తెలంగాణ అమరవీరులకు, వారి కుటుంబాలకు చేతులెత్తి క్షమాపణ కోరుతున్నా - కల్వకుంట్ల కవిత
'జనం బాట' కు బయలు దేరే ముందు గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు
ఏ ఆశయాల కోసం వారు ప్రాణత్యాగం చేశారో ఆ ఆశయాలు నెరవేరలేదు.
1200 మంది అమరులైతే 580 మందికి మాత్రమే న్యాయం జరిగింది.
ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.
అమరుల కుటుంబాలకు, తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని ప్రమాణం చేస్తున్నా
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ అక్టోబర్ 25 (ప్రజా మంటలు):
తెలంగాణ ఉద్యమంలో అనేక మంది అమరులయ్యారు. వారి త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నాం. ఏ ఆశయాల కోసం వారు అమరులయ్యారో వాటిని ఎంత వరకు సాధించుకున్నామో ఆలోచించుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
పేగులు తెగేదాక కొట్లాడిన ఉద్యమ కారుల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో కూడా ఆలోచించుకోవాలి. తెలంగాణ కోసం 1200 మంది అమరులయ్యారని మనమే అసెంబ్లీ లో చెప్పాం. కాని వారికి ఇవ్వాల్సిన గౌరవం, వారి కుటుంబాలకు ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదు.ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు, ఉద్యోగం ఇస్తామని చెప్పాం. కానీ 580 మందికి మాత్రమే ఇచ్చాం. మిగతా వారికి న్యాయం చేయలేకపోయామని ఆవేదన చెందారు.
ఉద్యమకారుల్లో కొంతమందికి ఎమ్మెల్యే, ఎంపీ, జడ్పీటీసీ, ఎమ్పీటీసీ, సర్పంచులు లాంటి అవకాశాలు వచ్చాయి. కానీ ఇంకా వేలాది మందికి జరగాల్సిన న్యాయం జరగలేదు. ఇప్పటికి ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పేరుతో ఉద్యమం చేస్తున్నారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో నేను మంత్రిగా లేకపోయిన సరే ఎంపీగా, ఎమ్మెల్సీగా కొనసాగిన. అప్పుడు అమరవీరుల కుటుంబాలాకు ఇంకో రూపంలోనైనా డబ్బులు ఇవ్వాలని అంతర్గత వేదికల్లో చెప్పాను. కానీ మీకోసం నేను ఇంకా ఎక్కువగా కొట్లాడేది ఉండేఅమరవీరులకు, వారి కుటుంబాలను చేతులెత్తి క్షమాపణ కోరుతున్నానని అన్నారు.
ఇంకా ఇలా అన్నారు.
తెలంగాణ యావత్ బాగుండాలనే అమరులు వారి ప్రాణాలను త్యాగం చేశారు. ప్రతి అమరవీరుల కుటుంబానికి కోటి రూపాయలు వచ్చే విధంగా పోరాటం చేస్తానని ప్రమాణం చేస్తున్నా. ఈ ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా.
ఒకవేళ ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వకపోతే ప్రభుత్వాన్ని మార్చి వచ్చే ప్రభుత్వంతో నైనా వారికి న్యాయం జరిగేలా చేస్తానని అమరుల పాదాలకు నమస్కరించి చెబుతున్నా. ఉద్యకారుల లిస్ట్ మొత్తాన్ని ప్రజాదర్భార్ పెట్టుకొని తయారు చేద్దాం.
ఆ ఉద్యమకారులందరికీ పెన్షన్ వచ్చే వరకు విరామం లేకుండా నేను పోరాటం చేస్తా. 33 జిల్లాలు 119 నియోజకవర్గాల్లో 'జనం బాట' పేరుతో జనం కోసం బయలుదేరుతున్నా.
మీరు కూడా వచ్చేయండి. అందరం కలిసి పోరాటం చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చింది.ఆ హామీ నెరవేరే వరకు ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాల్సిందే.
ఉద్యమకారుల పోరాటం కారణంగానే తెలంగాణ వచ్చింది. అందరం బాగుండాలనే తెలంగాణ తెచ్చుకున్నాం. మహిళలు, రైతులు, యువకులు, నిరుద్యోగులు, కార్మికులు ఇలా అన్ని వర్గాలకు మేలు జరగాలని తెలంగాణ సాధించుకున్నాం.
కానీ అన్ని వర్గాలకు న్యాయం జరిగిందా అంటే జరగలేదనే చాలా మంది చెబుతున్నారు. అందరు బాగుండాలంటే సామాజిక తెలంగాణ రావాలి. ప్రతి ఒక్కరికీ సమానంగా రాజకీయ, ఆర్థిక పరమైన అవకాశాలు దక్కాలి
జాగృతి ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తోంది. వాటిని సాధించుకుంటాం. ఎస్సీలు, ఎస్టీల కోసం పోరాటం చేస్తున్నాం. మైనార్టీలకు రిజర్వేషన్లు ఉండాలని జాగృతి ఎప్పుడో చెప్పింది.
అగ్రవర్ణాల్లోని అన్ని వర్గాలకు సరైన ప్రాతినిథ్యం లేదు. వైశ్యుల జనాభాకు అనుగుణంగా వారికి ప్రాతినిథ్యం లేదు. అగ్రవర్గాల్లోని అన్ని వర్గాలకు కూడా సమాన అవకాశాలు రావాలి. అందరూ బాగుంటేనే అందమైన బతుకమ్మ లాగా తెలంగాణ ఉంటుంది.
ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ది కోసమే సామాజిక తెలంగాణ కావాలని అంటున్నా.
దానికోసమే నేను జనం బాట కార్యక్రమాన్ని చేపడుతున్నా. ప్రతి జిల్లాలో మేధావులను కలుస్తాం. జిల్లాలో ఎక్కడ అభివృద్ధి ఆగిపోయిందో తెలుసుకుంటాం. ఆయా ప్రాంతాల్లో చేయాల్సిన అభివృద్ధి గురించి చర్చిస్తాం.
జాగృతి లో ఇదివరకు పనిచేసిన వాళ్లను మళ్లీ కలిసి రావాలని ఆహ్వానిస్తున్నా. ఇవ్వాళ ఉన్న ప్రభుత్వానికి అసలు తెలంగాణ సోయి లేదు.
తెలంగాణ తల్లి చేతుల్లోంచి బతుకమ్మను తీసేయటం మన గుండెల్ని మెలి పెట్టినట్లైంది. మళ్లీ తెలంగాణ తల్లి చేతుల్లోకి బతుకమ్మ వచ్చే వరకు పోరాటం చేద్దాం.
తెలంగాణలోని చాలా ప్రాంతాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఈ ప్రాంతంలోని బిడ్డలకే 95 శాతం ఉద్యోగవకాశాలు రావాలని రాష్ట్రపతి ఉత్తర్వులను తెచ్చుకున్నాం.
కానీ ఈ ప్రభుత్వం ప్రాంతేతరులకు ఉద్యోగాలు ఇస్తోంది. హర్యానా సహా పక్కరాష్ట్రాల వారికి తెలంగాణలో ఉద్యోగాలు వస్తున్నాయి.
ఆ అన్యాయాన్ని సహించేది లేదు. జాగృతి చూస్తూ ఊరుకోదు. ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలన్నదే నా అభిమతం.
మరోసారి అమరవీరులకు, వారి కుటుంబాలకు నా తరఫున క్షమాపణలు చెబుతున్నా. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా.
తెలంగాణ సోయి లేని ఈ ప్రభుత్వంపై జంగ్ సైరన్ పూరించాల్సిన అవసరం ఉంది.
ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నా.
More News...
<%- node_title %>
<%- node_title %>
ప్రభుత్వ జూనియర్ కళాశాల మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
రాయికల్ అక్టోబర్ 25(ప్రజా మంటలు)పట్టణ ఇటిక్యాల రోడ్డు లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 17 లక్షల నిధులతో మౌలిక వసతుల కల్పన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ కళాశాల విద్యార్థులు బస్సు సౌకర్యం కోసం వినతి పత్రాన్ని అందజేయగ సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి బస్సు... చలికాలం లో ఆరోగ్యం కాపాడుకోవడం ఎలా. @ డా.సునీల్ సలహాలు
గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొ.ఎల్.సునీల్ కుమార్ సూచనలు..
సికింద్రాబాద్, అక్టోబర్ 25 ( ప్రజామంటలు) :
వణికించే చలికాలం మొదలైంది. వింటర్ లో సాధారణంగా వచ్చే జబ్బులు, ముందస్తు జాగ్రత్తలు,వ్యాధి చికిత్స,తదితర అంశాలపై గాంధీ ఆసుపత్రి జనరల్ మెడిసిన్ హెచ్ఓడీ ప్రొఫెసర్ఎల్.సునీల్ కుమార్ శనివారం ప్రజామంటలు ప్రతినిధితో మాట్లాడారు.
సాధారణంగా వచ్చే... 15 వసంతాల గణేష్ ఫైర్ వర్క్స్ వారి బంపర్ డ్రా
జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన గణేష్ ఫైర్ వర్క్స్ 15 వసంతాలు పూర్తి చేసుకున్న శుభసందర్భంగా కస్టమర్లకు బంపర్ డ్రా ఆఫర్ ఇచ్చారు. దీనిలో భాగంగా బంపర్ డ్రా ఎలక్ట్రిక్ బైక్, పది కన్సోలేషన్ ప్రైసులను విజేతల పేర్లను మీడియా సమక్షంలో డ్రా ద్వారా గణేష్ ఫైర్... యశోద హాస్పిటల్ లో హిమేష్ ను పరామర్శించిన మంత్రి అడ్లూరి
మెరుగైన చికిత్సకు ఆదేశం... ఎంతటి ఖర్చు అయినా వెనకాడేది లేదు....
సికింద్రాబాద్, అక్టోబర్ 25 (ప్రజామంటలు) :
యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న జగిత్యాల జిల్లా ధరూర్ క్యాంపు హాస్టల్ విద్యార్థి హిమేష్ ను షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శనివారం సాయంత్రం పరామర్శించారు.
చికిత్స పొందుతున్న హిమేష్... సర్దార్ @150 యూనిటీ మార్చ్ ను విజయవంతం చేయాలి పోస్టర్ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్
జగిత్యాల అక్టోబర్ 25 ( ప్రజా మంటలు)
భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ, మై భారత్, జగిత్యాల జిల్లా పరిపాలన శాఖ, మరియు ఎన్. ఎస్. ఎస్, ఎన్. సి. సి. సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న సర్దార్ @150 యూనిటీ మార్చ్ ను విజయవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక... గంజాయి తాగుతూ పట్టుబడిన ఇద్దరు యువకుల అరెస్ట్
(అంకం భూమయ్య)
బుగ్గారం అక్టోబర్ 25 (ప్రజా మంటలు): బుగ్గారం మండలంలోని వెల్గొండ గ్రామ శివారులో మోతే విగ్నేష్,(19), మోతె ఇంద్ర కిరణ్,అనే ఇద్దరు యువకులు గంజాయి తాగుతుండగా పోలీసులు పట్టుకొన్నారు.
వారి వద్ద నుండి 80 గ్రాముల స్వాధీన పరుచుకొని ఎన్ డి పి ఎస్ చట్టం కింద కేసు నమోదు చేసుకొని విచారణ... కళాకారునికి. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సన్మానం.
మెట్టుపల్లి అక్టోబర్ 25 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):
కళాకారుల దినోత్సవం సందర్భంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో వెల్లుల్లు గ్రామానికి చెందిన కళాకారుడు ప్రస్తుత ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ యూఏఈ అధ్యక్షులు బత్తిని రాజాగౌడ్ ను అమ్మ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు పుల్ల శ్రీనివాస్ గౌడ్ శనివారం శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.... ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో మహా సంప్రోక్షణ
రెండవ రోజు ప్రత్యేక ఆధ్వాత్మిక కార్యక్రమాలు
సికింద్రాబాద్, అక్టోబర్ 25 (ప్రజామంటలు) :
సీతాఫల్ మండి డివిజన్ శ్రీనివాసనగర్ లో శ్రీగిరి పద్మావతి గోదా సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో జీర్ణోద్దరణ పూర్వక మహాకుంభాభిషేకం మహా సంప్రోక్షణ కార్యక్రమ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం ఆలయంలోని యాగశాల ద్వారతోరణధ్వజ కుమారాధన, ప్రాతరారాధన,... “సావర్కర్‌ను పిల్లలకు నేర్పించమని బీజేపీ కోరినంత మాత్రాన మేము చేయం” —కేరళ విద్యాశాఖ మంత్రి
తిరువనంతపురం, అక్టోబర్ 25:కేరళ విద్యాశాఖ మంత్రి వి. శివంకుట్టి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కే. సురేంద్రన్ చేసిన వ్యాఖ్యలపై కఠినంగా స్పందించారు. సురేంద్రన్ ఇటీవల ఇచ్చిన ప్రకటనలో “కేరళ పాఠశాలల్లో వీర సావర్కర్ గురించి విద్యార్థులకు పాఠాలు బోధించాలని” సూచించారు. దీనికి ప్రతిగా మంత్రి శివంకుట్టి మాట్లాడుతూ, “కేరళ పాఠ్య ప్రణాళికను రాజకీయ ఒత్తిడులకు... ఆరెంజ్ డే సెలబ్రేషన్స్ లో చిన్నారులు
సికింద్రాబాద్, అక్టోబర్ 25 (ప్రజామంటలు) :
సికింద్రాబాద్ భోలక్ పూర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో శనివారం ఆరెంజ్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ విద్యార్థులు పాల్గొని ఆనందంగా ఆరెంజ్ డే ను సెలబ్రేట్ చేశారు. పిల్లలు ఆరెంజ్ రంగు దుస్తులు ధరించి, ఆరెంజ్ బెలూన్లు, పండ్లు, స్నాక్స్ తో స్కూల్‌ను... తల్లిదండ్రులను విస్మరిస్తే జైలుకే.-జగిత్యాల ఆర్డీవో మధుసూదన్
జగిత్యాల అక్టోబర్ 25 (ప్రజా మంటలు):
వయోవృద్ధులైన తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ భాద్యత పిల్లలదే నని విస్మరిస్తే శిక్షర్హులేనని, జైలు శిక్ష,, జరిమానా తదితర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జగిత్యాల డివిజన్ ఆర్డీవో, వయోవృద్దుల ట్రిబ్యునల్ చైర్మన్ పి. మధుసూదన్ హెచ్చరించారు.
శనివారం ఆర్డీవో ఛాంబర్లో వయోవృద్దుల సంక్షేమ చట్టం అవగాహన ప్రచార పత్రిక లను... అదానీ గ్రూపుకు ₹33 వేల కోట్ల LIC నిధుల మళ్లింపు?
వాషింగ్టన్ అక్టోబర్ 25:
వాషింగ్టన్ పోస్ట్, నిన్న ఒక ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ కథనం ద్వారా, అదానీ గ్రూపు సంస్థలకు 33 వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టినట్లు ప్రకటించి, భారత ప్రజలను ఆశ్చర్య పరిచింది. దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా, రాజకీయ పార్టీ లతో పాటు,ఆర్థికసంస్థలు, వ్యవస్థాగత పెట్టుబడిదారులలో సంచలన ప్రకంపనలు సృష్టించింది.
అమెరికాలో అదానీ... 