సీఎం రేవంత్ నిజాయితీపరుడైతే బీఆర్ఎస్ నేతలు జైలుకెళ్తారు : ఎంపీ అరవింద్
బిఆర్ఎస్ కు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులే లేరు?
జగిత్యాల, జనవరి 23 (ప్రజా మంటలు):
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిజంగా నిజాయితీపరుడైతే గత పాలనలో అవినీతికి పాల్పడ్డ బీఆర్ఎస్ నేతలు తప్పకుండా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బీజేపీ ఎంపీ అరవింద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లేదంటే ప్యాకేజీలకు లొంగుతాడా? లేక ధైర్యంగా చర్యలు తీసుకుంటాడా? అనే విషయం ప్రజలే గమనిస్తున్నారని అన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పీఎంఆర్ హోటల్‌లో మున్సిపల్ ఎన్నికలపై నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సన్నాహక సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ తరఫున పోటీ చేయడానికి అభ్యర్థులే లేని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు.
కెటిఆర్ డ్రగ్స్ పెడ్లర్?
కేటీఆర్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తూ, ఆయన డ్రగ్ పెడ్లర్ అని, స్వయంగా డ్రగ్స్ వినియోగిస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ వినియోగం, రవాణాపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. “డ్రగ్స్ తీసుకునే వాళ్లకు క్యారెక్టర్ ఉంటుందా?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
నా ఫోన్ గత ప్రభుత్వ హయంలో టాప్ అయింది
గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన విషయం వాస్తవమేనని, తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఎంపీ అరవింద్ తెలిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియని పరిస్థితి ఉందని విమర్శించారు. గతంలో ఎమ్మెల్యే తనను కలిసింది కేవలం పరిపాలనా అంశాలపైనే తప్ప, పార్టీ పరంగా కాదని స్పష్టం చేశారు.
జీవన్ రెడ్డి తండ్రితో సమానం
మాజీ మంత్రి జీవన్ రెడ్డి తనకు తండ్రితో సమానమని, ఆయన పట్ల కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు బాధాకరమని అన్నారు. మున్సిపల్ ఎన్నికలు లేకపోయి ఉంటే తానే స్వయంగా వెళ్లి జీవన్ రెడ్డిని పరామర్శించేవాడినని చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి అసలు ఏ పార్టీలో ఉన్నాడోనన్న అయోమయం నల్గొండ, ఖమ్మం జిల్లాల కాంగ్రెస్ నేతల్లోనే ఉందని ఎద్దేవా చేశారు. రేవంత్ కాంగ్రెస్‌లో ఉంటూ, టీడీపీ కార్యకర్తలకు బీఆర్ఎస్ జెండాలు, గద్దెలు కూల్చమని చెప్పడం విడ్డూరమన్నారు. ఎమ్మెల్సీ ఎల్. రమణ కూడా ఏ పార్టీలో ఉన్నాడో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.
బిఆర్ఎస్ కు అభ్యర్థులే లేరు?
రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి దయనీయంగా మారిందని, ఈ పరిస్థితుల్లో రానున్న మున్సిపల్ ఎన్నికలు బీజేపీకి గొప్ప అవకాశమని ఎంపీ అరవింద్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, జిల్లా ఇంచార్జ్ గడ్డం శ్రీనివాస్, రాయికల్ మున్సిపల్ ఇంచార్జ్ బాణాల లక్ష్మారెడ్డి, ధర్మపురి మున్సిపల్ ఇంచార్జ్ బల్మూరు వనిత, జిల్లా ప్రధాన కార్యదర్శి నలువాల తిరుపతి, వడ్డేపల్లి శ్రీనివాస్, జగిత్యాల పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాలలో కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు తీవ్రం.. సంజయ్ కుమార్‌పై జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ వీడే పరిస్థితి ఎందుకు వచ్చింది? జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్జగిత్యాల రాజకీయాలు హీట్.. ఎమ్మెల్యేపై మాజీ మంత్రి ఆగ్రహంకాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిందెవరు? జీవన్ రెడ్డి బహిరంగ విమర్శలుజగిత్యాల మార్చ్ 27 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి... రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక.
జగిత్యాల 16 మార్చి (ప్రజా మంటలు) :
ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ వాక్సన్ యూనివర్శిటీ లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ బాస్కెట్‌బాల్ పోటీలకి జగిత్యాల ధరూర్ లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్ కి చెందిన జి.శివాణి ఎంపిక కావడము జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోతిస్మరియ,... ఇక కాంగ్రెస్ కు రామ్ రామ్ కారు ఎక్కనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి
?జగిత్యాల మార్చి 16 ( ప్రజా మంటలు) మాజీ మంత్రి జీవన్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీకి రామ్ రామ్ చెప్పనున్నట్లు ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి.
సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎన్నో ఉత్తాన పతనాలను ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి... సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తక ఆవిష్కరణ
జగిత్యాల మార్చి 16 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో వార్డ్ కౌన్సిలర్ వానరాశి తిరుమలయ్య సహకారంతో జరిగిన ముందస్తు ఉగాది వేడుకల కార్యక్రమంలో భాగంగా సామాజిక సమరసత వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో" సంచార జాతులు-సమగ్ర సర్వే"పుస్తకావిష్కరణ చేయటం జరిగింది.
సామాజిక సమరసత కార్యకర్తలు తెలంగాణ అన్ని ప్రాంతాల్లోని దాదాపు... జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి కొత్త సంకేతాలు : అధిష్ఠానం మాట వినని జీవన్ రెడ్డి
బీఆర్‌ఎస్/ బీజేపీ లోకి వెళితే పరిస్థితి?
రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి
జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు):
జగిత్యాల రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేసిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆయన ఇంటి ముందు గతంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జాతీయ,... ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన డిగ్రీ కళాశాల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ జగిత్యాల పట్టణంలోని వివిధ డిగ్రీ కళాశాలకు చెందిన అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం... కొడిమ్యాల మండలంలో మళ్లీ పెద్దపులి దాడి – రెండో రోజు మరో ఆవు బలి, భయాందోళనలో గ్రామస్తులు
కొడిమ్యాల, మార్చి 16 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని గంగారం తండాలో మళ్లీ పెద్దపులి దాడి జరగడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరుసగా రెండో రోజు పులి దాడి చేసి మరో ఆవును చంపింది.గ్రామానికి చెందిన రైతు తేజావాద్ మోతీలాల్‌కు చెందిన ఆవుపై సోమవారం పెద్దపులి దాడి చేసి చంపింది.... రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక
జగిత్యాల మార్చి 16(ప్రజా మంటలు)ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ వాక్సన్ యూనివర్శిటీ లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ బాస్కెట్‌బాల్ పోటీలకి జగిత్యాల ధరూర్ లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్ కి చెందిన జి.శివాణిఎంపిక కావడము జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల *ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోతిస్మరియ, సిస్టర్స్ రెజిన,లిల్లీ,రాణి, వ్యాయామ... హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కవిత ఆగ్రహం – డిఫమేషన్ కేసు వేస్తా, మూసీ ప్రక్షాళనపై తీవ్ర విమర్శలు
.“హైడ్రాపై కవిత తీవ్ర ఆరోపణలు: పేదల ఇళ్లు కూల్చి పెద్దలను కాపాడుతున్నారా?”“మూసీ ప్రక్షాళనలో 1400 కోట్లు ఎలా పెరిగాయి? ప్రభుత్వం సమాధానం చెప్పాలి: కవిత”“హైడ్రా వీడియోలు వెంటనే తొలగించాలి.. లేదంటే కోర్టు!” – రంగనాథ్‌కు కవిత హెచ్చరిక“మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజాధనం దోపిడీ జరుగుతోంది: కవిత సంచలన వ్యాఖ్యలు”
వెలుగుమట్ల... బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ,ధర్మసమాజ్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో కాన్సిరాం మహారాజ్ 92వ జయంతి ఉత్సవాలు
జగిత్యాల మార్చి 15) ప్రజా మంటలు) జిల్లా దేవిశ్రీ గార్డెన్ లో నిర్వహించడం జరిగింది .కాన్షిరం కలలు కన్నా రాజ్యాన్ని తెలంగాణ గడ్డపై డాక్టర్ విశారదన్ మహరాజ్ నాయకత్వంలో సాధించి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తాం అని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షుడు మానల కిషన్, ఇంచార్జి దువ్వక శివ మహారాజ్,... ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు
జగిత్యాల మార్చి 15 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్ లోని,,శ్రీ శ్రీనివాస, ఆంజనేయ,భవాని, శంకర, దేవాలయంలో, ప్రతి మాసం, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని, శ్రీదేవి,భూదేవి,సమేత శ్రీ శ్రీనివాసుని కళ్యాణం ఘనంగా జరిగింది.
ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు సత్సంగం... జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ మూల్యాంకనం ప్రారంభం
జగిత్యాల మార్చి 14 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో 15 .03.2026 ఆదివారం నుండి మొదటి విడత మూల్యాంకనము ప్రారంభమవుతుందని క్యాంప్ ఆఫీసర్ బి నారాయణ తెలిపారు
మొదటి విడతలో ఆంగ్లము,తెలుగు, హిందీ, గణితము మరియు రాజనీతి శాస్త్రము (సివిక్స్) మొదలైన సబ్జెక్టులలో మూల్యాంకనము... 