సింగరేణి ప్రాంత వనరులు, ప్రజలను దోచుకుంటున్న కాంగ్రెస్ నేతలు: కవిత 

On
సింగరేణి ప్రాంత వనరులు, ప్రజలను దోచుకుంటున్న కాంగ్రెస్ నేతలు: కవిత 

ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా తెలంగాణ రక్షణ సేన ఎదుగుతుంది - కల్వకుంట్ల కవిత 

పెద్దపల్లి, జూన్ 19 (ప్రజా మంటలు):


తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. సింగరేణి ప్రాంత ప్రజలు, కార్మికులు, రైతుల సమస్యలను పక్కనబెట్టి ఇసుక, మట్టి, బూడిద దందాల్లో నిమగ్నమయ్యారని ఆరోపించారు. ఈ ముగ్గురు "బందిపోటు దొంగల్లా వ్యవహరిస్తూ ప్రజల సంపదను దోచుకుంటున్నారని" మండిపడ్డారు.
గత నాలుగు రోజులుగా ‘బాయిబాట’ కార్యక్రమంలో భాగంగా చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, రామగుండం, మంథని ప్రాంతాల్లోని బొగ్గు గనులను సందర్శించి కార్మికులు, రైతులు, ప్రజల సమస్యలను తెలుసుకున్నామని కవిత తెలిపారు. శనివారం భూపాలపల్లి బొగ్గుగనిని సందర్శించనున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని, కల్లాల వద్దే వడ్లు కొనుగోలు కాక రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కొందరు రైతులు ఆత్మహత్యాయత్నాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా అమలు, యూరియా సరఫరా విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాల భర్తీని కూడా ప్రభుత్వం రాజకీయ సభలకు వేదికగా మార్చిందని, రెండు వేల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా విడతల వారీగా కేవలం ఐదు వందల చొప్పున మాత్రమే ఇస్తోందని విమర్శించారు. కార్మికులు, రైతులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదన్నారు.
పత్తిపాక రిజర్వాయర్, ముక్తేశ్వరం ప్రాజెక్టు, మంథని–ముత్తారం లింకేజీ పనులు, ఎస్సారెస్పీ కాలువ మరమ్మతులు వంటి కీలక అంశాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. భూపాలపల్లి బ్యాక్‌వాటర్ వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, రామగుండంలో కాలుష్య సమస్యపై తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రాంతంలో ఉన్న ఎన్టీపీసీ వంటి కేంద్ర సంస్థల కార్మికుల కోసం ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని స్థానిక ఎంపీ కృషి చేయాలని సూచించారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం ఐదు వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకే పరిమితమైందని, కనీసం 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజలు ప్రస్తుతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారని, తెలంగాణ రక్షణ సేన ఆ ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందని కవిత పేర్కొన్నారు. సింగరేణికి మరిన్ని బ్లాక్‌లు కేటాయించి, డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

మానసిక దివ్యాంగుల పట్ల మానవత్వం చూపిన పోలీసులు

మానసిక దివ్యాంగుల పట్ల మానవత్వం చూపిన పోలీసులు    జగిత్యాల జులై 17(ప్రజా మంటలు)మానసిక దివ్యాంగుల పట్ల స్థానిక పోలీసులు మానవత్వం చాటుకున్నారు. మతిభ్రమించి ఇంటి వారికి దూరమైపట్టణంలో వివిధ ప్రాంతాలలో తిరుగుతున్న మానసిక వికలాంగులను  దాదాపు పది నుండి 15 మంది మానసిక వికలాంగులకు జగిత్యాల పట్టణ పోలీసులు చేయూతనిచ్చారు... పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ...
Read More...
Local News 

కురుమ సంఘం ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుతూ కప్పతల్లి ఆటలు, ప్రత్యేక పూజలు

కురుమ సంఘం ఆధ్వర్యంలో వర్షాలు సమృద్ధిగా పడాలని కోరుతూ కప్పతల్లి ఆటలు, ప్రత్యేక పూజలు       జగిత్యాల జూలై 16 (ప్రజా మంటలు ) కురుమ సంఘం ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం దేశంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ స్థానిక పోచమ్మ వాడ లోని పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రోకలి కి రెండు కప్పలను కట్టి ప్రత్యేక పూజలను నిర్వహించి  డప్పు చప్పుల మధ్య ఇంటింటా తిరుగుతూ కప్పతల్లి...
Read More...
Local News 

ఇంకుడు గుంతలు నిర్మిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి- మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్ గౌడ్

ఇంకుడు గుంతలు నిర్మిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయి- మున్సిపల్ కమిషనర్ డి శ్రీనివాస్ గౌడ్ మెట్ పెల్లి జూలై 16 (ప్రజా మంటలు)జె ఎస్జెబి 3.0 ఆధ్వర్యంలోని క్యాచ్ ది రైన్ ప్రచారం జల ప్రతిజ్ఞ కార్యక్రమంలో భాగంగా సిడిఎంఏ అధికారి  ఆదేశాల మేరకు జలసంచెయ్ జన భాగీ దారి (జే ఎస్జేబి )3.0 లో భాగంగా నిర్వహిస్తున్న క్యాచ్ ది రైన్ ప్రచార కార్యక్రమంలో  వర్షపు నీరు సంరక్షణ...
Read More...
Local News 

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ల జారీకి కమిటీ ఆమోదం

అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ల జారీకి కమిటీ ఆమోదం    జగిత్యాల జులై 15(ప్రజా మంటలు) జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు ఆన్లైన్ లో  సమర్పించిన 697 దరఖాస్తులను జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు సమగ్రంగా క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన మొదటి & రొండవ విడత 506 ప్రస్తుతం మూడవ విడతలో 74 మొత్తం 580 మంది వర్కింగ్ జర్నలిస్ట్ లకు  అక్రీడిటేషన్ కార్డులు జారీకి ఆమోదం...
Read More...
Local News 

చిన్న రైస్ మిల్లర్లకు అండగా ఉంటాం: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత

చిన్న రైస్ మిల్లర్లకు అండగా ఉంటాం: తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జూలై 15 (ప్రజా మంటలు): తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవితను రాష్ట్రానికి చెందిన చిన్న రైస్ మిల్లర్ల ప్రతినిధులు బుధవారం హైదరాబాద్‌లో కలిసి తమ సమస్యలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద రైస్ మిల్లర్ల పట్ల ఒక విధంగా, చిన్న రైస్ మిల్లర్ల పట్ల మరో...
Read More...
State News 

పారిశుద్ధ్య కార్మికుడి మృతి కేసు ముగింపు: రూ.15.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబానికి రెండు ఉద్యోగాలు

పారిశుద్ధ్య కార్మికుడి మృతి కేసు ముగింపు: రూ.15.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబానికి రెండు ఉద్యోగాలు హైదరాబాద్, జూలై 14: (ప్రజా మంటలు) యూసుఫ్‌గూడ గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో పారిశుద్ధ్య కార్మికుడు మీశాల సుధాకర్ మృతి చెందిన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) స్వప్రేరణతో నమోదు చేసిన కేసును గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) ఆదేశాల అమలు నేపథ్యంలో ముగించింది.టీజీహెచ్‌ఆర్‌సీ ఛైర్‌పర్సన్ డా. జస్టిస్ షమీమ్ అక్తర్...
Read More...
Crime  State News 

రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి మున్సిపల్ ఏఈ..

రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పెద్దపల్లి మున్సిపల్ ఏఈ.. ఇంట్లో రూ.32.31 లక్షల అక్రమ నగదు స్వాధీనం పెద్దపల్లి, జూలై 14 (ప్రజా మంటలు):   పెద్దపల్లి మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కల్లేపల్లి సతీష్ కుమార్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు.కాంట్రాక్టర్‌కు సంబంధించిన బిల్లును ప్రాసెస్ చేసి టీయూఎఫ్ఐడీసీ (TUFIDC)కి పంపేందుకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా...
Read More...
Local News 

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువకునికి మారుతి స్నేహమండలి సత్కారం 

ప్రభుత్వ ఉద్యోగం సాధించిన యువకునికి మారుతి స్నేహమండలి సత్కారం  జగిత్యాల జులై 12 (ప్రజా మంటలు) జగిత్యాల బ్రాహ్మణ వీధికి చెందిన మోతే ఆర్యన్ ఇటీవల బ్యాంకింగ్ పరీక్ష రాసి ఉద్యోగం సాధించిన నేపథ్యాన్ని పురస్కరించుకొని మారుతి స్నేహ మండలి వారిచే మోతే ఆర్యన్ కు జ్ఞాపిక అందజేసి శాలువతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్యన్ మాట్లాడుతూ ఉద్యోగం సాధించడానికి ప్రధానంగా ధైర్యంతో...
Read More...
Local News 

కన్నయ్య కుమార్ మీ అర్హతను దృష్టిలో ఉంచుకొని మాట్లాడు

కన్నయ్య కుమార్ మీ అర్హతను దృష్టిలో ఉంచుకొని మాట్లాడు    హైదరాబాద్ 12 జూలై (ప్రజా మంటలు) :  కాంగ్రెస్ పార్టీ నాయకుడు కన్నయ్య కుమార్ మీ అర్హతను దృష్టిలో ఉంచుకొని మాట్లాడాలని శివసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శివసేన పార్టీ అధినేత పైన చేసిన వాఖ్యల పైన శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ తీవ్రంగా స్పందించారు......
Read More...
Local News 

జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ

జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణానికి భూమిపూజ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 ఎకరాల భూమి కేటాయింపు – త్వరలో తాత్కాలిక భవనంలో తరగతుల ప్రారంభం జగిత్యాల, జూలై 12 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా కేంద్రంలోని చలగల్ వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయ శాశ్వత భవన నిర్మాణానికి ఆదివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, నిజామాబాద్ ఎంపీ...
Read More...
Local News 

ఎస్సీ గ్రూప్ 1 లోని ఉప కులాలకు కార్పొరేషన్ ద్వారా చైర్మన్ ను నియమించాలి

ఎస్సీ గ్రూప్ 1 లోని ఉప కులాలకు కార్పొరేషన్ ద్వారా చైర్మన్ ను నియమించాలి    జగిత్యాల జులై 12(ప్రజా మంటలు)  జిల్లాలో బేడ బుడగ జంగాల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేసింది. ఎస్సీ గ్రూప్-1లోని 15 ఉపకులాల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రాష్ట్ర సంఘ అధ్యక్షుడు సిరిపాటి వేణును ఆ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమించాలని డిమాండ్ చేసింది. జగిత్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా...
Read More...

లారెన్స్ బిష్ణోయ్‌ను అమెరికాకు అప్పగించాలని కోరాలని యూఎస్ నిర్ణయం

లారెన్స్ బిష్ణోయ్‌ను అమెరికాకు అప్పగించాలని కోరాలని యూఎస్ నిర్ణయం హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుతో పాటు అంతర్జాతీయ నేరాలపై విచారణకు రంగం సిద్ధంవాషింగ్టన్/న్యూఢిల్లీ జూలై 12: భారతీయ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను అమెరికాకు అప్పగించాలని (ఎక్స్‌ట్రడిషన్) అమెరికా న్యాయశాఖ (US Department of Justice - DoJ) అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం గుజరాత్‌లోని జైలులో ఉన్న బిష్ణోయ్‌పై అమెరికా దాఖలు చేసిన అభియోగాల...
Read More...