పేదింటి అమ్మాయి వివాహానికి ఆర్థిక సహాయం

భువనేశ్వరి మాత ట్రస్టు, వంగర పిహెచ్సి వైద్య సిబ్బంది

On
పేదింటి అమ్మాయి వివాహానికి ఆర్థిక సహాయం

ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కుటుంబ సభ్యులు

భీమదేవరపల్లి ఏప్రిల్ 02 (ప్రజామంటలు)  :
 
మండలంలోని ముల్కనూర్ గ్రామంలో కరెల్లి కోమల (కీ.శే సాయిలు) మొదటి కూతురు పెళ్ళికి భువనేశ్వరి మాత చారిటబుల్ ట్రస్టు సభ్యులు ఆర్థిక చేయూత అందించారు. పేద కుటుంబం కావడం, తండ్రి మరణంతో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంతో భువనేశ్వరి మాత ట్రస్టు అందించిన సహాయం పట్ల కంచనకుంట్ల పద్మజ, రాము, సునిత, స్వరూప, రజిత, స్వరూప ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
వంగర పీహెచ్సీ వైద్యుల ఆర్థిక చేయూత 

వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వర్తించే డాక్టర్ జ్యోతి, డాక్టర్ రూబీనా సమిష్టిగా రూ .లు18000, చీరలు గాజులు అందజేసారు. ఆర్థిక సహాయం అందించిన ట్రస్టు సభ్యులకు, వంగర ప్రాథమిక కేంద్రం వారికి, దాతలకు కోమల కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.

Tags