నిజామాబాద్ ఎం పి టిక్కట్టు కొత్తవారికేనా? -జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ లేదా మంత్రి పదవి?
నిజామాబాద్ ఎం పి టిక్కట్టు కొత్తవారికేనా? -జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ లేదా మంత్రి పదవి?
- ఇప్పటికే నలుగురు రెడ్డీలకు టికెట్లు-సామాజిక సమీకరణాలే జీవన్ రెడ్డి టికెట్ కు అడ్డంకి
హైదరాబాద్ మార్చ్ 25 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి) :
2019 మార్చిలో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో గల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన టి. జీవన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ గొంతుకగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడు. కాంగ్రెస్ కష్టకాలంలో బీఆర్ఎస్, బీజేపీ లపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఒక దశలో కాంగ్రెస్ అధిష్టానం టి. జీవన్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా దాదాపుగా ప్రకటించే దశలో వాయిదా వేసి అనూహ్య పరిణామాలలో ఏ. రేవంత్ రెడ్డిని నియమించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలలో ఓడిపోవడంతో ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టే అవకాశం కోల్పోయారు జీవన్ రెడ్డి.
తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో కరీంనగర్ లోక్ సభ స్థానంలో కేసీఆర్ పై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన టి. జీవన్ రెడ్డికి ఉత్తర తెలంగాణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. రైతులు, నిరుద్యోగులు, గల్ఫ్ కార్మికుల సమస్యలపై ఇతర అన్ని అంశాలపై మంచి పట్టు ఉన్న జీవన్ రెడ్డికి పెద్ద ఎత్తున అభిమానులున్నారు. నిజామాబాద్, కరీంనగర్ లలో ఏదో ఒక స్థానం నుంచి జీవన్ రెడ్డిని బరిలోకి దించాలని ఏఐసీసీ భావించింది. చివరికి నిజామాబాద్ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు రెండు లిస్టులలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన అధిష్టానం నిజామాబాద్ ను ఎందుకు పెండింగ్ లో ఉంచారో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారని అనుకున్న స్థాయి నుంచి ఎంపీ టికెట్ కూడా దక్కని పరిస్థితికి నెట్టివేయడం జీవన్ రెడ్డి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
మూడు బీజేపీ సిట్టింగ్ సీట్లలో పెండింగ్ లో కాంగ్రెస్ టికెట్లు
ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ఉన్నారు. సరిగ్గా ఈ మూడు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో ఉంచడం విశేషం. నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ రేసులో ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ముందున్నారు. సామాజిక సమీకరణాలు, ఆర్థిక స్తోమత దృష్ట్యా జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని తెలుస్తున్నది. 29 మార్చి 2025 వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవీ కాలం ఉన్నందున మంత్రి పదవి ఇవ్వడంలో సాంకేతిక అవరోధం ఉండదు. ఎమ్మెల్సీ లకు కూడా ఒకటో, రెండో మంత్రి పదవులు ఇవ్వడం ఆనవాయితీ కూడా.
నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ (బీజేపీ), బాజిరెడ్డి గోవర్ధన్ (బీఆర్ఎస్) లు తమ అభ్యర్థులుగా ఇప్పటికే ఆయా పార్టీలు ప్రకటించాయి. వీరు ఇద్దరూ మున్నూరు కాపు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డితో పాటు ముత్యాల సునీల్ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరు ఇద్దరు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ ఇటీవల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో అతను పోటీ నుంచి తప్పుకున్నట్లే. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, వైద్యురాలు డా. కవితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ ఎల్. రమణ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తున్నది. ఎల్. రమణ ఎమ్మెల్యే గా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు.
తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలలో 3 ఎస్సీ, 2 ఎస్టీలకు రిజర్వ్. ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ ను మినహాయిస్తే జనరల్ క్యాటగిరీ లో మిగిలినవి 11 సీట్లు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించడం కోసం బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తోంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు ప్రకటించిన తొమ్మిది సీట్లలో చల్లా వంశీచంద్ రెడ్డి (మహబూబ్ నగర్), కుందూరు రఘువీర్ రెడ్డి (నల్గొండ), డా. జి. రంజిత్ రెడ్డి (చేవెళ్ల), పట్నం సునీతా మహేందర్ రెడ్డి (మల్కాజిగిరి) నలుగురు రెడ్డీలకు టికెట్లు ఇచ్చింది. బలరాం నాయక్ (మహబూబాబాద్ - ఎస్టీ), డా. మల్లు రవి (నాగర్ కర్నూల్ - ఎస్సీ), గడ్డం వంశీ కృష్ణ (పెద్దపల్లి - ఎస్సీ), బీసీ అభ్యర్థులు సురేష్ కుమార్ షెట్కార్ (జహీరాబాద్), దానం నాగేందర్ (సికింద్రాబాద్) లకు టికెట్లు ప్రకటించారు. ఆదిలాబాద్ (ఎస్టీ), వరంగల్ (ఎస్సీ), హైదరాబాద్, ఖమ్మం, భువనగిరి, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ ఎనిమిది సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది.
More News...
<%- node_title %>
<%- node_title %>
మెట్పల్లి శివారులో ఘోర రోడ్డు ప్రమాదం – దంపతులు మృతి, ఒకరి పరిస్థితి విషమం
మెటుపల్లి డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణ శివారులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ఎదురుగా వచ్చిన లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందగా, కారులో ఉన్న మరో వ్యక్తి తీవ్రంగా... గాంధీ వద్ద అక్రమ పార్కింగ్ వాహనాల తొలగింపు
సికింద్రాబాద్, డిసెంబర్ 27 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి, మెట్రో స్టేషన్, ఎంసీహెచ్ బస్ షెల్టర్ ప్రాంతాల్లో అక్రమంగా పార్కింగ్ చేసిన 12 వాహనాలకు ఫైన్ వేసి, అక్కడి నుంచి తొలగించారు. అలాగే ఏండ్ల తరబడిగా గాంధీ మెట్రో స్టేషన్, ఆసుపత్రి మెయిన్ గేట్, ఫుట్ పాత్ ప్రాంతాల్లో తిష్ట వేసుకొని ఉన్న యాచకులను
3... డబుల్ బెడ్రూం లబ్ధిదారుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు హనుమండ్ల జయశ్రీ వినతి
జగిత్యాల డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి మౌలిక వసతుల లేమితో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తాజా మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ, అవసరమైన మౌలిక... పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు
నాగర్ కర్నూల్, డిసెంబర్ 27 (ప్రజా మంటల):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించి పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితిని తీవ్రంగా విమర్శించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు ప్రాంతాలను సందర్శించిన ఆమె, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
వట్టెం రిజర్వాయర్,... జీవో 252 సవరించాలని జగిత్యాల కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టుల ధర్నా
జగిత్యాల, డిసెంబర్ 27 (ప్రజా మంటల):
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీఓ నెం.252లోని నిబంధనలు వేలాది మంది జర్నలిస్టుల ఉపాధికి ముప్పుగా మారాయని ఆరోపిస్తూ, శనివారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ జీవోను తక్షణమే సవరించాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే హెచ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు... అంబారిపేట శ్రీవెంకటేశ్వర స్వామి వారి యుట్యూబ్ ఛానల్,భక్తి పాట ను ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 27 (ప్రజా మంటలు)అర్బన్ మండల అంబారిపేట శ్రీవెంకటేశ్వర స్వామి వారి మీద రూపొందించిన భక్తి పాట ను, శ్రీ వెంకటేశ్వర భక్తి యూట్యూబ్ చానల్ నుజగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ భక్తి పాట రూపొందించడానికి కృషి చేసిన పాట రచన సిరికొండ... అల్లిపూర్ నూతన సర్పంచ్, ఉపసర్పంచ్లకు శుభాకాంక్షలు తెలిపిన తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్
జగిత్యాల (రూరల్),డిసెంబర్ 27 ప్ర(జా మంటలు):జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ఎంబరీ గౌతమి, ఉపసర్పంచ్ వినయ్లతో పాటు వార్డు సభ్యులుగా ఎన్నికైన మహిళలు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దావ వసంత సురేష్ వారిని శాలువాలతో సత్కరించి... అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి యూట్యూబ్ ఛానల్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల అర్బన్ మండలంలోని అంబారిపేట శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన భక్తి పాటను, అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి యూట్యూబ్ ఛానల్ను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగింది.
భక్తి పాట రూపకల్పనలో కీలకంగా పనిచేసిన... సారంగాపూర్లో మండలోజు వేణుగోపాల్ పదవీ విరమణ వేడుకలలో ఎమ్మెల్యే డా సంజయ్
సారంగాపూర్, డిసెంబర్ 27 – ప్రజా మంటలు:
సారంగాపూర్ మండలం రంగంపేట గ్రామ మండల పరిషత్ పాఠశాలలో నిర్వహించిన మండలోజు వేణుగోపాల్ పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మండలోజు వేణుగోపాల్ – శోభ దంపతులను శాలువాతో సత్కరించి, పదవీ విరమణ... ఆరుసార్లు గెలిచి! మళ్ళీ రాజీనామా చేసి, గెలుస్తా దానం ప్రకటన
హైదరాబాద్, డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపు కేసులు, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు పెండింగ్లో ఉన్న నేపథ్యంలో తాను పూర్తిగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేస్తూ, అవసరమైతే రాజీనామా చేసి ఉపఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమని ప్రకటించారు.
శుక్రవారం... జగిత్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ ఆకస్మిక మృతి
జగిత్యాల, డిసెంబర్ 27 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా వైద్యాధికారి (DMHO) డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం అకస్మాత్తుగా మృతి చెందారు. ఆయన అకాల మరణం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, వైద్య వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.ప్రజారోగ్య సేవల్లో అంకితభావంతో పనిచేసిన డాక్టర్ ఆకుల శ్రీనివాస్, విధి నిర్వహణలో నిబద్ధత, మానవీయత... 