వివాహిత హత్య కేసును ఛేదించిన మల్యాల పోలీసులు.

On

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9348422113/9963349493)

మల్యాల మార్చి 26 (ప్రజా మంటలు)

గత వారం క్రితం జరిగిన వివాహిత హత్య కేసును జగిత్యాల జిల్లా మల్యాల పోలీసులు చేధించారు.. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల పట్టణం వంజరి వాడకు చెందిన కరిపె అంజలి అనే వివాహితను గత వారం క్రితం మల్యాల మండలం మ్యాడంపల్లి శివారులో గొంతునులిమి హత్య చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.. అంజలికి కొల్లూరి నరేశ్‌తో గతంలో ప్రేమ వివాహం కాగా మనస్పార్థాలతో వీడిపోయి ఆమె సిద్దపేటకు చెందిన మరో వ్యక్తితో రెండో వివాహం చేసుకుంది. ఆమెను మరిచిపోలేని నరేశ్‌ జగిత్యాలకు వచ్చిన అంజలికి మాయమాటలు చెప్పి మ్యాడంపల్లి శివారులోని రహస్యప్రాంతాకి తీసుకెళ్లి గొంతునులిమి హత్య చేశాడు.. నిందితుడు నరేశ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు మల్యాల సీఐ నీలం రవి తెలిపారు.

Tags