మావిడాకుల చాటునున్న ఓ పక్షి.. మా అక్క జాడ తెలిసిందా..!
కామ్రేడ్ లలితక్క అలియాస్ రంగవల్లి స్మృతిలో.
కామ్రేడ్ రంగవల్లి 26 వర్ధంతి. విప్లవ జోహార్లు
(అల్లే రమేష్, సీనియర్ జర్నలిస్ట్, సిరిసిల్ల FB నుండి)
*ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రతిఘటన పోరాటాలు దాకా స్ఫూర్తినిచ్చే "ఆచరణ.."*
ఉమ్మడి రాష్ట్రంలోని 80 దశకం సమాజం కోసం తపన పడిన ఎందరో వీరులను అందించింది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో విప్లవ మేఘాలు అల్లుకున్న కాలం. ఆ కాలమే పీడితుల పక్షాన నిలబడిన మానవీయ తరాన్ని రూపొందించింది.
అలా రూపొందిన తరంలోనే కామ్రేడ్ రంగవల్లి ఎర్రజెండాను ఎత్తి పట్టింది. ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాల నుంచి గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాల నిర్మాణంలో కడదాకా సాగిన కామ్రేడ్ రంగవల్లి జీవితం నుంచి ఈ తరం నేర్చుకోవాల్సిన విషయాలను ఎన్నో అందించి పోయింది.
కామ్రేడ్ రంగవల్లి గురించి ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న పాటలో చెప్పుకుంటే "మావిడాకులు చాటునున్న ఓ పక్షి మా అక్క జాడ తెలిసిందా.. అంటూ రంగవల్లి అక్కను మదిలో తలుచుకొని" రంగవల్లి"సమాజం పట్ల చూపిన మానవీయతను ఆ పాటలో కన్నీళ్ళతో చెప్పిన తీరు కండ్ల ముందు ఇప్పటికీ కదిలినట్టే అనిపిస్తుంది.
ఇంతకీ ఎవరీ"రంగవల్లి"..
ఉమ్మడి రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో వర్ని మండలంలోని వకీల్ఫారం లో ఎస్ .వి .ఎల్ .నరసింహారావు గిరిజ దంపతులకు తొలిసూరి బిడ్డగా డిసెంబర్ 1959లో జన్మించారు. ఇంటర్, డిగ్రీ లో ఉత్తమ విద్యార్థినిగా రాణిస్తూనే విప్లవ రాజకీయాల వైపు తన పయనం కొనసాగించారు. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలలో చదువుతూనే ప్రగతిశీల విద్యార్థి సంఘం రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. పిడిఎస్యు "విజృంభణ "పత్రిక బాధ్యతలను కూడా నిర్వహించారు. అటు నుంచి గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాల నిర్మాణంలో భాగమై సాగారు. విప్లవోద్యమంలో అనేక ఆటుపోట్లకు గురవుతున్న సమయంలో కూడా నిక్కచ్చిగా పీడిత ప్రజల పక్షాన నిలబడి తన ప్రయాణాన్ని కొనసాగించారు. అమరవీరుల ఆశయాలను సమున్నతంగా ఎత్తిపడుతూ ఆ ప్రయాణంలో ఉన్న క్రమంలోనే నవంబర్ 1999లో ఆనాటి ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు మండలం జగ్గన్నగూడెం గ్రామంలోని ఎల్లమ్మ బోడుగండి అటవీ ప్రాంతంలో జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో తుది శ్వాస విడిచారు. తన జీవితాన్ని పీడిత ప్రజల కోసం ధారబోసిన" రంగవల్లి"తన జీవితాన్ని భవిష్యత్ తరాలకు ఆదర్శంగా స్ఫూర్తిగా అందించారు. లలితగా ప్రారంభమై ప్రజా ఉద్యమాలలో "రంగవల్లి"గా మహోన్నతమైన మానవీయ విలువలతో ప్రజలను ప్రేమిస్తూ వచ్చారు.

(నిర్మాణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కమాన్ దగ్గరి రంగవల్లి విజ్ఞాన కేంద్రం)
కామ్రేడ్ రంగవల్లికి రాజన్న సిరిసిల్ల జిల్లాతో విడదీయరాని బంధం ఉన్నది. 1981 ప్రాంతంలో ఆనాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో "గ్రామాలకు తరలండి"పి. డి. ఎస్. యు పిలుపులో భాగంగా"రంగవల్లి"ఈ ప్రాంతంలో ప్రజలతో మమేకం అయ్యారు. ప్రజల సాధక బాధకాలను దగ్గరుండి తెలుసుకోవడమే కాకుండా పీడిత ప్రజల భవిష్యత్తుకు పోరాటాలకు బాసటగా నిలబడ్డారు. సుదీర్ఘకాలం ప్రజలే కేంద్రంగా పనిచేసి నమ్మిన ఆశయం కోసం కడదాకా నిలబడ్డ కామ్రేడ్ "రంగవల్లి"జ్ఞాపకమై మిగిలి 26 వసంతాలు గడుస్తున్న ఇప్పటికి స్ఫూర్తిని అందించే ఆమె జీవితం ఎగురుతున్న ఎర్రజెండలా రెపరెపలాడుతూ భవిష్యత్ తరాలకు స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
మావిడాకుల చాటునున్న ఓ పక్షి.. మా అక్క జాడ తెలిసిందా..!
కామ్రేడ్ లలితక్క అలియాస్ రంగవల్లి స్మృతిలో.
కామ్రేడ్ రంగవల్లి 26 వర్ధంతి. విప్లవ జోహార్లు
(అల్లే రమేష్, సీనియర్ జర్నలిస్ట్, సిరిసిల్ల FB నుండి)
*ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రతిఘటన పోరాటాలు దాకా స్ఫూర్తినిచ్చే "ఆచరణ.."*
ఉమ్మడి రాష్ట్రంలోని 80 దశకం సమాజం కోసం తపన పడిన ఎందరో వీరులను అందించింది. ఉస్మానియా,అలా... జర్నలిస్టుల హక్కుల సాధనకు సమిష్టిగా పోరాడుదాం
టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జెంకి సంపూర్ణ చారి
జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు):
జర్నలిస్టుల హక్కుల సాధనకు సమిష్టిగా పోరాడుదామని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జెంకి సంపూర్ణ చారి పిలుపునిచ్చారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తా వద్ద గల టియుడబ్ల్యూజే ఐజేయు అనుబంధ ప్రెస్ క్లబ్... మెగా జాబ్ మేళా కరపత్రాన్ని ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు)ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ గారి సహకారంతో బ్లూ ఓషన్ కంపెనీ నిర్వహించనున్న మెగా జాబ్ మేళా (మహిళలకు) కరపత్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్లో ఆవిష్కరించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్
10వ తరగతి విద్యార్హత తో ,18 నుండి 35 వయస్సు కలిగి ఉన్న... గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం
జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు)
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా ఈ రోజు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 14 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణ చర్యలు... ప్రజావాణి అర్జీలను వెంటనే పరిష్కరించాలి అర్జీదారుల సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా అదనపు కలెక్టర్లు బి.ఎస్ లత, రాజ గౌడ్
జగిత్యాల నవంబర్ 10 (ప్రజా మంటలు)
ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను పరిష్కరించాలని అధికారులను జిల్లా అదనపు కలెక్టర్లు బి.ఎస్ లత, రాజ గౌడ్ అదేశించారు.
సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను ఆర్డీఓలతో కలిసి అదనపు కలెక్టర్లు స్వీకరించారు
ఈ సందర్భంగా వారు... రెడ్ ఫోర్ట్. వద్ద పేలుడు — భద్రతా వ్యవస్థల వైఫల్యమా?
రెడ్ ఫోర్ట్ వద్ద పేలుడు — భద్రతా వ్యవస్థల వైఫల్యమా? ఉగ్ర హెచ్చరికలకా సూచన?
ఢిల్లీ పేలుళ్లు ఘటనపై ప్రత్యేక విశ్లేషణ
న్యూ ఢిల్లీ నవంబర్ 10 (ప్రత్యేక ప్రతినిధి):
భారత రాజధాని ఢిల్లీలోని ప్రసిద్ధ రెడ్ ఫోర్ట్ సమీపంలో చోటుచేసుకున్న పేలుడు దేశవ్యాప్తంగా భయాందోళనలు రేపుతోంది.ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు తీవ్రంగా... మహాకాళి టెంపుల్ లో కార్తీక మాస సోమవారం వేడుకలు
మహిళ భక్తులకు వాయినాలు *ఆలయ ఆవరణలో ఆకాశదీపం, హరికథ
సికింద్రాబాద్, నవంబర్ 10 (ప్రజామంటలు) :
కార్తీక మాసం సోమవారాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహాకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అమ్మవార్లను దర్శించుకున్నారు. సాయంత్రం ఆకాశదీపం వెలిగించి, మహిళ భక్తులకు వాయినాలు అందచేశారు. కార్తీక మాస... గాంధీ మెడికల్ కాలేజీకి వ్యవసాయ ఉన్నతాధికారి పార్థివ దేహం అప్పగింత
సికింద్రాబాద్, నవంబర్ 10 (ప్రజామంటలు) :
వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్(రిటైర్డ్) ఈ. రాఘవరావు (91)వృద్ధాప్య సమస్యలతో ఆదివారం సాయంత్రం అత్తాపూర్ లో కన్నుమూశారు. గతంలో ఆయన చేసిన డిక్లరేషన్ ప్రకారం ఆయన పార్థివ దేహాన్ని కుటుంబసభ్యులు సోమవారం గాంధీ మెడికల్ కాలేజీకి తీసుకువచ్చి, అనాటమీ డిపార్ట్ మెంట్ కు అప్పగించారు.
వైద్య విద్యార్థుల పరిశోధనల... రాష్ట్ర స్థాయి ఉపన్యాస పోటీలకు ఎంపికైన వెల్లుల్ల విద్యార్ధి
మెట్టుపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు దగ్గర అశోక్):
TSAT Network మరియు TSGHMA సంయుక్తంగా నిర్వహించిన *జగిత్యాల జిల్లా స్థాయి* పోటీల్లో మెటుపల్లి మండలం వెల్లుల్ల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి *గొర్ల శ్రీచరణ్* ఉపన్యాసం [బాలవక్త] పోటీలో *ప్రథమ స్థానం లో గెలిచి "రాష్ట్ర స్థాయి" పోటీలకు ఎంపిక అయినారు.
వ్యాసరచన... టీఎస్ జె యు జగిత్యాల జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
ప్రధాన కార్యదర్శిగా జోరిగే శ్రీనివాస్
మెట్టుపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాల్ నందు జగిత్యాల జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు నారగోని పురుషోత్తం,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల అనిల్ కుమార్, రాష్ట్ర... గొల్లపల్లి మండలంలో గంజాయి పట్టుకొన్న ఎస్ఐ, కృష్ణా సాగర్ రెడ్డి
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని అబ్బాపూర్ గ్రామ శివారులో బాలస్తీ గణేష్ సం 23 వెల్గటూర్ మండలం స్తంభంపల్లి వాస్తవ్యుడు గంజాయి తరలిస్తుండగా పట్టు పడ్డ యువకుని వద్ద నుండి 80 గ్రాముల గంజాయి స్వాదిన పరుచుకొని ఎన్డిపిఎస్ చట్టం కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు
ఎస్ఐ... లోక కవి అందెశ్రీ అకాల మరణాని చింతిస్తు, సంతాపం ప్రకటించిన మిత్రుడు కవి చిన్నాడి రమణారావు
(అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 10 (ప్రజా మంటలు)
తెలంగాణ ఉద్యమంలో 2003 సంవత్సరంలో కరీంనగర్ లో తెలంగాణ సభలో పరిచయము మా మధ్య స్నేహాన్ని వికసింపజేసి నేటి వరకు నిరంతరంగా కొనసాగింది .అందెశ్రీ గొల్లపల్లి మండలం కేంద్రంలో 2005వ సంవత్సరంలో పుస్తకావిష్కరణ సభలో ఆవిష్కర్తగా అలాగే 2022వ సంవత్సరంలో గాయం గేయమైన వేళ సభలో... 