బీర్పూర్ ను పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేస్తా - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
1 కోటి రూపాయల నిధులు మంజూరుకు తన వంతుగా కృషి చేస్తా
దేవాలయాల్లో రాజకీయాలకు స్థానం లేదు
సామాజిక సేవా కార్యక్రమాల తోనే ప్రజల్లో గుర్తింపు, సేవ చేయాలని లక్ష్యం తోనే రాజకీయాల్లోకి వచ్చాను
సారంగాపూర్ అక్టోబర్ 23 (ప్రజా మంటలు):
బీర్పూర్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ట్రస్ట్ బోర్డ్ నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవ కార్యక్రమానికి హాజరై, ట్రస్ట్ సభ్యులకు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపాటు.
అంతకుముందు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం లో స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల ఎమ్మెల్యే.
ఎమ్మెల్యే మాట్లాడుతూ, సామాజిక సేవా తోనే రాజకీయాల్లోకి రావడం జరిగింది..అనునిత్యం ప్రజల్లో ఉండి బీర్పూర్ మండలం అభివృద్ధికి కృషి చేస్తా.దేవస్థానాల్లో రాజకీయాలకు స్థానం లేదు.రాజకీయాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉన్న నిత్యం సేవ చేస్తా..మన హిందూ మతాన్ని ప్రేమిస్తూ అన్ని మతాలను గౌరవించి అన్నదమ్ముల వలె కలిసి ఉండాలి..మన సంస్కృతి సంప్రదాయాలు ధర్మం కాపాడే బాధ్యత అందరిపైనా ఉంది.కుల మత రాజకీయాల విషయంలో ప్రజలు ఆలోచన చేయాలని అన్నారు.
బీర్ పూర్ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం అభివృద్ధికి గతంలో నిధులు మంజూరు చేయటం జరిగింది మరింత అభివృద్ధి కి తన వంతుగా కృషి చేస్తా,భక్తులు దాతల సహకారం తీసుకొని ఆలయ అభివృద్ధికి ట్రస్ట్ సభ్యులు కృషి చేయాలని కోరారు..
బీర్ పూర్ ను పర్యాటక రంగంగా అభివృద్ధి చేయటానికి కృషి చేస్తా అని,టూరిజం శాఖ మంత్రి గారితో మాట్లాడి 1 కోటి నిధులు మంజూరుకు కృషి చేస్తానని,పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు.తన వంతుగా ఆలయ అభివృద్ధి కి 1 లక్ష విరాళం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో KDCC జిల్లా మెంబర్ ముప్పాళ్ళ రామచందర్ రావు,EO శ్రీనివాస్,ఆలయ నూతన ట్రస్టు సభ్యులు చేర్నేని శ్రీనివాస్,యశోద రమేష్ ,గుమ్మడి రమేష్, పూడూరి గంగమని, చల్లా లక్ష్మణ్, దేవనపెళ్లి జగన్మోహన్, చెక్కపల్లి సత్తన్న, చల్ల లక్ష్మణ్,
ఎనిగంటి సతీష్, చెట్టుపల్లి సత్యనారాయణ,చెన్న గంగాధర్,సామ్రాట్, భీమనాతి లవన్,అల్లెపు సురేందర్,మండల నాయకులు ,తాజా మాజీ సర్పంచ్ లు,ఎంపిటిసి లు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల మాస ఉత్సవాల్లో భాగంగా కొవ్వొత్తుల ర్యాలీ.

బీర్పూర్ ను పర్యాటక ప్రాంతం గా అభివృద్ధి చేస్తా - ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

డీజీపీ ని కలిసిన మాజీ మంత్రి రాజేశం గౌడ్, వ్యాపారవేత్త ప్రమోద్ అగర్వాల్

అమెరికా ఆంక్షల ప్రభావం: రష్యా చమురు దిగుమతులను తగ్గిస్తున్న భారత్ ?
1.jpeg)
సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ స్థలం పరిశీలించిన సిఇ ఎండి ,షఫీమియా

మంత్రి అడ్లూరి పై గాదరీ కిశోర్ వ్యాఖ్యల ఖండన - హెచ్చరిక కబర్ధార్.

మెడికల్ సీట్లు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సన్మానం

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఘనంగా యమద్వితీయ వేడుకలు యమధర్మరాజు స్వామివారికి ప్రత్యేక పూజలు

మండల సమాఖ్య సభ్యులకు యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు

ముగిసిన జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీలు

37, 38 వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

సీనియర్ సిటిజెన్ల హక్కుల రక్షణకు కృషి. -సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్.
