి చేయడం జరిగింది అని జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్...
Read More...
Local News 

అవనిలో సగం అతివలు నారీ శక్తి వందనం 

అవనిలో సగం అతివలు నారీ శక్తి వందనం  జగిత్యాల సెప్టెంబర్ 26 (ప్రజా మంటలు)జగిత్యాల గణేష నిమజ్జనోత్సవం సందర్భంగా గణేష మంటపాల ముందు మహిళ డప్పు    కళాకారులు పురుష కళాకారులతో సమానంగా  డప్పులు వాయిస్తూ టవర్ సర్కిల్ వద్ద భక్తులను అలరించారు. గణేష మంటపాలను చూసే భక్తులు ఒక్కసారిగా డప్పుల వైపు వెళ్లి వారి డప్పు నృత్యాలతో అలరించారు.
Read More...
Local News  State News 

సీనియర్ జర్నలిస్ట్ గాజుల నాగరాజుకు ఆర్థిక సాయం చేయండి

సీనియర్ జర్నలిస్ట్ గాజుల నాగరాజుకు ఆర్థిక సాయం చేయండి జగిత్యాల, సెప్టెంబర్ 26 (ప్రజా మంటలు):సీనియర్ జర్నలిస్ట్ గాజుల నాగరాజు గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన జగిత్యాలలో చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీకి తరలించారు.నాగరాజు ఉమ్మడి కరీంనగర్...
Read More...

చిన్నారుల సమగ్ర అభివృద్ధికి ఆట ఆధారిత విద్య : డి డబ్ల్యు ఓ భాస్కర్

చిన్నారుల సమగ్ర అభివృద్ధికి ఆట ఆధారిత విద్య : డి డబ్ల్యు ఓ భాస్కర్ జగిత్యాల సెప్టెంబర్ 26 (ప్రజా మంటలు): మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసున్న చిన్నారుల సమగ్ర అభివృద్ధికి ఆటలు, పాటలు, కథలు, చిత్రలేఖనం వంటి ఆట ఆధారిత అభ్యాసం ఎంతో దోహదపడుతుందని జిల్లా సంక్షేమ అధికారి భాస్కర్ అన్నారు. పోషణ మాసంలో భాగంగా జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ప్రారంభ బాల్య సంరక్షణ మరియు...
Read More...
Local News 

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి ఎమ్మెల్యే సంజయ్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలి ఎమ్మెల్యే సంజయ్    రెండో విడతలో జగిత్యాల నియోజకవర్గానికి 2,000 ఇళ్లు మంజూరు జగిత్యాల సెప్టెంబర్, 26 (ప్రజా మంటలు): ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడతలో జగిత్యాల నియోజకవర్గానికి 2,000 ఇళ్లు మంజూరైన నేపథ్యంలో అర్హులైన లబ్ధిదారుల ఎంపికను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్...
Read More...
Local News 

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో భూమి హక్కుల కోసం పోరాటం

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో భూమి హక్కుల కోసం పోరాటం జగిత్యాల సెప్టెంబర్26 (ప్రజా మంటలు): బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ అని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జగిత్యాల రూరల్ మండలం మొరపల్లి గ్రామంలోని ఆమె విగ్రహానికి రజక సంఘ నాయకులు, మహిళలు, గ్రామస్తులు, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పూలమాల వేసి...
Read More...
State News 

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లి పోటీ చేస్తాం -   కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు

ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లి పోటీ చేస్తాం -   కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ సెప్టెంబర్‌ 26 (ప్రజా మంటలు) : ఖైరతాబాద్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ పోటీ చేస్తుందని ఆమె ప్రకటించారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీ తరఫున పోటీ చేయడంపై చట్టపరమైన, రాజ్యాంగపరమైన చర్చ అవసరమని అన్నారు ఆదిలాబాద్ రిమ్స్‌లో చిన్నారుల మరణాల ఘటనపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన...
Read More...
State News 

ఆదిలాబాద్‌లో శిశువులు, గర్భిణుల మరణాలపై తెలంగాణ రక్షణ సేన అధ్యయన కమిటీ

ఆదిలాబాద్‌లో శిశువులు, గర్భిణుల మరణాలపై తెలంగాణ రక్షణ సేన అధ్యయన కమిటీ ఆదిలాబాద్ సెప్టెంబర్ 25 (ప్రజా మంటలు): ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీలో పసి పిల్లలు, గర్భిణుల మరణాలు, వైద్య సేవల పరిస్థితిపై సమగ్ర అధ్యయనం చేసేందుకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఏడుగురు సభ్యులతో అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ జిల్లాలో పర్యటించి క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, నవజాత...
Read More...