నిజామాబాద్ ఎం పి టిక్కట్టు కొత్తవారికేనా? -జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ లేదా మంత్రి పదవి?

On
నిజామాబాద్ ఎం పి టిక్కట్టు కొత్తవారికేనా?  -జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ లేదా మంత్రి పదవి?

నిజామాబాద్ ఎం పి టిక్కట్టు కొత్తవారికేనా? -జీవన్ రెడ్డికి ఎంపీ టికెట్ లేదా మంత్రి పదవి?

- ఇప్పటికే నలుగురు రెడ్డీలకు టికెట్లు-సామాజిక సమీకరణాలే జీవన్ రెడ్డి టికెట్ కు అడ్డంకి  

హైదరాబాద్ మార్చ్ 25 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి) :

2019 మార్చిలో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో గల పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గం నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచిన టి. జీవన్ రెడ్డి గత ఐదు సంవత్సరాలుగా శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ గొంతుకగా ప్రజా సమస్యలపై పోరాడుతున్నాడు. కాంగ్రెస్ కష్టకాలంలో బీఆర్ఎస్, బీజేపీ లపై తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లారు. ఒక దశలో కాంగ్రెస్ అధిష్టానం టి. జీవన్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడిగా దాదాపుగా ప్రకటించే దశలో వాయిదా వేసి అనూహ్య పరిణామాలలో ఏ. రేవంత్ రెడ్డిని నియమించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాలలో ఓడిపోవడంతో ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టే అవకాశం కోల్పోయారు జీవన్ రెడ్డి.

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో కరీంనగర్ లోక్ సభ స్థానంలో కేసీఆర్ పై పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన టి. జీవన్ రెడ్డికి ఉత్తర తెలంగాణతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయాన్ని కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. రైతులు, నిరుద్యోగులు, గల్ఫ్ కార్మికుల సమస్యలపై ఇతర అన్ని అంశాలపై మంచి పట్టు ఉన్న జీవన్ రెడ్డికి పెద్ద ఎత్తున అభిమానులున్నారు. నిజామాబాద్, కరీంనగర్ లలో ఏదో ఒక స్థానం నుంచి జీవన్ రెడ్డిని బరిలోకి దించాలని ఏఐసీసీ భావించింది. చివరికి నిజామాబాద్ నుంచి పోటీ చేయించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు రెండు లిస్టులలో తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన అధిష్టానం నిజామాబాద్ ను ఎందుకు పెండింగ్ లో ఉంచారో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారని అనుకున్న స్థాయి నుంచి ఎంపీ టికెట్ కూడా దక్కని పరిస్థితికి నెట్టివేయడం జీవన్ రెడ్డి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

 మూడు బీజేపీ సిట్టింగ్ సీట్లలో పెండింగ్ లో కాంగ్రెస్ టికెట్లు

 ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల్లో ప్రస్తుతం బీజేపీ ఎంపీలు ఉన్నారు. సరిగ్గా ఈ మూడు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో ఉంచడం విశేషం. నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ టికెట్ రేసులో ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి ముందున్నారు. సామాజిక సమీకరణాలు, ఆర్థిక స్తోమత దృష్ట్యా జీవన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని తెలుస్తున్నది. 29 మార్చి 2025 వరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పదవీ కాలం ఉన్నందున మంత్రి పదవి ఇవ్వడంలో సాంకేతిక అవరోధం ఉండదు. ఎమ్మెల్సీ లకు కూడా ఒకటో, రెండో మంత్రి పదవులు ఇవ్వడం ఆనవాయితీ కూడా.

 

నిజామాబాద్ లో ధర్మపురి అరవింద్ (బీజేపీ), బాజిరెడ్డి గోవర్ధన్ (బీఆర్ఎస్) లు తమ అభ్యర్థులుగా ఇప్పటికే ఆయా పార్టీలు ప్రకటించాయి. వీరు ఇద్దరూ మున్నూరు కాపు బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డితో పాటు ముత్యాల సునీల్ రెడ్డిల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వీరు ఇద్దరు కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ పేరు పరిశీలనలో ఉన్నప్పటికీ ఇటీవల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో అతను పోటీ నుంచి తప్పుకున్నట్లే. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, వైద్యురాలు డా. కవితా రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ ఎల్. రమణ ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించి టికెట్ ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తున్నది. ఎల్. రమణ ఎమ్మెల్యే గా, రాష్ట్ర మంత్రిగా, ఎంపీగా ఈ ప్రాంత ప్రజలకు సుపరిచితులు.     

 

తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ స్థానాలలో 3 ఎస్సీ, 2 ఎస్టీలకు రిజర్వ్. ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ ను మినహాయిస్తే  జనరల్ క్యాటగిరీ లో మిగిలినవి 11 సీట్లు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయం పాటించడం కోసం బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తోంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు ప్రకటించిన తొమ్మిది సీట్లలో చల్లా వంశీచంద్ రెడ్డి (మహబూబ్ నగర్), కుందూరు రఘువీర్ రెడ్డి (నల్గొండ), డా. జి. రంజిత్ రెడ్డి (చేవెళ్ల), పట్నం సునీతా మహేందర్ రెడ్డి (మల్కాజిగిరి) నలుగురు రెడ్డీలకు టికెట్లు ఇచ్చింది. బలరాం నాయక్ (మహబూబాబాద్ - ఎస్టీ), డా. మల్లు రవి (నాగర్ కర్నూల్ - ఎస్సీ), గడ్డం వంశీ కృష్ణ (పెద్దపల్లి - ఎస్సీ)బీసీ అభ్యర్థులు సురేష్ కుమార్ షెట్కార్ (జహీరాబాద్), దానం నాగేందర్ (సికింద్రాబాద్) లకు టికెట్లు ప్రకటించారు. ఆదిలాబాద్ (ఎస్టీ), వరంగల్ (ఎస్సీ), హైదరాబాద్, ఖమ్మం, భువనగిరి, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ ఎనిమిది సీట్లకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉన్నది.

 

Tags

More News...

Local News 

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి  శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత 

ఆర్థికంగా వెనుకబడిన అమ్మాయి చదువుకి  శ్రీ సత్యసాయి సేవా సమితి ఆర్థిక చేయూత    జగిత్యాల జూలై 3(ప్రజా మంటలు    ) స్థానిక జగిత్యాల సాయినగర్ కి చెందిన శ్రీమతి మామిడాల చంద్రకళ  చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఇద్దరు ఆడపిల్లలను ఉన్నత చదువులు చదివిపిస్తూ వచ్చింది , కానీ ఇప్పుడు తన ఆరోగ్యం క్షీణించడంతో ఉద్యోగం చేసే పరిస్థితి లేకపోవడంతో ఇంజనీరింగ్ చదువుతున్న తన కూతురు వెన్నెల కాలేజ్ ఫీ...
Read More...
Local News 

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ 

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్  రాయికల్ జులై 3( ప్రజా మంటలు)   రాయికల్ మండల కేంద్రంలో  సామాజిక  ఆరోగ్య కేంద్రం ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓ. పి. సేవలు, ఐపీ సేవలు రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్ ఐపీ రికార్డ్స్ మెడికల్ ఫార్మసి జిల్లాకలెక్టర్ పరిశీలించారు.   ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషంట్లని వివరాలు అడిగివైద్య...
Read More...
Local News 

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు. 

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.        జగిత్యాల జూలై 3 (ప్రజా మంటలు ) వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో గురువారం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆషాడ మాసం సందర్భంగా స్త్రీలు గోరింటాకును ధరించడం ఆనవాయితీగా వస్తుంది. ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న మహిళలు, సేవికాసమితి సేవా భారతి కార్యకర్తలు...
Read More...
Local News 

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం  ఎమ్మెల్యే కు వినతి 

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం  ఎమ్మెల్యే కు వినతి      రాయికల్ జులై 3 ( ప్రజా మంటలు)మోరపల్లి  గ్రామంలో పద్మశాలి సేవా సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేయగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధులు మంజూరుకు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు కట్ట రాజేందర్,సదానందం పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local News 

మలేసియా సదస్సుకు  జగిత్యాల జిల్లావాసి    గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు 

మలేసియా సదస్సుకు  జగిత్యాల జిల్లావాసి     గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు  జగిత్యాల జులై 2( ప్రజా మంటలు) మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగుతున్న వలస కార్మికుల అంతర్జాతీయ సదస్సుకు జగిత్యాల జిల్లావాసి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయిండ్ల రాజిరెడ్డి హాజరవుతున్నారు. ఈ నెల 4, 5, 6 తేదీలలో బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బిడబ్ల్యుఐ) అనే అంతర్జాతీయ...
Read More...
Local News 

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం జగిత్యాల జులై 3 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం కృష్ణానగర్ లోని, శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సాయి సచ్చరిత్ర పారాయణం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గురువారం నుంచి మళ్లీ గురువారం వరకు ఈ పారాయణం  కొనసాగనుంది. ప్రతి సంవత్సరం ఆషాడ పౌర్ణమి పురస్కరించుకొని సామూహిక శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం జరుగుతుంది.   108...
Read More...
Local News 

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఘనంగా ప్రారంభమైన శత చండీ యాగం 

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఘనంగా ప్రారంభమైన శత చండీ యాగం  హైదరాబాద్ జులై2( ప్రజా మంటలు) హైదరాబాదులోని మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్స్ లో మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ,శ్రీ శారదచంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ 19వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం శత చండీ యాగం ఘనంగా ప్రారంభమైంది వివిధ ప్రాంతాల నుండి పండితులు, బాధ్యులు, సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ కార్యక్రమం ఈనెల...
Read More...
Local News 

శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ధర్మపురిలో చిన్నారులకు స్కూల్ బుక్స్ పెన్నుల పంపిణీ

శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ధర్మపురిలో చిన్నారులకు స్కూల్ బుక్స్ పెన్నుల పంపిణీ ధర్మపురి జులై 3 (ప్రజా మంటలు) శ్రీనివాసుల సేవా సంస్థ (టి ఎస్ ఎస్ఎస్) జగిత్యాల జిల్లా గాజుల శ్రీనివాస్ వారి మిత్ర బృందం  ఆధ్వర్యంలో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో ఇటీవలే తల్లితండ్రులను కోల్పోయిన  చిన్నారులు శన్ముఖ ప్రియ (12), రిషికేష్ (11) పిల్లల మేనత్త ఐన వకుల దగ్గర వుంటున్నారు....
Read More...
Local News 

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం  -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం  -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ    సికింద్రాబాద్, జూలై 02 ( ప్రజామంటలు) : బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం బుధవారం సాయంత్రం నేత్రపర్వంగా సాగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీమణి సుధాదేవ్ వర్మ, కలెక్టర్ హరిచందనతో కలిసి సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా...
Read More...
Local News 

పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల జూలై 2 ( ప్రజా మంటలు) పట్టణ 29,30, 31 ,3,6 8 వార్డుల్లో 80 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు. 44 వ వార్డులో 35 లక్షలతో వేస్తున్న cc రోడ్డు పనులను పరిశీలించారు.30,8వార్డులో...
Read More...
Local News 

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి    జగిత్యాల జులై 2( ప్రజా మంటలు) ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి మారెమ్మ ఆలయానికి దారి కోసం వినతిపత్రాన్ని అందజేసిన జగిత్యాల ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు.   జగిత్యాల మోతే గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 35 మోతే తాళ్ల దగ్గర మారెమ్మ గుడి దానికి సంబంధించి సానుకూలంగా...
Read More...
Local News 

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన సారంగాపూర్ జూలై 2 (ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   ఆదేశాల మేరకు సారంగాపూర్  పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతారం  గ్రామం లో పోలీస్ కళాబృందం వారు మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ ల మోసాలు, సైబర్ మోసాలు,నివారణ పై అవగాహన, సీసీ కెమెరాల...
Read More...