నెహ్రూ 17 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు – చరిత్రను వక్రీకరించొద్దు: డాక్టర్. చిన్నారెడ్డి

On
నెహ్రూ 17 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించారు – చరిత్రను వక్రీకరించొద్దు: డాక్టర్. చిన్నారెడ్డి

హైదరాబాద్, జూన్ 10 (ప్రజా మంటలు):

జవహర్‌లాల్ నెహ్రూ కంటే ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కువ కాలం దేశాన్ని పాలించారని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రచారం చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ. చిన్నారెడ్డి విమర్శించారు. చరిత్రను వక్రీకరించడం దేశ ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన పేర్కొన్నారు.

ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, 1946 సెప్టెంబర్ 2 నుంచి 1947 ఆగస్టు 15 వరకు బ్రిటిష్ వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా, ప్రధాన మంత్రి హోదాతో జవహర్‌లాల్ నెహ్రూ బాధ్యతలు నిర్వహించారని గుర్తు చేశారు. స్వాతంత్ర్యానంతరం 1947 నుంచి 1952 వరకు కూడా దేశ ప్రభుత్వానికి నాయకత్వం వహించారని తెలిపారు.

1952లో జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో నెహ్రూ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన తొలి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, 1964 మే 27న మరణించే వరకు పదవిలో కొనసాగారని చెప్పారు.

ఈ లెక్కన 1946 నుంచి 1964 వరకు నెహ్రూ దాదాపు 18 సంవత్సరాలపాటు దేశ పాలనలో కీలక బాధ్యతలు నిర్వహించారని చిన్నారెడ్డి పేర్కొన్నారు. అందువల్ల నెహ్రూ కంటే మోడీ ఎక్కువకాలం ప్రధానిగా ఉన్నారని చెప్పడం వాస్తవాలను వక్రీకరించడమేనని అన్నారు.

బీజేపీ నాయకులు దేశ చరిత్రను సరిగా అధ్యయనం చేసి మాట్లాడాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలను మానుకోవాలని ఆయన సూచించారు.

స్వాతంత్ర్య సమరంలో కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ నాయకులు జైలు శిక్షలు అనుభవించారని, తమ ఆస్తులను త్యాగం చేశారని పేర్కొన్న చిన్నారెడ్డి, స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీకి పూర్వగామిగా భావించే రాజకీయ శక్తుల పాత్ర లేదని విమర్శించారు.

నెహ్రూ పాలనా కాలానికి సంబంధించిన చారిత్రక వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నాలు ప్రజాస్వామ్య చరిత్రకు హానికరమని ఆయన అన్నారు.

Join WhatsApp

More News...

Local News 

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని సందర్శించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్  బక్కి వెంకటయ్య 

కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని సందర్శించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్  బక్కి వెంకటయ్య  కొండగట్టు జులై 25( ప్రజా మంటలు)   కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్  , శ్రీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన అధికారులు చైర్మన్ కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, వేద పండితుల వేదాశీర్వచనం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రంతో సత్కరించారు...
Read More...
National  Local News  State News 

ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన గొప్ప విజయం - దావ వసంత సురేష్.

ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన గొప్ప విజయం - దావ వసంత సురేష్. సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113.  జగిత్యాల 25 జూలై (ప్రజా మంటలు) :  కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా పై స్పందించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారిపై దేశవ్యాప్తంగా విద్యార్థులు,...
Read More...
National  Local News 

విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం: తెలంగాణ రక్షణ సేన

విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం: తెలంగాణ రక్షణ సేన హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు): దేశవ్యాప్తంగా NEET ప్రశ్నపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. కందుల మధు, బొడ్డుపల్లి లింగం, అశోక్ యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీ ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీ నుంచి ఆర్ట్స్...
Read More...
Local News 

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి దావ వసంత సురేష్

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి దావ వసంత సురేష్                           జగిత్యాల జులై 23( ప్రజా మంటలు)  పట్టణం 37 ,38 వార్డ్ లో బిఆర్ఎస్ నాయకులతో కలిసి ఎస్ ఐ ఆర్  ప్రక్రియను పరిశీలించిన జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్  అర్హులైన ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి తొలగిపోకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.    ప్రజాస్వామ్య విలువలను...
Read More...
National  State News 

తమిళనాడు లో ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేరు మార్పు

తమిళనాడు లో  ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేరు మార్పు చెన్నై, జూలై 22: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత డీఎంకే ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ప్రారంభించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ పేరును 'తలైవార్ కామరాజర్ అల్పాహార పథకం’గా మార్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  ప్రస్తుతం 1 నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న ప్రభుత్వ...
Read More...
Local News 

NEET ప్రాథమికంగానే అన్యాయమైన విధానం: ఎం.కె. స్టాలిన్

NEET ప్రాథమికంగానే అన్యాయమైన విధానం: ఎం.కె. స్టాలిన్ :చెన్నై ,జులై 22: “న్యాయం, NEET రెండూ కలసి ఉండలేవు. NEET ప్రాథమికంగానే అన్యాయమైన విధానం” అని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ అన్నారు.తమిళనాడులో బీజేపీ మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు NEETను వ్యతిరేకిస్తున్నాయని ఆయన తెలిపారు. NEET నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర శాసనసభ పలుమార్లు...
Read More...
State News 

ప్రైవేట్ పాఠశాలలను వేధిస్తే కఠిన చర్యలు: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి

ప్రైవేట్ పాఠశాలలను వేధిస్తే కఠిన చర్యలు: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి హైదరాబాద్, జూలై 22 (ప్రజా మంటలు ):   బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధుల బృందం మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పోలీస్ కమిషనర్ శ్రీమతి బి. సుమతి, ఐపీఎస్‌ను కలిసి, ప్రైవేట్ పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని కొందరు అనధికార వ్యక్తులు బ్లాక్‌మెయిల్, బెదిరింపులు, వేధింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ అక్రమ కార్యకలాపాలపై వెంటనే చర్యలుప్రతినిధుల...
Read More...
State News 

ఢిల్లీ విద్యార్థులపై దాడికి బీజేపీ సమాధానం చెప్పాలి: కల్వకుంట్ల కవిత

ఢిల్లీ విద్యార్థులపై దాడికి బీజేపీ సమాధానం చెప్పాలి: కల్వకుంట్ల కవిత హైదరాబాద్ జులై 22 (ప్రజా మంటలు): బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు.. “బ్రిటీష్ జాహిల్ పార్టీ” అని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీకేజీని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరు సిగ్గుచేటని ఆమె అన్నారు. ఈ...
Read More...
Local News 

సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు రోడ్డు భద్రత చర్యలు పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

సుప్రీం కోర్టు మార్గదర్శకాల మేరకు రోడ్డు భద్రత చర్యలు పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్    జగిత్యాల జులై 22 (ప్రజా మంటలు) ప్రతి 15 రోజులకు రవాణా, పోలీసు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో సమీక్ష సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో రోడ్డు భద్రతా నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేసి, అవసరమైన అన్ని చర్యలను 60 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా రోడ్డు భద్రత కమిటీ చైర్‌ పర్సన్ బి. సత్యప్రసాద్...
Read More...
Local News 

రజక సంఘం ఆధ్వర్యంలో వైభవంగా వీరమ్మ బోనాల పండుగ శోభాయాత్ర

రజక సంఘం ఆధ్వర్యంలో వైభవంగా వీరమ్మ బోనాల పండుగ శోభాయాత్ర    జగిత్యాల జూలై  22 (ప్రజా మంటలు) రజక సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా వీరమ్మ బోనాల పండుగ శోభాయాత్ర బుధవారం మధ్యాహ్నం  గంటలకు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జగిత్యాల రజక సంఘం ఆధ్వర్యంలో  ఆషాడ మాసం కావడంతో ప్రతి ఏటా నిర్వహించే వీరమ్మ బోనాల పండుగ సందర్భంగా మడలేశ్వర స్వామి వారి భారీ విగ్రహం...
Read More...
State News 

ఉద్యమకారుల గుర్తింపులో ఆలస్యం వద్దు: కల్వకుంట్ల కవిత

ఉద్యమకారుల గుర్తింపులో ఆలస్యం వద్దు: కల్వకుంట్ల కవిత హైదరాబాద్, జూలై 21 (ప్రజా మంటలు): తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కమిటీకి తెలంగాణ రక్షణ సేన చీఫ్, కల్వకుంట్ల కవిత తన సూచనలు, సలహాలతో కూడిన నివేదికను అందజేశారు. ఉద్యమకారులకు న్యాయం చేయడంలో ఆలస్యం చేయవద్దని ఆమె కమిటీని కోరారు.తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవించేందుకు కమిటీ ఏర్పాటు చేయడం...
Read More...
State News 

ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో గోల్‌మాల్ చేసి మేఘా, కేఎంవీ సంస్థలకే సగం పనులు ఇచ్చారు – టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత

ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో గోల్‌మాల్ చేసి మేఘా, కేఎంవీ సంస్థలకే సగం పనులు ఇచ్చారు – టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత రేవంత్ రెడ్డి ప్రభుత్వ స్కూళ్ల జోలికొస్తే ప్రజలు మీ ప్రభుత్వాన్ని పడగొడతరుప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసే కుట్రలను తిప్పికొడతాంగ్రామాల్లోకి కార్పొరేట్ స్కూళ్లకు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తున్నరు హైదరాబాద్, జూలై 20 (ప్రజా మంటలు): ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రైవేట్ పరం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర...
Read More...