లోక్ సభ ఎన్నికల భాగంగా పోలాస గ్రామంలో బారాస పార్టీ ప్రచారం షురూ

- నిజామాబాద్ పార్లమెంట్ బారాసా అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ,ఎమ్మెల్యే డా. సంజయ్ ప్రచారం.

On
లోక్ సభ ఎన్నికల భాగంగా పోలాస గ్రామంలో బారాస పార్టీ ప్రచారం షురూ

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల రూరల్ మార్చి 26( ప్రజా మంటలు) : 

రూరల్ మండలం పోలాస గ్రామంలో బి అర్ ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి,ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్  ఎన్నికల ప్రచారం లో భాగంగా గ్రామం లో పాదయాత్ర చేస్తూ,ప్రజలను పలకరిస్తూ,బి అర్ ఎస్ పార్టీ ని ఆశీర్వదించాలని కోరారు.

అనంతరం రామాలయం లో ప్రత్యేక పూజలు చేసిన బాజీ రెడ్డి.

సభ వద్ద మైనార్టీ నాయకులు దట్టి కట్టి వారిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు ,జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ ,మాజీ ఎమ్మెల్సీ వి జి గౌడ్,వైస్ ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్,గ్రామ శాఖ అధ్యక్షులు రామ్ శంకర్,కో ఆప్షన్ జావేద్,మాజీ సర్పంచ్ చిర్ర నరేష్,జై రాం సురేష్,లక్ష్మి, శ్యామ్,సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Tags