తెలంగాణ గవర్నర్ తమిలసై సౌందర్య రాజన్ రాజీనామా

On
తెలంగాణ గవర్నర్ తమిలసై సౌందర్య రాజన్ రాజీనామా

తెలంగాణ గవర్నర్ తమిలసై సౌందర్య రాజ రాజీనామా

హైదరాబాద్ మార్చ్ 18: 

తెలంగాణ గవర్నర్ తమిలసై సౌందర్య రాజన్ తన  రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కు పంపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేయాలని ఉద్దేశంతోనే రాజీనామా చేసినట్లు తెలుస్తుంది. గతంలో కూడా ఆమె ఎన్నికల్లో పోటిచేస్తానని ప్రకటించారు.

2019 ఎన్నికల్లో తమిళనాడులోని టుతికొరన్ నుండి డీఎంకే అభ్యర్థి కనిమొళి పై పోటీచేసి ఓడిపోయారు. అప్పుడు ఆమె తమిళనాడు బీజేపీ పార్టీ అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు.ఆమె రాజైనా ఆమోదిస్తే తెలంగాణ కు గవర్నర్గా, ఈ ఎన్నికల సమయంలో ఎవరు వస్తారని ఎదురుచూస్తున్నారు. ఒకవేళ కొత్త గవర్నర్ ను నియమించకుందా, బిజెపికి అనుకూలంగా వ్యవహరించ, తమిళనాడు గవర్నర్ రవి కే బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా లేకపోలేదు 

Tags