తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం కొనసాగేనా? లబ్ధిదారుల నిరీక్షణ ఫలించేనా?

On
తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం కొనసాగేనా?  లబ్ధిదారుల నిరీక్షణ ఫలించేనా?

తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం కొనసాగేనా? లబ్ధిదారుల నిరీక్షణ ఫలించేనా?

తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం కొనసాగేనా?*
లబ్ధిదారుల నిరీక్షణ ఫలించేనా?

(సిరిసిల్ల రాజేందర్ శర్మ)

తెలంగాణ గొర్రెల పంపిణీ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2018 నాటికి ఒక కోటి 28 లక్షల గొర్రెలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు పంపిణీ చేసింది దీనికిగాను బడ్జెట్లో 12 వేల కోట్లు కేటాయించడం జరిగింది.


*సబ్సిడీ విధానం*
ప్రభుత్వము 75% ఖర్చును లబ్ధిదారుడు 25% భరిస్తాడు. ప్రభుత్వం అంచనా ప్రకారం రెండు సంవత్సరాల్లో గొర్రెల సంఖ్య నాలుగు రెట్లు ఎక్కువ అవుతుందని ఓ అంచనా వీటి మేత కోసం 75% సబ్సిడీ కూడా ఉండేది. అదేవిధంగా షెడ్ల నిర్మాణానికి సైతం ప్రభుత్వం సబ్సిడీ విధానాన్ని అమలుపరిచింది.
 అయితే ఎక్కువ మంది లబ్ధిదారులు కేవలం గొర్రెల కోసం మాత్రమే ఈ పథకాన్ని వినియోగించుకోవడం జరిగింది.

*ఈ పథకానికి అర్హులు*
18 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న సాంప్రదాయ గొర్రెల కాపర్లు, కురుమలు ఈ పథకానికి అర్హులుగా ప్రభుత్వము నిర్ణయించింది. మొత్తం 7.61 లక్షల మంది అర్హులైన వారిలో రెండు లక్షల మందికి పైగా సభ్యులు యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. *తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య* *ఈ పథకం అమలు చేసింది. ఇతర రాష్ట్రాల నుండి కూడా గొర్రెల కొనుగోలు చేసింది అప్పటి ప్రభుత్వం  కాకపోతే లబ్ధిదారుడు స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి గొర్రెలను తీసుకుని వచ్చేవారు.  గొర్రెలను తీసుకొని వారు అదే ప్రాంతంలో డాక్టర్లతో కుమ్ముకై గొర్రెలను అక్కడనే కొనుగోలు చేసిన స్థలంలోనే అప్పజెప్పి నగదు పొందిన దాఖలాలు కూడా లేకపోలేదు.


*రెండవ విడత కోసం ఎదురు చూస్తున్న లబ్ది దారులు*
తొలి విడతలో లబ్ధి పొందని లబ్ధిదారులు మరో విడుదల గొర్రెల ధర పెరిగినప్పటికీ 43,500 డిడి లు తీసిన వారు ఎదురుచూపులతో ఉండిపోయారు.వీరి నిరీక్షణ కార్యరూపం దాలుస్తుందా చూడాల్సిందే.


*ఎన్నికల కోడ్ తో నిలిచిన పథకం*
ఎన్నికల కోడ్ రావడంతో అన్ని సంక్షేమ పథకాలతో పాటు ఈ పథకానికి గ్రహణం పట్టింది. అంతేకాకుండా కొత్త ప్రభుత్వం రావడం తో ఈ పథకంపై లబ్ధిదారుల్లో ఆశలు అడియాశలుగా మారాయి. ఈ పథకం పైన గుంపెడాశతో ఉన్న నిజమైన లబ్ధిదారులు డీడీలు చెల్లించడానికి డబ్బులు లేకుంటే మిత్తిలకు తెచ్చి డీడీలు చెల్లించిన వారు కూడా లేకపోలేదు.


*ఇంతకు ఈ పథకం కొనసాగేనా?*
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పథకం కొనసాగుతుందా? కొత్త ప్రభుత్వం బడ్జెట్ కేటాయించలేక చేతులెత్తేస్తుందా? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. దీంతో రెండో  విడత  గొర్రెల లబ్ధి కోసం డీడీలు చెల్లించిన వారి పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.

Tags