తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ.
.(రామ కిష్టయ్య సంగన భట్ల సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాలమిస్ట్...9440595494)
అవిభక్త కరీంనగర్ జిల్లాలో తొలి తరం నక్సలైట్ నాయకులలో ముఖ్యులైన పండుగ నారాయణ సార్ మే 15న ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు.
మూడు నెలలుగా కాలేయం అన్న వాహిక వద్ద ఏర్పడిన కంతితో, జాండిస్ వ్యాధితో
జీర్ణవ్యవస్థ వ్యవస్థకు అడ్డు పడి ఆపరేషన్ చేయించుకుని, కోలుకుని, తిరిగి అస్వస్తులై , మే 15 వతేదీ గురువారం అర్ధరాత్రి తరువాత తుది శ్వాస విడిచారు.
తెలంగాణ విప్లవోద్యమ చరిత్రలో ఒక వెలుగురేఖ పల్లెమీది నారాయణ. జగిత్యాల జైత్రయాత్రను ముందుండి నడిపించిన సారథిగా, ప్రజా ఉద్యమాలకు సిద్ధాంతాన్ని అందించిన బోధకుడిగా, నక్సలైట్ ఉద్యమం తొలి రోజుల్లో కీలకమైన నాయకుడిగా ఆయన నిలిచారు. విద్యావంతుల్లో , పౌరహక్కుల ఉద్యమ నిర్మాతల్లో ఆయన చేసిన ఉద్యమాల జ్ఞాపకాలు చెరిగి పోనివి.
ఉత్తర తెలంగాణను భూస్వామ్య పెత్తందారీతనం నుండి విముక్తి చేయడానికి జరిగిన పోరాటంలో నారాయణ ఒక గొప్ప గురువుగా ప్రజల మన్ననలు పొందారు. ఉద్యమంలో, జైలు లోపల కూడా సిద్దాంత అధ్యయన తరగతులు నిర్వహించే వారు.
ఉద్యమంలో ఉన్నా, జైలు గోడల మధ్య ఉన్నా ప్రజల చైతన్యం కోసం నిరంతరం తపించిన ఆయనను అందరూ ప్రేమగా "నారాయణ సార్" అని పిలుచు కున్నారు.
పల్లెమీది నారాయణ, కల్లూరు నారాయణ అని కూడా పిలుస్తారు.
1950లో కరీంనగర్ జిల్లా కోరుట్ల మండలం సర్పరాజ్ పల్లెలో జన్మించిన పండుగ నారాయణ విద్యార్థి దశ నుండే చైతన్యంతో నిండారు. ఆ చైతన్యాన్ని ఆయన జీవితాంతం ఉద్యమంగా మలిచారు. తొలుత ఒక ప్రైవేటు పాఠశాలను నడిపిన ఆయన, 1968లో ప్రజల పక్షాన నిలిచారు. నక్సలైట్ ఉద్యమం తెలంగాణలో వ్యాపిస్తున్న సమయంలో ఆయన ఒక సిద్ధాంత కర్తగా, ప్రజలను చైతన్యపరిచే వాగ్ధాటి కలిగిన వక్తగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. జైలు జీవితం అనుభవించినప్పటికీ, అక్కడ కూడా మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనలను బోధిస్తూ ఉద్యమానికి బలమైన పునాదులు వేశారు.
1978 జూలై 17న జరిగిన జగిత్యాల రైతు కూలీ మహాసభ, ఆ తర్వాత చరిత్రలో నిలిచిపోయిన జగిత్యాల జైత్రయాత్రకు ఆయన ముఖ్య సూత్రధారుల్లో ఒకరు. ఈ యాత్ర తెలంగాణ గ్రామీణ ప్రజల్లో భూస్వామ్య వ్యతిరేక పోరాట స్ఫూర్తిని రగిలించింది. విద్యార్థులు, యువకులు గ్రామాల్లో నిర్వహించిన చైతన్య కార్యక్రమాలతో రైతులు, కూలీలు పెద్ద సంఖ్యలో ఉద్యమంలో భాగస్వాములయ్యేలా చేసిన కృషిలో నారాయణ పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆయన వేసిన వ్యూహాలు ఉద్యమాన్ని ప్రజల గుండెల్లోకి తీసుకువెళ్లాయి.
అయితే, కాలక్రమంలో పార్టీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలపై నారాయణ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాలు చేయాలన్న ఆయన ఆలోచనలకు విరుద్ధంగా పార్టీ గెరిల్లా పోరాటాలకు ప్రాధాన్యత ఇచ్చింది. రహస్య మార్గాల కంటే ప్రజలకు చేరువగా ఉండే పోరాట పద్ధతుల వైపు ఆయన మొగ్గు చూపారు. ఈ విభేదాల కారణంగానే 1982లో జైలు పాలై,1984లో జైలు నుండి విడుదలైన తర్వాత ఆయన పార్టీకి దూరమయ్యారు. పార్టీని వీడినా, కేసులు కొట్టేయ బడినా, భూస్వాముల పాత పగలు ఎక్కడ వెంటాడతాయోనని, కొంత కాలం రహస్య జీవితాన్నే ఎంచుకుని, కుటుంబంతో కలిసి, నారాయణ హైదరాబాద్ వెళ్ళి, సిటీ బస్ కండక్టర్ గా కుశాయి గూడ బస్ డిపోలో మూడో నెంబర్ రూట్ పై పని చేసి రిటర్ అయ్యారు.
పార్టీని వీడినప్పటికీ, ఆయన ఆశయాలు మాత్రం మారలేదు. భూస్వాముల దోపిడీని ఆయన ఎప్పటికీ మరచిపోలేదు. కష్టాల చీకటి ఆయన జీవితంలో ఒక భాగమైపోయింది. హైదరాబాద్‌లో సిటీ బస్సు కండక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ తర్వాత, పట్టణ వాతావరణం వీడి, తిరిగి జన్మ నిచ్చిన స్వగ్రామానికే తిరిగి వచ్చారు. ఉద్యమం రూపురేఖలు మారినా, ఆయన లక్ష్యం మాత్రం చెక్కుచెదరలేదు. గ్రామాల్లో సామాజిక మార్పు ఆయన హృదయంలో నిత్యం మెదులుతూనే ఉంది. తన ఆశయాలను గుర్తు చేసుకుంటూ ఆయన మిగిలిన జీవితాన్ని గడిపారు.
నేటి పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీకి తొలి బీజాలు వేసి చరిత్ర సృష్టించిన కార్య కర్తగా, నాయకుడిగా, మార్గదర్శిగా,
నారాయణను విప్లవ చరిత్ర గుర్తుంచు కుంటుంది. నారాయణ ఆలోచనలు సాకారమైతే, ఆ పంథాలో
ఉద్యమాలు సాగితే గ్రామ స్వరాజ్యం, స్థానిక పాలన , బహుజన సామాజిక అధికారం మార్పిడి ఎపుడో జరిగి వుండేదని ఆయన అభిమానులు ఇప్పటికీ భావిస్తుంటారు.
నారాయణ కేవలం చరిత్రలోని ఒక పేజీ మాత్రమే కాదు, ఉద్యమాల స్ఫూర్తి. ఆయన చూపిన మార్గం నేటికీ గ్రామాల్లోని ప్రజలకు, రైతులకు, యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. నేటి మావోయిస్టు ఉద్యమానికి, పీపుల్స్ వార్‌కు ఆయన నాటిన విప్లవ బీజాలే మూలం. జగిత్యాల జైత్రయాత్ర చరిత్రలో నిలిచి ఉన్నంత కాలం, పల్లెమీది నారాయణ పేరు తరతరాలకూ గుర్తుండి పోతుంది.
ఆయన పేరు అమరవీరుల జాబితాలో కనిపించక పోయినా, ఆయన జీవితం ఒక గొప్ప శిల్పం. మానవత్వం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం ఒక నిరంతర ప్రయాణం. తెలంగాణ చరిత్రలో ఉద్యమం అంటే ఏమిటో తన జీవితం ద్వారా చూపించిన ఒక గొప్ప వ్యక్తి ఆయన.
పల్లెమీది నారాయణ సార్ ఒక యుగపురుషుడు అంటే అతిశయోక్తి కాదేమో...
More News...
<%- node_title %>
<%- node_title %>
జగిత్యాలలో కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు తీవ్రం.. సంజయ్ కుమార్‌పై జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు
కాంగ్రెస్ వీడే పరిస్థితి ఎందుకు వచ్చింది? జీవన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్జగిత్యాల రాజకీయాలు హీట్.. ఎమ్మెల్యేపై మాజీ మంత్రి ఆగ్రహంకాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిందెవరు? జీవన్ రెడ్డి బహిరంగ విమర్శలుజగిత్యాల మార్చ్ 27 (ప్రజా మంటలు):జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి తాటిపర్తి... రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక.
జగిత్యాల 16 మార్చి (ప్రజా మంటలు) :
ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ వాక్సన్ యూనివర్శిటీ లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ బాస్కెట్‌బాల్ పోటీలకి జగిత్యాల ధరూర్ లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్ కి చెందిన జి.శివాణి ఎంపిక కావడము జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోతిస్మరియ,... ఇక కాంగ్రెస్ కు రామ్ రామ్ కారు ఎక్కనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి
?జగిత్యాల మార్చి 16 ( ప్రజా మంటలు) మాజీ మంత్రి జీవన్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీకి రామ్ రామ్ చెప్పనున్నట్లు ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి.
సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎన్నో ఉత్తాన పతనాలను ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి... సంచార జాతుల సమగ్ర సర్వే పుస్తక ఆవిష్కరణ
జగిత్యాల మార్చి 16 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో వార్డ్ కౌన్సిలర్ వానరాశి తిరుమలయ్య సహకారంతో జరిగిన ముందస్తు ఉగాది వేడుకల కార్యక్రమంలో భాగంగా సామాజిక సమరసత వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో" సంచార జాతులు-సమగ్ర సర్వే"పుస్తకావిష్కరణ చేయటం జరిగింది.
సామాజిక సమరసత కార్యకర్తలు తెలంగాణ అన్ని ప్రాంతాల్లోని దాదాపు... జగిత్యాల రాజకీయాల్లో జీవన్ రెడ్డి కొత్త సంకేతాలు : అధిష్ఠానం మాట వినని జీవన్ రెడ్డి
బీఆర్ఎస్/ బీజేపీ లోకి వెళితే పరిస్థితి?
రాజకీయ భవిష్యత్తుపై అనిశ్చితి
జగిత్యాల మార్చ్ 16 (ప్రజా మంటలు):
జగిత్యాల రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకుపైగా కాంగ్రెస్ పార్టీకి అంకితమై పనిచేసిన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆయన ఇంటి ముందు గతంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జాతీయ,... ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి
జగిత్యాల డిసెంబర్ 16 (ప్రజా మంటలు)గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన డిగ్రీ కళాశాల విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ జగిత్యాల పట్టణంలోని వివిధ డిగ్రీ కళాశాలకు చెందిన అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బంది సోమవారం రోజున జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వినతి పత్రం... కొడిమ్యాల మండలంలో మళ్లీ పెద్దపులి దాడి – రెండో రోజు మరో ఆవు బలి, భయాందోళనలో గ్రామస్తులు
కొడిమ్యాల, మార్చి 16 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని గంగారం తండాలో మళ్లీ పెద్దపులి దాడి జరగడంతో గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. వరుసగా రెండో రోజు పులి దాడి చేసి మరో ఆవును చంపింది.గ్రామానికి చెందిన రైతు తేజావాద్ మోతీలాల్‌కు చెందిన ఆవుపై సోమవారం పెద్దపులి దాడి చేసి చంపింది.... రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు మౌంట్ కార్మెల్ హైస్కూల్ విద్యార్థిని జి.శివాణి ఎంపిక
జగిత్యాల మార్చి 16(ప్రజా మంటలు)ఈ నెల 20 నుండి 22 వరకు హైదరాబాద్ వాక్సన్ యూనివర్శిటీ లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్స్ బాస్కెట్‌బాల్ పోటీలకి జగిత్యాల ధరూర్ లోని మౌంట్ కార్మెల్ హైస్కూల్ కి చెందిన జి.శివాణిఎంపిక కావడము జరిగింది.
ఈ సందర్భంగా విద్యార్థినిని పాఠశాల *ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ జ్యోతిస్మరియ, సిస్టర్స్ రెజిన,లిల్లీ,రాణి, వ్యాయామ... హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై కవిత ఆగ్రహం – డిఫమేషన్ కేసు వేస్తా, మూసీ ప్రక్షాళనపై తీవ్ర విమర్శలు
.“హైడ్రాపై కవిత తీవ్ర ఆరోపణలు: పేదల ఇళ్లు కూల్చి పెద్దలను కాపాడుతున్నారా?”“మూసీ ప్రక్షాళనలో 1400 కోట్లు ఎలా పెరిగాయి? ప్రభుత్వం సమాధానం చెప్పాలి: కవిత”“హైడ్రా వీడియోలు వెంటనే తొలగించాలి.. లేదంటే కోర్టు!” – రంగనాథ్‌కు కవిత హెచ్చరిక“మూసీ ప్రక్షాళన పేరుతో ప్రజాధనం దోపిడీ జరుగుతోంది: కవిత సంచలన వ్యాఖ్యలు”
వెలుగుమట్ల... బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ,ధర్మసమాజ్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో కాన్సిరాం మహారాజ్ 92వ జయంతి ఉత్సవాలు
జగిత్యాల మార్చి 15) ప్రజా మంటలు) జిల్లా దేవిశ్రీ గార్డెన్ లో నిర్వహించడం జరిగింది .కాన్షిరం కలలు కన్నా రాజ్యాన్ని తెలంగాణ గడ్డపై డాక్టర్ విశారదన్ మహరాజ్ నాయకత్వంలో సాధించి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తాం అని తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షుడు మానల కిషన్, ఇంచార్జి దువ్వక శివ మహారాజ్,... ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు
జగిత్యాల మార్చి 15 ( ప్రజా మంటలు)జిల్లా కేంద్రం కూరగాయల మార్కెట్ లోని,,శ్రీ శ్రీనివాస, ఆంజనేయ,భవాని, శంకర, దేవాలయంలో, ప్రతి మాసం, వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని, శ్రీదేవి,భూదేవి,సమేత శ్రీ శ్రీనివాసుని కళ్యాణం ఘనంగా జరిగింది.
ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుండి 9 గంటల వరకు సత్సంగం... జిల్లా కేంద్రంలో ఇంటర్మీడియట్ మూల్యాంకనం ప్రారంభం
జగిత్యాల మార్చి 14 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని ఎస్ కె ఎన్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల లో 15 .03.2026 ఆదివారం నుండి మొదటి విడత మూల్యాంకనము ప్రారంభమవుతుందని క్యాంప్ ఆఫీసర్ బి నారాయణ తెలిపారు
మొదటి విడతలో ఆంగ్లము,తెలుగు, హిందీ, గణితము మరియు రాజనీతి శాస్త్రము (సివిక్స్) మొదలైన సబ్జెక్టులలో మూల్యాంకనము... 