ప్రశ్నించే తత్వం అలవర్చు కోవాలి ప్రముఖ హృద్రోగ నిపుణులు శ్రీధర్ కస్తూరి

On
ప్రశ్నించే తత్వం అలవర్చు కోవాలి  ప్రముఖ హృద్రోగ నిపుణులు శ్రీధర్ కస్తూరి

ప్రశ్నించే తత్వం అలవర్చు కోవాలి ప్రముఖ హృద్రోగ నిపుణులు శ్రీధర్ కస్తూరి

ప్రశ్నించే తత్వం అలవర్చు కోవాలి
ప్రముఖ హృద్రోగ నిపుణులు శ్రీధర్ కస్తూరి

(రామ కిష్టయ్య సంగన భట్ల)
..................................
 విద్యార్థులు బాల్యం నుండే ప్రశ్నించే తత్వం అలవర్చు కావాలని లబ్ద ప్రతిష్టులు, దేశ విదేశాల్లో విఖ్యాతులు, 
ప్రముఖ హృద్రోగ వైద్యులు శ్రీధర్ కస్తూరి సూచించారు. ధర్మపురి క్షేత్రంలోని దశాబ్దాల చరిత్ర గల వాటర్ ట్యాంక్ పక్కన గల మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలకు ప్రముఖ హృద్రోగ వైద్యులు, ధర్మపురి వాస్తవ్యులు డా. శ్రీధర్ కస్తూరి సుమారు 50 వేల రూపాయల విలువ గల స్మార్ట్ టీవీ మరియు సౌండ్ సిస్టమ్ లను బహుమతిగా అందించి, శనివారం లాంఛనంగా ప్రారంభించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాపర్తి విజయలక్ష్మి విజ్ఞప్తి మేరకు విద్యార్థుల సౌకర్యార్థం వీటిని సమకూర్చారు. ఈ సందర్భంగా స్థానికులు డాక్టర్  శ్రీధర్ కస్తూరి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు ఎలాంటి సందేహాలు కలిగినా, వెంటనే గురువుల వద్ద సందేహ నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. కష్టపడి చదివితే ఉన్నత పదవులు ఉద్యోగాలు లభిస్తాయని, అందుకే ఇష్టపడి చదువాలన్నారు. కేవలం చదువే కాక, మంచి స్నేహంతో సమాజాన్ని అర్థం చేసుకుని, ముందుకు సాగాలని వివరించారు. విద్యార్థులకు ఏ అవసరమున్న తీరుస్తానని, పేద విద్యార్థులకు అండగా ఉంటానని తెలిపారు. విద్యావేత్త, బ్యాంకు అధికారి గుండి విష్ణు ప్రసాద్ తమ సందేశంలో... విద్యార్థులు చదువే కాక అన్ని విషయాలపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కొలిచాల శ్రీనివాస్, శ్రీధర్  మిత్రబృందం సభ్యులు రాపర్తి నర్సయ్య, శ్రీ గుండి విష్ణు ప్రసాద్, దూస రాజేశ్వర్, సురేందర్, రాపర్తి రాములు, నారాయణా చార్యులు, జక్కు రవీందర్, పాత బాలచందర్ , పాఠశాల ఉపాధ్యాయులు స్వప్న ప్రియ, భాగ్యలక్ష్మి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
Tags